Latest Updates
-
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!
‘అద్దం’తో దంపతుల మధ్య తరచూ గొడవలు.. ఎందుకంటే.?
ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు ఎంత ముఖ్యమో, ఆ ఇల్లు పూర్తయ్యాక ఏ వస్తువు ఎక్కడ అమర్చాలో కూడా అంతే ముఖ్యం. లేదంటే ఇంట్లో లేనిపోని చిక్కులు, సమస్యలు తలెత్తుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా కొందరు బెడ్ రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్, అద్దాలను ఏ మూల ఖాళీ స్థలం ఉంటే అక్కడ పెట్టేస్తుంటారు. అద్దాలను సరైన స్థలంలో అమర్చకపోతే ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ఇందుకు పరిష్కారమేంటో చూద్దాం.

ప్రతి ఇంట్లో బెడ్ రూమ్ అత్యంత ముఖ్యమైన ప్రదేశం. పడక గది ఎంత ప్రశాంతంగా ఉంటే నిద్ర అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆహ్లాదకరంగా ఉంచుకోవాల్సిన గదిలో ప్రతి వస్తువునూ నిర్దిష్టమైన స్థలంలో ఉంచుకోవాలి. అప్పుడే దంపతులు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తారని వాస్తు శాస్త్రం చెబుతోంది. కానీ అద్దాలను తప్పుడు దిశలో ఉంచడం ద్వారా దంపతుల మధ్య ఉద్రిక్తత, మనస్పర్థలు, దూరం ఏర్పడుతుంది.
అద్దం ఎక్కడ ఉంచకూడదు..
వాస్తు నిపుణుల ప్రకారం.. పడకగదిలో మంచం లేదా నిద్రపోతున్న దంపతుల ప్రతిబింబం కనిపించే విధంగా అద్దాన్ని ఎప్పుడూ ఉంచకూడదు. మంచానికి నేరుగా ఎదురుగా గోడకు అమర్చిన అద్దం అశుభంగా పరిగణిస్తారు. ఈ కారణంగా వైవాహిక జీవితంలో మూడో వ్యక్తి జోక్యం పెరిగి భార్యాభర్తల మధ్య గొడవకి దారితీస్తుంది. దాంతో పాటు మానసిక ఒత్తిడి, అశాంతి, నిద్ర సంబంధిత సమస్యలు వాటిల్లుతాయి. నిద్రపోయేటప్పుడు శరీరంలోని శక్తి అద్దం నుంచి వెనక్కి ప్రతిబింబించి, ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.
అద్దం ఏ దిశలో ఉంచాలి
బెడ్‌రూమ్‌లో అద్దాలను ఉత్తరం లేదా తూర్పు గోడపై అమర్చాలి. అద్దంలో ఎట్టిపరిస్థితుల్లోనూ మంచం ప్రతిబింబించకుండా చూసుకోవాలి. ఒకవేళ గదిలో మీ అద్దాన్ని మార్చలేని పరిస్థితి ఉంటే.. రాత్రి పూట దానిని తెరతో లేదా ఏదైనా వస్త్రంలో కప్పడం ద్వారా ప్రతికూల ప్రభావం ఉండదు.



Click it and Unblock the Notifications
