Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ప్రెగ్నెన్సీ సమయంలో యోగా, స్ట్రెచింగ్ చేయవచ్చా.?.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.!
గర్భం దాల్చిన మహిళ్లలో శారీరకంగానే కాకుండా హార్మోన్లలోనూ మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో ప్రెగ్నెన్సీ జర్నీ సాఫీగా సాగేందుకు, ఆరోగ్యకరమైన ప్రసవం కోసం యోగా, స్ట్రెచింగ్‌ను ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అయితే గర్భిణీలు వీటిని ప్రారంభించేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

పెళ్లయిన తర్వాత ప్రతి మహిళ జీవితంలో గర్భధారణ అనేది ఎంతో ప్రత్యేకమైన సువర్ణ అధ్యాయం. ఈ దశలో వారిలో హార్మోన్ల ప్రభావం కారణంగా శారీరక, మానసిక స్థితిలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకే తల్లీబిడ్డ ఆరోగ్యంపై కుటుంబీకులు చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సమతుల్య ఆహారం, విశ్రాంతి, సరైన జీవనశైలిని పాటించాలి. అయితే ఈ సమయంలో గర్భిణీలకు ఎక్కువగా విశ్రాంతి ఇస్తుంటారు. ఇది సరైనది కాదు. ప్రెగ్నెన్సీ కాలంలో మహిళలు శారీరకంగా, మానసికంగా ఫిట్‌నెస్ కాపాడుకోవడంతో పాటు యాక్టివ్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఎంతవరకు శ్రమ పడవచ్చని అనే దానిపై సందేహాలు వస్తుంటాయి.
ప్రతి గర్భిణీ ఆరోగ్యం, అవసరాలు వారి శరీరానికి అనుగుణంగా ఉంటాయి. ఒకరితో ఒకరికి పొంతన ఉండదు. అందుకే వ్యాయామాలు, యోగా, స్ట్రెచింగ్ చేసే ఆలోచనలో ఉన్నప్పుడు ముందుగా కొన్ని జాగ్రత్తలు అవసరం. గర్భధారణ సమయంలో ఒక్కో సమయంలో శరీర అవసరాలు, ఆరోగ్యం మారుతుంటాయి. దీనిని వారు గమనించాలి. అందుకే సంబంధిత వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే సరైన మార్గదర్శకత్వం పాటిస్తూ వ్యాయామాలను ప్రారంభించాలి. యోగా, స్ట్రెచింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సందర్భాల్లో వైద్యులను సంప్రదించాలో తెలుసుకోవాలి.
గర్భధారణ సమయంలో ఎలాంటి కాంప్లికేషన్స్, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేని మహిళలు సంబంధిత వైద్యుడి సలహా మేరకు యోగా స్ట్రెచింగ్ చేయవచ్చని, తేలికపాటి నుంచి మధ్యస్థ శారీరక వ్యాయామాలు చేయవచ్చని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా వీటిని చేయడం ద్వారా ప్రెగ్నెన్నీ జర్నీ చురుగ్గా ఉంటుంది.
గర్భధారణ సమయంలో ప్రతి నెలలో లేదా దశలో శరీర అవసరాలు మారుతుంటాయి. దానికి అనుగుణంగా యోగా, స్ట్రెచింగ్ పద్ధతులను మార్చుకోవాలి. అయితే వ్యాయామం చేస్తున్న క్రమంలో మీకు నొప్పి రావడం, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటివి తలెత్తినా, అసౌకర్యంగా అనిపించినా వెంటనే వాటిని ఆపేసి వైద్యుడిని సంప్రదించాలి.
గర్భిణీలు యోగా, స్ట్రెచింగ్ ప్రక్రియను సొంతంగా కాకుండా యోగా నిపుణుల పర్యవేక్షణలో చేయడం ఉత్తమం. ముందుగా తేలికపాటి వ్యాయామాలతో ప్రారంభించడం వల్ల శరీరానికి ఎక్కువ శ్రమ కలగకుండా ఉంటుంది. గర్భధారణ సమయంలో పుష్కలంగా నీరు తాగుతూ ఉండాలి. బిగుతు దుస్తులు ధరించకూడదు. సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం ద్వారా పొట్టపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.

కొందరు గర్భిణీల్లో అధిక రక్తపోటు, గుండె జబ్బులు, రక్తహీనత, రక్తస్రావం, నెలలు నిండకముందే ప్రసవం అయ్యే ప్రమాదాలు, ప్లాసెంటా సంబంధిత సమస్యలు వంటివి ఉంటాయి. లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. అలాంటి వారు యోగా, స్ట్రెచింగ్ ప్రారంభించే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. గతంలో గర్భస్రావం జరిగిన సందర్భాలు ఉన్నా.. వైద్యుల సలహా తప్పనిసరి. కవలలను మోసే గర్భిణీలు కూడా తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహిస్తూ యోగాసనాలపై సరైన నిర్ణయం తీసుకోవాలి.
సుఖ ప్రసవానికి, ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టేందుకు, ప్రెగ్నెన్సీ జర్నీ సాఫేగా సాగేందుకు యోగాసనాలు, స్ట్రెచింగ్ వంటివి దోహదపడతాయి. అయితే సంబంధింత వైద్యుల సలహా లేకుండా వీటిని ప్రారంభించకూడదు. ముఖ్యంగా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అనుభవిస్తున్న వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
