Latest Updates
-
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.!
ముఖం, జుట్టు జిడ్డుగా మారి ఇబ్బంది పెడుతుందా.. భారీ వర్షాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
ఏ సీజన్ అయినా జుట్టు, చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. వేసవిలో దుమ్ము, ధూళి, సూర్యకిరణాల కారణంగా కురులు, స్కిన్ పొడిబారడం, దెబ్బతినడం, ట్యాన్ అవ్వడం వంటివి జరుగుతాయి. ఇక వర్షాకాలంలో జుట్టు, చర్మం జిడ్డుగా, కాంతిహీనంగా మారతాయి. అసలు ఎందుకిలా అవుతుంది.. ఈ కాలంలో ఎలా సంరక్షించుకోవాలి.. నిపుణుల సలహాలు ఇక్కడ చూద్దాం..

వర్షాకాలం ఆరంభమైంది. భారీ వర్షాలకు గాలిలో తేమ చేరి, దుమ్ము, ధూళితో కలిసి చర్మానికి, జుట్టుకి చిరాకు కలిగిస్తాయి. ముఖ్యంగా స్కిన్ జిడ్డుగా, అంటుకున్నట్లుగా మారుతుంటుంది. కురులు కాంతిహీనంగా, జిగురుగా మారి చిక్కుబడిపోయినట్లుగా మారతాయి. ఫలితంగా మొటిమలు, తల దురద పెట్టడం, చుండ్రు ఏర్పడటం, జుట్టు రాలడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే అందరిలో ఇలాంటి సమస్యలే ఉంటాయని కాకుండా వారి వారి శరీరాన్ని బట్టి మార్పులు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
ఇలాంటి దుష్ప్రభావాల నేపథ్యంలో వర్షాకాలంలో జుట్టు, చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. అందుకోసం మీ డైలీ రొటీన్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఈ సమస్యలను సకాలంలో పరిష్కరించుకోవాలి.. లేదంటే అవి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఈ సీజన్‌లో చర్మ, జుట్టు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొన్ని పొరపాట్లను నివారించాలి.
వర్షాకాలంలో మీ ముఖాన్ని బయటకు వెళ్లేముందు వచ్చిన తర్వాత తేలికపాటి ఫేస్ వాష్‌తో మాత్రమే శుభ్రం చేసుకోవాలి. రోజుకు రెండు సార్లు ముఖం కడుక్కుంటే సరిపోతుంది. అదేవిధంగా మీ స్కిన్‌కి సరిపోయే తేలికపాటి మాయిశ్చరైజర్‌ను మాత్రమే వాడాలి. వాతావరణం చల్లగా ఉన్నా సూర్యుడి నుంచి యూవీ కిరణాలు చర్మంపై ప్రభావం చూపిస్తాయి. అందుకే బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఇక, జుట్టు సంరక్షణ కోసం క్రమం తప్పకుండా షాంపూ చేసుకోవాలి. ఈకాలంలో వీలైనంతగా హెయిర్ ప్రొడక్ట్స్‌కి దూరంగా ఉండాలి. తల చర్మం జిడ్డుగా లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి.

తలస్నానం చేశాక వీలైనంత త్వరగా తడి జుట్టును ఆరబెట్టుకోవాలి. ఎక్కువసేపు టవల్‌తో కట్టి ఉంచకూడదు. ఈ కాలంలో పుష్కలంగా నీరు తాగుతూ సమతుల్య ఆహారం తీసుకోవాలి. అప్పుడే చర్మం, జుట్టు ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. బయటి ఫుడ్‌కి వీలైనంత దూరంగా ఉండాలి.
వర్షాకాలంలో బయట తిరిగినప్పుడు చేతులకు బ్యాక్టీరియా అంటుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే చేతులతో తరచూ ముఖాన్ని తాకడం మానుకోవాలి. లేదంటే బ్యాక్టీరియా నోరు, ముక్కు, కళ్లలోకి చేరి ఇన్‌ఫెక్షన్లకి దారి తీసే అవకాశాలు ఎక్కువ. అధికంగా నూనె ఉన్న ఉత్పత్తులను వాడకూడదు. లేదంటే ముఖం, జుట్టు జిడ్డుగా మారి మొటిమలకి దారి తీస్తుంది. ఇంట్లో మురికి టవల్స్ లేకుండా చూసుకోవాలి. మేకప్ బ్రష్‌లను పదేపదే వాడటం మానుకోవాలి.
వర్షాకాలంలో తరచూ మీ ముఖంపై మొటిమలు పెరుగుతూ ఉన్నా.. ఫంగస్ కారణంగా చర్మంపై ఎర్రటి దద్దుర్లు కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. దురద చాలా కాలం పాటు కొనసాగినా, తలలో చుండ్రు కారణంగా చిరాకు ఏర్పడినా నిర్లక్ష్యం చేయకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని చర్మ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో సాధారణం కంటే జుట్టు తరచుగా ఎక్కువగా రాలుతున్నా.. స్కిన్‌పై ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు కనిపించినా వెంటనే డెర్మటాలజిస్టును సంప్రదించి సమస్య తీవ్రం కాకుండా చూసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications