Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఉద్యోగులు ఏ నగరాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసా.!
ఉద్యోగులు ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసే వారు మెరుగైన జీతం, జీవితం, పదోన్నతుల కోసం నగరాలు మారుతూ ఉంటారు. ఈ క్రమంలో హైదరాబాద్, బెంగళూరు, పుణె, చెన్నె వంటి నగరాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాగా, ఇటీవల బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి మారిన ఓ ఉద్యోగి రెండు నగరాల్లో తన అనుభవాలను ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం రెడ్డిట్‌లో పంచుకున్నారు.

ఐదు నెలల క్రితం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి ఉద్యోగం కోసం మారిన ఓ వ్యక్తి రెండు నగరాల్లో ఏది బెస్ట్ అనేది తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. రెండు సిటీల్లో ఎలక్ట్రిసిటీ, రోడ్లు, వాతావరణం, ఆహారం, ట్రాఫిక్, ప్రజలు, ఉద్యోగ అవకాశాలు వంటి పలు అంశాలపై తేడాలను, పోలికలను వివరించారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇతర ఉద్యోగులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
హైదరాబాద్‌కి ఐదు నెలల క్రితం మారిన తర్వాత ఇక్కడ విద్యుత్ లేకుండా బతకడం ఎంత కష్టమో అనుభవమైందని సదరు ఉద్యోగి వెల్లడించారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఇక్కడ తరచుగా కరెంట్ పోవడం, వేడి వాతావరణంలో రూంలో ఉక్కిరిబిక్కిరిగా అవుతోందని తెలిపారు. ఇక రోడ్ల విషయానికొస్తే హైదరాబాద్ రోడ్లపై గుంతలు లేకపోయినా.. మ్యాన్‌హోల్స్ కారణంగా రోడ్లపై వరద కారణంగా ట్రాఫిక్ అవస్థలు తీవ్రంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇక్కడి రోడ్లపై జాగ్రత్తగా నడపకపోతే నేరుగా ఆస్పత్రికి వెళ్లడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే బెంగళూరు రోడ్లపై గుంతలు ఉన్నా.. అక్కడ నీరు నిలవకపోవడంతో భయంగా వాహనాలు నడిపే పరిస్థితి లేదన్నారు.
బెంగళూరు నగరంతో పోలిస్తే అక్కడ గడిపి హైదరాబాద్‌కి వచ్చినవారికి ఇక్కడి వాతావరణం కొంచెం సవాలుగా ఉంటుందని చెప్పారు. ఇక్కడి వేసవిలో ఉక్కపోత తట్టుకోవడం కష్టమేనన్నారు. ఎయిర్ కండిషనింగ్ లేకుండా ఇక్కడి గదుల్లో నివసించడం దాదాపు అసాధ్యమేన్నారు. బెంగళూరులో వేసవిలో కూడా చల్లగా, ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పారు. అయితే బెంగళూరు భోజనంతో పోలిస్తే హైదరాబాద్ ఫుడ్ చాలా బాగుంటుందని.. ఘాటుగా ఉండే ఆహారం చాలా రుచిగా ఉంటుందని ప్రశంసలు కురిపించారు.

బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారని వ్యక్తి కొనియాడారు. ఇక్కడి ప్రజలకు హిందీ సులభంగా అర్థమవుతుందని.. అయితే బెంగళూరుతో పోలిస్తే ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాటం తక్కువగా ఉంటుందని రెడ్డిట్‌లో రాసుకొచ్చారు. ఇక, హైదరాబాద్‌తో పోలిస్తే బెంగళూరులో ట్రాఫిక్ నిర్వహణ మెరుగ్గా ఉంటుందని.. అయితే రద్దీ సమయాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఇప్పటికీ ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. ఆసక్తికరంగా బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ రోడ్లపైనే విలాసవంతమైన, సూపర్ కార్లు ఎక్కువగా కనిపిస్తాయని.. ఇది ఇక్కడి ప్రజల సంపాదనకి ఉదాహరణ అని చెప్పారు.

సదరు ఉద్యోగి అనుభవంపై రెడ్డిట్ యూజర్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. హైదరాబాద్‌కి చెందిన ఓ యూజర్ స్పందిస్తూ నగరానికి మీరు తప్పుడు సమయంలో వచ్చారని.. గత 30 ఏళ్లలో ఇలాంటి తీవ్రమైన ఎప్పుడూ చూడలేదని అన్నారు. నగరంలో మీరు నివసించే ప్రాంతంపైనే మీ అనుభవం ఆధారపడి ఉంటుందని వెల్లడించారు.
మరికొందరు యూజర్లు భారత్‌లో నివసించడానికి హైదరాబాద్ ఉత్తమమైన ప్రదేశంగా చెప్పారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రజల మధ్య సామరస్యత కారణంగా ఇక్కడ జీవన నాణ్యత, ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని యూజర్లు వెల్లడించారు.
ఏదేమైనా భారత్‌లోని మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ అన్ని విధాలుగా ఉద్యోగులకు సౌకర్యాలను అందిస్తుంది. ఖర్చు పరంగా, భోజనం రుచి పరంగా హైదరాబాద్ నగరం నాణ్యత ప్రమాణాలను పాటిస్తుందనడంలో సందేహం లేదు.



Click it and Unblock the Notifications