For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెద్దవారి పాదాలకు నమస్కరిస్తే కలిగే లాభాలేంటో తెలుసా?

పెద్దవారి పాదాలకు నమస్కరిస్తే కలిగే లాభాలేంటో తెలుసా?

|

పెద్దల పాదాలకు నమస్కరించడం అనేది గౌరవప్రదమైన చిహ్నంగా పరిగణించబడే ఒక పురాతన భారతీయ సంప్రదాయం. ఈ అలవాటు భారత దేశంలోనే కాకుండా, మరియు విదేశాలలోని దాదాపు భారతీయ మూలాలు ఉన్న అన్ని హిందువుల కుటుంబాలలో చూడవచ్చు. వాస్తవానికి, కొన్ని భారత దేశంలో అనేక సినిమాలు మరియు ప్రకటనలలో కూడా ఈ పద్ధతిని వర్ణిస్తూ, కాళ్ళకు నమస్కరించడానికి గల ప్రాధాన్యతను వివరించాయి.

Why Do Indians Touch the Feet of Their Elders

ఒక వ్యక్తి తమ కన్నా పెద్దవారిని గౌరవిస్తూ, వారి పాదాలకు నమస్కరించినప్పుడు, ఆ పెద్దవారి వయస్సు, అనుభవం, విజయాలు మరియు జ్ఞానాన్ని గౌరవించడాన్ని సూచిస్తున్నందున వారి అహం అణచివేయబడుతుందని భారతీయులు బలంగా విశ్వసిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి వారి పాదాలను తాకిన వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. మీరు తెలుసుకోవలసిన ఈ భారతీయ సాంప్రదాయం గురించిన మరిన్ని వాస్తవాలు మరియు నమ్మకాలు ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి. మరిన్ని వివరాలకు వ్యాసమాలో ముందుకు సాగండి.

పాదాలను నమస్కరించడానికి సరైన మార్గం :

పాదాలను నమస్కరించడానికి సరైన మార్గం :

ఒక పెద్ద లేదా గౌరవప్రదమైన వ్యక్తి యొక్క పాదాలను తాకడానికి లేదా నమస్కరించడానికి మీరు మీ మోకాళ్ళను వంచకుండా, మీ చేతులను ముందుకు వంచుతూ, మీ ముందు శరీరాన్ని వారి ముందు వంచేలా నిలబడాలి. మరియు చేతులు సమాంతరంగా ఉండాలి మరియు మీ కుడి చేయి వారి ఎడమ కాలును తాకి, ఎడమ చేయి వారి కుడి కాలిని తాకేలా నమస్కరించాలి. అప్పుడు ఆ వ్యక్తి వారి కుడి చేతితో మీ తల పైభాగాన్ని తాకి మిమ్మల్ని ఆశీర్వదించాలి.

పెద్దల పాదాలకు నమస్కరించడం వెనుక ఉన్న పురాతన నమ్మకం మరియు శాస్త్రం :

పెద్దల పాదాలకు నమస్కరించడం వెనుక ఉన్న పురాతన నమ్మకం మరియు శాస్త్రం :

పెద్దల పాదాలకు నమస్కరించడమనే సాంప్రదాయంలో లోతైన శాస్త్రీయ కారణం కూడా ఉందని చెప్పబడుతుంది. మానవ శరీరంలోని నరాలు, మన మెదడు నుండి మొదలై, మన శరీరమంతా వ్యాపించి, మన చేతి వేళ్లు మరియు కాళ్ళ వేళ్ళు చివరగా ముగుస్తాయి. పాదాలకు నమస్కరిస్తున్నప్పుడు, మీ చేతి వేళ్ళను ఎదురుగా ఉన్న వ్యక్తి యొక్క పాదాలతో కలిపినప్పుడు, వెంటనే ఇద్దరి మధ్య ఒక క్లోజ్డ్ సర్క్యూట్ (అవినాభావ సంబంధం) ఏర్పడుతుంది మరియు మీ శరీరాల శక్తులు అనుసంధానించబడతాయని చెప్పబడుతుంది. - మీ చేతుల వేళ్లు ఆ శక్తి యొక్క గ్రాహకంగా మారుతాయి, అదేవిధంగా పెద్ద వ్యక్తి యొక్క పాదాలు శక్తిని ఇచ్చేవారిగా మారుతాయి. పెద్దవారు ఈ గౌరవాన్ని అంగీకరించినప్పుడు, వారి హృదయం మంచి ఆలోచనలు మరియు సానుకూల శక్తితో నిండి, తమ చేతులు మరియు కాళ్ళ ద్వారా ఆ శక్తిని చిన్న వారికి ఇవ్వడం జరుగుతుంది.

