Latest Updates
-
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి
రావి, వేపచెట్టుకి ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందా ??
భారతదేశం మొత్తం వివిధ రకాల మతాలు మరియు సంస్కృతి విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. భారతదేశం ఆధ్యాత్మికతకు ఒక భూమి అంటారు. అటువంటి ఆధ్యాత్మికత కోసం ప్రపంచంలోని అని మూలల నుండి వచ్చి సందర్శిస్తుంటారు. మనదేశంలో పురాతన శిల్పకళలు, దేవాలయాలు మతాలు మరియు ఆధ్యాత్మికత యొక్క సారాంశంను ప్రతి రాష్ట్రంలోనూ కనుగొనవచ్చు.
కొన్ని చెట్లు, పవిత్ర ఆధ్యాత్మిక శ్తులు కలిగి ఉన్నాయని మరియు కొన్ని సమయాల్లో దేవుళ్ళుగా పూజించేవారని చెప్పబడింది. అటువంటి ఆధ్యాత్మిక చెట్లలో రావి, కొబ్బరి చెట్టు, బాంగ్ మరియు గంధపు చెట్లు ఇండియాలో వివిధ రాష్ట్రాలలో పూజింపబడుతూ, హిందూ మతంలో వీటిమీద ఎక్కువ నమ్మకం కలిగి ఉన్నారు.
రావిచెట్టును పురుషుడుగాను, వేపచెట్టును స్త్రీగాను భావించి పూజించే ఆచారం అనాదిగా వస్తోంది. సాధారణంగా ఈ రెండు వృక్షాలు కలిసి గానీ ... విడివిడిగా గానీ దేవాలయ ప్రాంగణంలో కనిపిస్తుంటాయి. రావిచెట్టును విష్ణు స్వరూపంగాను ... వేపచెట్టును లక్ష్మీ స్వరూపంగాను భావించి భక్తులు వాటికి ప్రదక్షిణలు చేస్తుంటారు.
రావిచెట్టు, వేప చెట్టు ప్రదక్షిణ చేయడానికి గల ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం...

పిల్లలు సరైన సమయంలో కలగకపోతే
పిల్లలు సరైన సమయంలో కలగకపోతే 28 సార్లు ఆ చెట్ల చుట్టూ ప్రదక్షిణం చేయడం చాలా చోట్ల,చాలా కాలం నుంచి ఉన్నదే.దానికి వైద్యకారణం వెతికితే చిరంజీవి వంటి "రావిచెట్టు" పురుష అంశం కలది."వేపచెట్టు" స్త్రీ అంశం కలది.ఈ రెండు కలసిన ప్రదేశం వద్ద ప్రదక్షిణలు చేయడం వలన శరీరం వాటి నుంచి ఆమ్లజనితము ఇట్టే గ్రహిస్తుంది ....

గర్భ దోషాలను అరికడుతుంది.
గర్భ దోషాలను అరికడుతుంది.ఎక్కువ రోజులు ప్రదక్షిణలు చేయడం ద్వారా వాటిపై నుండి పడిన సూర్యకిరణాల వల్ల గర్భకోశ శక్తి పెరిగి సంతాన వంతులయ్యె అవకాశాలు ఉన్నాయి.

శనిదోషం ఉన్నవారు
శనిదోషం ఉన్నవారు రావిచెట్టుకు పూజచేయాలి. నమస్కరించి, కౌగిలించుకుంటే అనేక దోషాలు పోతాయి.

బుధ్ధుడికి జ్ఞానోదయమైంది."
ఈ రావిచెట్టు క్రిందే బుధ్ధుడికి జ్ఞానోదయమైంది."!!రావి చెట్టు కింద విశ్రమించిన తరువాత మహా జ్ఞానోదయం కలిగి సిద్ధార్ధుడు 'బుద్ధుడు ' అయ్యాడు.అందువల్లనే రావిచేట్టును 'బోధివృక్షం' అంటారు.

శ్రీక్రుష్ణుడు విశ్రమించి వైకుంఠాన్ని చేరాడు.
"శ్రీక్రుష్ణుడు చివరిదశలో ఈచొట్టుక్రిందే విశ్రమించి వైకుంఠాన్ని చేరాడు.

శ్రీమన్నారాయణుడి స్వరూపమని
'పద్మపురాణం'... 'స్కంద పురాణం' కూడా రావిచెట్టు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపమని చెబుతున్నాయి. ఇక రావిచెట్టు కింద సేద దీరడం వలన శని కారణంగా సంక్రమించిన దోషాలు తొలగిపోతాయి.

రక్తపోటుకి
అంతేకాకుండా మనసుకి ప్రశాంతత కలిగి రక్తపోటుకి సంబంధించిన వ్యాధులు రాకుండా నియంత్రిస్తుంది.

ఔషధ గుణాలు
ఇక రావిచెట్టుతో కలిసి పూజలందుకునే వేపచెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగివుంటుంది. వేప ఆకులను నీళ్లలో వేసి కాచి ... ఆ నీటితో స్నానం చేయడం వల్ల చర్మసంబంధమైన వ్యాధులు నశిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.

ఆలయాల్లో రావి, వేపచెట్టు యొక్క విశిష్టత?
ఇక వేపచెట్టు పైనుంచి వచ్చేగాలి కూడా క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. ఇలా ఈ రెండు వృక్షాలు ఇటు ఆధ్యాత్మిక పరంగాను... అటు ఆరోగ్యపరంగాను మానవ మనుగడకు ఎంతో మేలుచేస్తున్నాయి కనుకనే దేవాలయ వృక్షాలుగా పూజలు అందుకుంటున్నాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications