Latest Updates
-
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది!
భార్య ఎల్లప్పుడూ భర్తకి ఎడమవైపునే ఎందుకు కూర్చుంటుందో తెలుసా.?
భారతీయ సంప్రదాయంలో వధువు ఎల్లప్పూడు వరుడికి ఎడమవైపునే కూర్చుంటుంది. పూజలు, వ్రతాలు, ఫొటోలు దిగడం, శుభకార్యాలు.. ఇలా ప్రత్యేక సందర్భాల్లో అయినా భార్య భర్తకి ఎడమ వైపే ఉంటుంది. అయితే భర్తకి కుడి వైపున ఎందుకు కూర్చోదు. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలేంటి ఇక్కడ చూద్దాం.

మన సంస్కృతిలో వివాహం అనేది చాలా పవిత్రమైనది. సాంప్రదాయం, ఆధ్యాత్మిక, ఆచార వ్యవహారాలతో అట్టహాసంగా ఈ వేడుక జరుగుతుంది. అయితే భార్య ఎల్లప్పుడూ భర్తకి ఎడమవైపే కూర్చుంటుంది. ఇది కేవలం అనాదిగా వస్తున్న ఆచారం మాత్రమే కాదు.. దీని వెనుక స్వర విజ్ఞానం అనే లోతైన శాస్త్రం ఉందని.. ఇది దంపతుల మధ్య శక్తి, సమతుల్యతను కాపాడుతుందని మనస్తత్వ నిపుణులు అంటున్నారు.
భారతీయ సంస్కృతిలో భర్తలో భార్యను సగంగా భావిస్తారు. అందుకే ఆమెను అర్ధనాగిని, అర్ధాంగి, వామాంగిని అని పిలుస్తారు. శరీరానికి ఎడమ వైపున హృదయం ఉన్న కారణంగా.. భార్య భర్తకి ఎడమవైపున ఉంటే హృదయం మాదిరిగానే భార్య కూడా భర్తకి ఎప్పుడూ దగ్గరలోనే ఉండేలా చేయడమే దీని ఉద్దేశం. హృదయం.. ప్రేమ, భావోద్వేగం, ఆప్యాయతకు చిహ్నం. అందుకే భార్య ఎడమవైపు ఉంటే ఈ స్థానం వారి మధ్య ప్రేమను మరింత పెంచుతుందని ఈ పద్ధతి తీసుకొచ్చారు.
స్వర విజ్ఞానం ప్రకారం.. ప్రాచీన యోగా శరీరంలో ప్రాణ శక్తి, శ్వాస ప్రవాహాన్ని అధ్యయనం చేస్తుంది. బాడీలో ప్రధానమైన ఇడా, పింగళ, సుషుమ్మ నాడులు ఉంటాయి. ఇడా నాడి ఎడమవైపున ఉంటుంది. దీనిని చంద్ర స్వరం అంటారు. ఇది శాంతి, చల్లదనం, స్త్రీతత్వాన్ని సూచిస్తుండగా.. కుడివైపున ఉండే పింగళ నాడి- సూర్య స్వరం.. శక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, పురుష తత్వాన్ని సూచిస్తుంది.
స్త్రీలను చల్లదనం అందించే చంద్ర శక్తికి ప్రతీకగా భావిస్తారు. పురుషులను సూర్య శక్తికి ప్రతీకగా చెబుతారు. అందుకే భార్యను భర్తకు ఎడమ వైపున కూర్చోబెట్టే సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఇలా కూర్చోవడం ద్వారా సూర్య, చంద్ర శక్తుల కలయికతో వారి శక్తులు సమతుల్యమవుతాయి. ఇది వారి వైవాహిక జీవితాన్ని సంతోషభరితంగా చేసి, సంతానోత్పత్తికి దోహదపడుతుందని విశ్వసిస్తారు.

ఆధ్యాత్మిక భావనలను విశ్లేషించినట్లయితే శివ- శక్తి సిద్ధాంతం కూడా ఇడా- పింగళ శక్తి సమతుల్యపైనే ఆధారపడి ఉంటుంది. వీరిద్దరి కలయికే విశ్వాన్ని నిలబెడుతుంది. అందుకే భార్యాభర్తల సంబంధంలోనూ శివపార్వతుల సామరస్యం ఉండాలని భావిస్తారు. ఈ కారణంగానూ భార్య భర్తకి ఎడమవైపున కూర్చుంటుంది.
అయితే ఈ కాలంలో చాలా మంది ఈ సంప్రదాయం, విధానాన్ని పాత నమ్మకం, అనాది ఆచారంగా భావిస్తారు. కానీ దీని వెనుక శారీరకంగా, మానసికంగా బలమైన, ఆధ్యాత్మిక ఆధారాలు ఉన్నాయి. ఇది కేవలం సామాజిక నియమం మాత్రమే కాదు. కుటుంబంలో ఆనందం, శాంతి, మానసిక ప్రశాంతతను పెంపొందిస్తుంది. బంధాలను బలపరుస్తుంది. దంపతుల మధ్య శక్తిని సమతుల్యం చేస్తుంది. అందుకే మన పెద్దలు ఏ ఆచారం పెట్టినా వాటి వెనుక ఖచ్చితంగా ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉంటాయి.



Click it and Unblock the Notifications
