Latest Updates
-
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.!
Rama Navami 2026: శ్రీరాముడి గురించి చాలామందికి తెలియని రహస్యాలు ఇవే!
శ్రీరాముడు..ధర్మం, సత్యం, ఆదర్శాలకు సజీవ ప్రతిరూపం. ఆయన కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, యావత్ భారతదేశానికే ఒక ఆత్మ లాంటివాడు. యావత్ సమాజాన్ని ఏకతాటిపై నడిపించిన మహనీయుడు. చైత్ర నవరాత్రులలో చివరి రోజైన నవమి నాడు శ్రీరాముడు అవతరించాడు.
రాముడు జన్మించిన రోజుని శ్రీరామ నవమిగా ఘనంగా జరుపుకుంటారు. ఈ పవిత్ర రోజున ప్రతి హిందూ వాకిలి రామ నామ స్మరణతో, పూజాదికాలతో మార్మోగుతుంది. వాల్మీకి మహర్షి రచించిన రామాయణం ఆ దివ్య పురుషుని జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ ఏడాది మార్చి 26న శ్రీరామ నవమిని జరుపుకోనున్న సందర్భంలో అందరికీ తెలిసిన రామకథ వెనుక సామాన్యులకు పెద్దగా తెలియని కొన్ని ఆసక్తికరమైన రహస్యాలు ఏంటో ఇక్కడ చూడండి.

గిరిజనుల పాలిట ఆరాధ్య దైవం
పద్నాలుగేళ్ల అరణ్యవాసంలో రాముడు కేవలం కష్టాలను మాత్రమే అనుభవించలేదు. అడవుల్లో నివసించే అమాయక గిరిజనులకు ఒక సరికొత్త జీవన విధానాన్ని నేర్పించాడు. వారు తమను తాము రక్షించుకోవడానికి విల్లంబులు ఎలా తయారు చేసుకోవాలో, వస్త్రాలు ఎలా ధరించాలో, అడవిలోని గుహలను సురక్షితమైన నివాసాలుగా ఎలా మార్చుకోవాలో స్వయంగా నేర్పించాడు.
వారిలో కుటుంబ బంధాలను, పరస్పర గౌరవాన్ని పెంపొందించాడు. అందుకే నేడు భారతీయ గిరిజనులు కేవలం తెగలుగా కాకుండా ఒక చక్కని నాగరిక సమాజంగా జీవిస్తున్నారు.
టెలిస్కోప్ లాంటి అద్భుత అస్త్రం
అగ్నివేషుడు అనే మహర్షి శ్రీరామునికి ఒక ప్రత్యేకమైన అద్దాన్ని బహూకరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది సరిగ్గా నేటి కాలపు టెలిస్కోప్(దూరదర్శిని) లాగా పనిచేసేది.
రామ రావణ యుద్ధ సమయంలో లంకా నగరం ద్వారాలపై శత్రువులు అమర్చిన దరుపంచ అస్త్రం అనే శక్తివంతమైన ఆయుధాన్ని రాముడు ఈ అద్దం ద్వారానే సుదూరం నుంచి పసిగట్టాడు. వెంటనే ఒక క్షిపణి లాంటి అస్త్రాన్ని ప్రయోగించి దాన్ని ముందే ధ్వంసం చేశాడు.
రాముడికి 12 కళలే ఎందుకు ఉన్నాయి?
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరూ సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు అవతారాలే. కానీ కృష్ణుడికి 16 కళలు ఉంటే.. రాముడికి 12 కళలు మాత్రమే ఉన్నాయని చెబుతారు. దీనికి ప్రధాన కారణం రాముడు సూర్యవంశంలో (ఇక్ష్వాకు వంశం) జన్మించడమే. సూర్య భగవానుడికి 12 కళలు ఉంటాయి, కాబట్టి ఆ వంశంలో జన్మించిన రాముడు సూర్యుని పన్నెండు కళలనే తనలో ఇముడ్చుకున్నాడు.
రాముడి కోసం ఇంద్రుని దివ్య రథం
గోస్వామి తులసీదాసు రచనల ప్రకారం..రామ రావణ యుద్ధం ప్రారంభమైనప్పుడు.. రావణాసురుడు సర్వాయుధాలతో కూడిన రథంపై గర్వంగా రాగా, శ్రీరాముడు మాత్రం ఎలాంటి రథం లేకుండా కాలినడకన రణరంగానికి చేరుకున్నాడు.
రాముని శౌర్యం, ఆత్మవిశ్వాసం ముందు రావణుడి ఆడంబరం ఏమాత్రం సరిపోదు. అయినప్పటికీ ధర్మ సంస్థాపన కోసం జరుగుతున్న ఆ యుద్ధంలో రామునికి సహకరించడానికి దేవేంద్రుడు తన దివ్య రథాన్ని యుద్ధభూమికి పంపాడు. ఆ రథానికి మాతలి అనేవాడు సారథిగా వ్యవహరించాడు.

కాకులకు ఇచ్చిన అరుదైన వరం
ఒకసారి దేవేంద్రుని కుమారుడైన జయంతుడు రాముని మహిమను పరీక్షించాలనుకున్నాడు. ఒక కాకి రూపంలో వచ్చి సీతమ్మ పాదాన్ని పొడిచాడు. సీతమ్మకు రక్తం కారడం చూసిన రాముడు తీవ్ర ఆగ్రహానికి గురై ఆ కాకిపైకి దర్భను బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాడు. ప్రాణభయంతో ముల్లోకాలు తిరిగిన జయంతుడు చివరకు రాముడి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు.
ప్రయోగించిన అస్త్రాన్ని వెనక్కి తీసుకోలేను కాబట్టి జయంతుడి ఒక కంటిని మాత్రమే ఆ బాణం తీసుకుంది. ఆ తర్వాత పశ్చాత్తాపపడిన కాకి రూపంలోని జయంతుడిపై జాలిపడిన రాముడు..ఇకపై మీకు (కాకులకు) ఎవరు ఆహారం పెట్టినా, అది వారి పితృదేవతలకు చేరుతుంది, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారు అని ఒక వరం ఇచ్చాడు. ఆ నాటి నుండే పితృకర్మలలో కాకులకు అన్నం పెట్టే ఆచారం మొదలైంది.
శరణాగత రక్షణ - శాపవిముక్తి
రావణ సంహారం తర్వాత రాముడు లంకను ఆక్రమించుకోలేదు. ధర్మబద్ధంగా రావణుడి తమ్ముడైన విభీషణుడిని ఆ రాజ్యానికి రాజుగా చేసి శరణాగత రక్షకుడిగా నిలిచాడు. అలాగే తన భర్త గౌతమ మహర్షి శాపం వల్ల రాయిగా మారిన అహల్యా దేవికి, తన పాదధూళితో శాపవిముక్తి కలిగించిన కరుణామయుడు శ్రీరాముడు.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని బోల్డ్ స్కై తెలుగు ధృవీకరించలేదు.



Click it and Unblock the Notifications
