Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
మగవారికి షాకింగ్ న్యూస్.. మీ శరీరంలో ఈ హార్మోన్ లెవెల్స్ పడిపోవడం గమనిస్తున్నారా.?
నేటి ఉరుకులు పరుగుల జీవితంలో లైఫ్‌స్టైల్ పూర్తిగా మారిపోతోంది. ముఖ్యంగా ఈ పోటీ ప్రపంచంలో మగవారు పూర్తిగా తమ ఆరోగ్యంపై దృష్టి సారించడం లేదు. దీంతో తమ శరీరంలో అతి ముఖ్యమైన టెస్టోస్టెరాన్ హార్మోన్‌పై ప్రభావం పడుతోంది. ఈ హార్మోన్ స్థాయిల్లో మార్పుల కారణంగా వారి మొత్తం శరీర వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తోందని వైద్య నిపుణులు అంటున్నారు.

బిజీ లైఫ్‌లో, పని ఒత్తిడిలో ఆఫీసులో ఉన్నప్పుడే ఆకలి తీరడం కోసం ఏదో ఒక ఫుడ్ తీసుకోవడం, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, శారీరకంగా ఎక్కువగా శ్రమ లేకపోవడం ఇలా పలు కారణాల వల్ల మగవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు పడిపోతున్నాయని గైనకాలజిస్టు నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో టెస్టోస్టెరాన్ అత్యంత ముఖ్యమైన హార్మోన్ కాగా ఇది వారి జీవక్రియ మెరుగ్గా ఉండటంలో కీలకంగా పనిచేస్తుంది. ఈ హార్మోన్ శరీరంలో కండరాలను బలంగా ఉంచుతూ, ఎముకలను కాపాడుతుంది. శక్తిని నిలుపుకొనేందుకు దోహదపడుతుంది. వారిలో మానసిక స్థితి ప్రశాంతంగా ఉండేందుకు, వ్యక్తిగత ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. ముఖ్యంగా మగవారు తండ్రులు కాగలిగే సామర్థ్యం టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలపైనే ఆధారపడి ఉంటుంది.
అయితే పురుషుల వయసు పెరిగే కొద్దీ టెస్టోస్టెరాన్ స్థాయిల్లో కొన్ని మార్పులు చోటుచేసుకోవడం సాధారణమే అయినా.. హార్మోన్ లెవెల్స్ పడిపోవడానికి మరికొన్ని ఇతర కారకాలు కూడా కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో ప్రతి వ్యక్తి ఆరోగ్యం భిన్నంగా ఉండటంతో.. వారిలో ఈ హార్మోన్ ప్రభావం కూడా వేర్వేరుగా ఉంటుంది.
వయసు ప్రభావం కాకుండా.. కాలంతో మారే అలవాట్లు, సరైన జీవనశైలి లేకపోవడం, మద్యం, ధూమపానం లాంటి అనారోగ్య అలవాట్లు, ఆహారంలో మార్పులు ఇలా చాలావరకు కారణాల వల్ల హార్మోన్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఈ క్రమంలో పురుషులు టెస్టోస్టెరాన్ హార్మోన్ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం అవసరం. చెడు జీవనశైలి టెస్టోస్టెరాన్ స్థాయిలను ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లయితే వారు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. బరువును ఆరోగ్యకరంగా నియంత్రణలో ఉంచుకోవడం, క్రమం తప్పకుండా ఉదయం లేదా సాయంత్రం శారీరక వ్యాయామం చేయడం, యోగాసనాలు, సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం. టెస్టోస్టెరాన్ స్థాయిలు పడిపోయిన వారిలో శక్తి క్రమంగా తగ్గిపోతుంటుంది. కండరాల బలం తగ్గడంతో పాటు లైంగిక కోరికలు కూడా సన్నగిల్లిపోతాయి. అంతేకాకుండా మానసిక స్థితిలో కూడా మార్పులను చూస్తారు. అయితే పేలవమైన జీవనశైలితో పాటు సరైన నిద్ర లేకపోవడం, పెరుగుతున్న ఊబకాయం కూడా టెస్టోస్టెరాన్ స్థాయిలను నియంత్రిస్తాయని నిపుణులు అంటున్నారు.
పురుషులు ఆరోగ్యకరమైన టెస్టోస్టెరాన్ స్థాయిలను పొందడానికి, హార్మోన్ సమతుల్యత కోసం క్రమం తప్పకుండా కొన్ని అలవాట్లు పాటించాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన బరువు పాటిస్తూ ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర పాటించాలి. రోజులో కొద్ది సమయం ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. గుడ్లు, చేపలు, దానిమ్మ, ఆకుకూరలు, గుమ్మడి గింజలు, ఉల్లిపాయలు, అల్లం వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గి హార్మోన్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్యానికి దోహదపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
