Latest Updates
-
వర్షాకాలంలో ఈ కూరగాయలను కొనుగోలు చేసేముందు ఈ కీలక జాగ్రత్తలు తప్పనిసరి.! -
భయంకరమైన కాలసర్ప దోషం.. ఈ 4 రాశుల వారికి డేంజర్! -
బజ్జీలు, పకోడీలు వద్దు.. వర్షాకాలంలో రాగి సూప్ ఇలా చేసి తాగితే బోలెడు బెనిఫిట్స్ -
ఆషాఢం ప్రారంభం.. ఈ మాసంలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, హిందూ సంప్రదాయ నియమాలేంటి.? -
స్లీప్ మాక్సింగ్ అంటే ఏంటి? నిద్రపట్టక ఇబ్బంది పడుతునోళ్లకు ఇదెలా ఉపయోగపడుతుంది? -
ఇంకా 15 రోజులే.. ఈ రాశుల వారికి వృత్తి, వ్యాపార రంగాల్లో ఊహించని ధన యోగం.! -
ప్రోటీన్లు పుష్కలంగా ఉండే క్యాబేజీ పల్లీ రైస్.. లంచ్ బాక్స్ లోకి ఈజీగా.. అమృతం టేస్ట్! -
భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారని తెలిపే గ్రీన్ ఫ్లాగ్స్.. ఇవి మీ బంధంలో ఉన్నాయా.? -
మళ్లీ ప్రాణం పోసుకున్న రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలో దంచికొట్టనున్న వానలు! -
మంగుళూరు స్పెషల్ ఘీ మసాలా రవ్వ దోశ.. ఇలా చేస్తే అచ్చం హోటల్ రుచి పక్కా!
హిందూ దేవుళ్లు ఎప్పుడూ నీలం రంగులోనే ఎందుకు కనబడతారో తెలుసా?
గుడికి వెళ్లినప్పుడు గానీ, దేవుని పటాలను చూసినప్పుడు గానీ మనల్ని మొదటగా ఆకర్షించేది శ్రీరాముడు, కృష్ణుడు, శివుడు లాంటి దేవుళ్ల నీలిరంగు దేహం. చాలామంది ఇది వారి నిజమైన చర్మపు రంగు అని అనుకుంటారు. కానీ దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? హిందూమతంలో నీలం రంగు కేవలం ఒక వర్ణం కాదు.. అది అనంతమైన, కొలవలేని దైవత్వానికి సజీవ ప్రతీక.

నీలం.. అనంతానికి, అపరిమితానికి ప్రతీక
ప్రకృతిలో ఆకాశం, సముద్రం రెండూ ఎంతో విశాలమైనవి, అనంతమైనవి. వాటికి ఆది, అంతం ఉండవు. ఈ రెండింటి రంగు నీలమే. భగవంతుడు కూడా ఆకాశమంత విశాలమైనవాడు, సముద్రమంత లోతైనవాడు, అన్ని చోట్లా ఉండేవాడు అని సూచించడానికి వారిని నీలం రంగులో చిత్రీకరిస్తారు.
దేవుళ్లు కూడా మానవ పరిమితులకు అతీతులు, శాశ్వతులు అని చెప్పడానికే ప్రాచీన కళాకారులు వారికి నీలి రంగును అద్దారు. దైవిక శక్తిని, ప్రేమను ప్రాపంచిక కొలబద్దలతో కొలవలేమని చెప్పే అద్భుతమైన రూపకం ఇది.

విష్ణుమూర్తి..విశ్వభారాన్ని మోసే బాధ్యత
శ్రీ మహావిష్ణువు నీలివర్ణం.. ఆయన ఈ అనంత కోటి బ్రహ్మాండాన్ని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా తన భుజస్కంధాలపై సునాయాసంగా మోస్తున్నాడని చెప్పేందుకు ఒక నిశ్శబ్ద సాక్ష్యం. దైవశక్తి ఎంత అపారమైనదో, విశ్వాన్ని నడిపించే ఆయన బాధ్యత ఎంత అనంతమైనదో ఆ నీలి రంగు మనకు తెలియజేస్తుంది.
సాధారణంగా విష్ణుమూర్తిని, రాముడిని, కృష్ణుడిని మేఘ శ్యాముడు అని వర్ణిస్తారు. అంటే వర్షం కురిపించే నల్లటి లేదా ముదురు నీలం రంగు మేఘం లాంటి చర్మం కలవారు అని అర్థం. వర్షపు మేఘం ఎంతో స్వచ్ఛమైన నీటిని ఇస్తూ జీవకోటికి ఎలా ప్రాణం పోస్తుందో, దేవుడు కూడా అంతటి కరుణామయుడు అని దీని అంతరార్థం. ప్రాచీన కాలంలో నలుపు, ముదురు నీలం రంగులను ఒకేలా భావించేవారు. కాలక్రమేణా చిత్రకారులు దేవుడిని నల్లగా చూపించడం కంటే, ఆకర్షణీయమైన నీలం రంగులో చిత్రించడం ప్రారంభించారు.
శ్రీకృష్ణుడు.. హద్దులు లేని ప్రేమకు చిరునామా
కృష్ణుడి నీలి రంగు.. రాధ, గోపికలు, ఈ సృష్టి పట్ల ఆయనకున్న అపరిమితమైన, కల్మషం లేని ప్రేమను సూచిస్తుంది. కృష్ణుడిని ఆ రంగులో చూడటం ద్వారా, భగవంతుని ప్రేమ ఎప్పటికీ వాడిపోనిదని, దానికి ఎలాంటి భౌతిక హద్దులు ఉండవని భక్తులు అనుభూతి చెందుతారు.

పరమశివుడు..నిస్వార్థ త్యాగానికి మారుపేరు
శివుని శరీరం మొత్తం కాకపోయినా, ఆయనను అప్పుడప్పుడు నీలం రంగులో చూపిస్తారు. ముఖ్యంగా ఆయన గొంతు నీలం రంగులో ఉంటుంది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు వచ్చిన హాలాహలం అనే భయంకరమైన విషాన్ని లోకకళ్యాణం కోసం శివుడు మింగాడు. ఆ విషం శరీరంలోకి వెళ్లకుండా పార్వతీదేవి ఆయన గొంతును పట్టుకోవడంతో, ఆ విషం ప్రభావానికి శివుని కంఠం నీలంగా మారుతుంది. అందుకే ఆయనకు నీలకంఠుడు అని పేరు.
కొంతమంది ఆధ్యాత్మిక వేత్తల ప్రకారం, అత్యున్నతమైన ఆత్మజ్ఞానం, స్వచ్ఛత ఉన్నవారి శరీరం చుట్టూ ఉండే ఆరా (శక్తి వలయం) నీలం రంగులో ప్రకాశిస్తూ ఉంటుందట.
కాబట్టి దేవుళ్లు భౌతికంగా నీలం రంగు చర్మంతో పుట్టారని కాదు.. వారి అనంతమైన శక్తిని, కరుణను, విశ్వవ్యాప్తమైన తత్వాన్ని సాధారణ భక్తులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికే మన రుషులు, చిత్రకారులు ఈ నీలం రంగును ఒక సింబల్ గా ఎంచుకున్నారు.



Click it and Unblock the Notifications