Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మ వారిని ఎలా పూజించాలో తెలుసా?
దేశ వ్యాప్తంగా దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆరు రోజుల పూజ పూర్తయ్యింది. రేపు అమ్మవారు ఏడవ రోజు పూజలు అందుకోనున్నారు. అయితే ఏడవ రోజు అమ్మవారికి ఏ విధమైన పూజలు చేయాలి, ఏ రూపంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు? ఏ విధముగా అమ్మవారిని ఈరోజు పూజించాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారంటే:
నవరాత్రుల్లో ఏడవ రోజు దుర్గామాత అత్యంత భయంకరమైన, విధ్వంసకరమైన కాళరాత్రి రూపంలో దర్శనమివ్వనున్నారు. దుష్ట శక్తులను సంహరించడానికి, పాప వినాశనానికి, ధైర్యానికి ప్రతీకగా కాళరాత్రి రూపం ఉద్భవించింది. రాక్షసులు అమ్మవారిని దాడి చేసే క్రమంలో ఆమె బంగారు వర్ణపు చర్మం తొలిగిపోయి.. అమ్మవారు భీకరమైన రూపంలో దర్శనమిస్తారు. అందుకే కాళరాత్రి అని పిలుస్తారు.

కాళరాత్రి రూపం ప్రాముఖ్యత ఏమిటి?:
కాళరాత్రి రూపంలో అమ్మవారు రాయల్ బ్లూ రంగును ధరిస్తుంది. ఆ రంగులోనే భక్తులకు దర్శమిస్తుంది. ఈ రూపంలో మంచి, చెడును సరిసమానంగా చూస్తుంది. చెడు చేసే రాక్షసులను సంహరించి, మంచి మార్గం వైపు నడిచే వారిని ప్రోత్సహిస్తుంది. దుష్టులు, భూత ప్రేతాల నుంచి తన భక్తులను రక్షించుకుంటూ లోకాన్ని పాలిస్తుంది. జాతకచక్రములో శనిగ్రహం వల్ల ఏర్పడే ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడేందుకు కాళరాత్రి రూపంలో అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తే ఫలితం ఉంటుందని ప్రతీతి.
కాళరాత్రి అమ్మవారిని ఎలా పూజించాలి?:
అర్ధరాత్రి వికసించే జాస్మిన్ పూలతో కాళరాత్రి రూపంలో ఉండే అమ్మవారిని పూజిస్తే తలితం ఉంటుంది. గణపతి పూజతో ప్రారంభించి, షోడశోపచారాలతో పూజను కొనసాగించాలి. చివరిలో హారతితో పూజను ముగించాల్సి ఉంటుంది. ఇలా పూజిస్తే భక్తులకు తన ధైర్య సాహసాలు ప్రసాదించడంతో పాటు, భక్తుల వెన్నంటే ఉంటూ.. వారికి ఏ ఆపద దరి చేరనివ్వకుండా రక్షిస్తుంది.



Click it and Unblock the Notifications
