Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఆ గుడిలో ప్రసాదంగా నూడిల్స్,మోమోస్..ఈ ఆలయంలో జరిగిన అద్భుతం ఏంటంటే..
మనదేశంలో గుడి లేని ఊరు ఉండదు. దేవాలయాలు,మసీదులు,చర్చిలు లేని ఊళ్లు మనదేశంలో ఉండవు. పరమత సహనం ఉన్న దేశం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భారతదేశం ఒక్కటే. ఎవరికి నచ్చిన దేవుడిని వారు స్వేచ్ఛగా ప్రార్థించుకోవచ్చు. అయితే మనదేశంలోని దేవాలయాల్లో ప్రసాదాలు కూడా పెడుతుంటారు. కొన్ని దేవాలయాల్లో నిత్యాన్నదానాలు కూడా ఉంటాయి. ఆలయాల్లోని ప్రసాదాలు తిని పూట గడుపుకునేవాళ్లు మనదేశంలో చాలా మందే ఉంటారు.
ఫలానా రోజున ఫలాగా గుడిలో ఫలానా ప్రసాదం దొరుకుతుందని కొంతమంది ఈజీగా చెప్పేస్తుంటారు కూడా. దీనికి సంబంధించి కొంతమంది డైరీలు కూడా మెయింటెయిన్ చేస్తుంటారు. మనదేశంలోని ఓ గుడిలో ప్రసాదం మాత్రం చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఒక్కో గుడిలో ఒక్కో రకమైన ప్రసాదాలు పెడుతుంటారు. అలాగే ఓ గుడిలో ప్రసాదంగా నూడిల్ప్,మోమోస్ పెడుతున్నారు. ఈ వైరైటీ ప్రసాదం పెట్టే గుడి వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్ కతా లో ఉంది.
ఈస్ట్ కోల్ కతాలో మినీ చైనా టౌన్ గా పిలువబడే తాంగ్రా ఏరియాలోని మాతేశ్వర్తల రోడ్డులో ఓ చిన్న కాళీమాత ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని చైనీస్ కాళీ టెంపుల్ అని కూడా పిలుస్తుంటారు. ఈ గుడికి చాలా పెద్ద చరిత్రే ఉంది. సంజయ్ ప్రసాద్ అనే వ్యక్తి ఈ ఆలయ బాధ్యతలు చూస్తుంటారు. ప్రసాద్ ..ఆలయం వెనుక ఉన్న ఓ చెనీస్ రెస్టారెంట్ కి ఓనర్ కూడా. ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి రాత్రి 7:30 వరకు ఈ కాళీమాత ఆలయంలో పూజలు జరుగుతాయి. పండుగల సమయంలో ప్రత్యేక పూజలు,వివిధ కార్యక్రమాలు కూడా ఉంటాయి.

పెద్ద సంఖ్యలో భక్తలు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఆలయంలో కాళీమాతతో పాటు శివుని విగ్రహం కూడా ఉంది. ఆలయానికి పూజారిగా అర్ణబ్ ముఖర్జీ అనే వ్యక్తి ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో నారాయణ శిల కూడా ఉంది కాబట్టి వైదిక సాంప్రాదయం ప్రకారం పూజలు నిర్వహిస్తామని ఆలయ పూజారి చెప్పారు. అయితే ఈ ఆలయంలో భక్తులకు ప్రసాదంగా నూడిల్స్,మోమోస్ అందిస్తుంటారు.
చైనీస్ కాళీ టెంపుల్ అని పేరు ఎందుకు వచ్చింది
వరల్డ్ వార్ 2 సమయంలో 1930-1940 ల మధ్య కాలంలో చైనా నుంచి చాలామంది శరణార్థులుగా కోల్ కతాలోని తాంగ్రా ఏరియాకు వచ్చారు. ఆ సమయంలో ఆరు సంవత్సరాలు హిందువులు.. ఒక చెట్టు కింద పసుపు,కుంకుమ రాసి ఉన్న రెండు గ్రానైట్ రాళ్ల దగ్గర పూజలు నిర్వహించేవాళ్లు. అయితే ఒకరోజు అనారోగ్యం బారిన పడిన 10 ఏళ్ల చైనీస్ పిల్లవాడిని అతడి తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకొచ్చారు. డాక్టర్లు ఏమీ చేయలేం అంటూ చేతులెత్తేయడంలో ఏమీ తోచని తల్లిదండ్రులు ఈ మందిరం దగ్గర బాలుడిని పడుకోబెట్టి మా బిడ్డను కాపాడాలి అంటూ ప్రార్థిస్తూనే ఉన్నారు.
ఏదో అద్భుతం జరిగినట్లుగా ఆ పిల్లాడు తర్వాత సడెన్ గా లేచి ఆరోగ్యంగా తిరగడం మొదలుపెట్టాడు. ఈ ఆనందంతో ఆ బాలుడి తల్లిదండ్రులు స్థానిక కమ్యూనిటీ,తమ నమ్మకాల ప్రకారం అదే ప్లేస్ లో ఓ గుడి కట్టారు. అదే ఈ చైనీస్ కాళీ టెంపుల్ గా అయింది.



Click it and Unblock the Notifications