మీరు ఎవరి పాదాలకు నమస్కరించవచ్చు ?

మీరు ఎవరి పాదాలకు నమస్కరించవచ్చు ?

భారతదేశంలో, ప్రజలు తమ అన్నలు, తల్లి దండ్రులు, తాతలు, ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక గురువులు మరియు ఇతర సీనియర్ సిటిజన్ల పాదాలకు నమస్కరించడం ఆనవాయితీ. పెద్దలు మరియు అటువంటి గౌరవప్రదమైన వ్యక్తుల పాదాలను మాత్రమే తాకినందున, వారి జీవితమంతా కలిపి సంపాదించిన జ్ఞానం, అనుభవం మరియు ధర్మాలకు మనం గౌరవం ఇస్తున్నామని సూచనప్రాయంగా తెలుపడం జరుగుతుంది. ఇవి అత్యంత శక్తివంతమైనవిగా నిరూపించబడ్డాయి, మరియు వారికి మనం చూపే గౌరవం కారణంగా, వారి ఆశీర్వాదాలను కోరుకునే వారికి ప్రయోజనం చేకూరుస్తాయి. అంతేకాకుండా పెద్దలు వయసులో మాత్రమే కాదు, విధానాలలో కూడా పెద్దవారిగా వ్యవహరించాలని చెప్పబడుతుంది. అటువంటి వ్యక్తులే ఆశీర్వదించడానికి సైతం అర్హత పొందగలరు. నేరాలు, ఘోరాలు చేసిన వ్యక్తులు వయసు రీత్యా పెద్దలంటే సమాజమే కాదు, శాస్త్రం కూడా ఒప్పుకోదు. ప్రతి అంశానికి భిన్న వాదనలు, వివరణలు మన పురాతన వేదాలు, పురాణాలు, రచనలలో విశదీకరించి వివరింపబడ్డాయి. నమస్కరించే వానికి, నమస్కారాన్ని స్వీకరించేవారికి ఇరువురికీ మానసికంగా ఒకరిపట్ల ఒకరికి సానుకూల దృక్పధం ఉండాలని కూడా సూచించబడుతుంది.

హిందూ సంప్రదాయంలో పాదాలకు నమస్కరించడం యొక్క ప్రాముఖ్యత :

హిందూ సంప్రదాయంలో పాదాలకు నమస్కరించడం యొక్క ప్రాముఖ్యత :

పెద్దల పాదాలకు నమస్కరించే పద్ధతి భారతదేశంలో వేద కాలంలోనే అవలంబించబడింది. మరియు దీనిని అప్పట్లో చరణ స్పర్శగా వ్యవహరించేవారు. చరణ అంటే ‘అడుగులు’ మరియు స్పర్శ అంటే ‘తాకడం’. హిందూ సాంప్రదాయం ప్రకారం, మీరు పెద్దల పాదాలను తాకినప్పుడు, మీరు జ్ఞానం, తెలివి, బలం మరియు కీర్తితో ఆశీర్వదింపబడుతారు. ఈ మొత్తం చర్యకు అంతర్లీనంగా అర్ధం ఉంది, మీ పెద్ద వాళ్ళు మీ కంటే ఎక్కువ కాలం ఈ భూమిపై నడిచారు, మీకన్నా ఎక్కువ కాలం జీవించారు, మరియు మీకన్నా ఎక్కువ జ్ఞానాన్ని మరియు అనుభవాన్ని సేకరించారు. కావున, వారి పాదాల మీద ఉన్న ధూళిని గౌరవానికి సూచనగా నమస్కరిస్తూ తాకిన పక్షంలో, వారి మార్గాన్ని మీరు అనుసరిస్తున్నామన్న సంకేతాన్ని ఇచ్చినట్లు అవుతుంది. తద్వారా మీ జీవితం మరియు భవిష్యత్తు ఎంతో ప్రయోజనం పొందుతాయి. ఆశీర్వాదంతో పాటుగా, వారి మనసులో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందగలరు. క్రమంగా వారికి మీ ఆలోచనలకు సూచనలు ఇవ్వాలన్న భావన కలుగుతుంది కూడా. క్రమంగా ఇరువురి మద్య, ఒక అనుబంధం ఏర్పడుతుంది.

పాదాలకు నమస్కరించడం మూలంగా కలిగే మానసిక మరియు ఆరోగ్య ప్రయోజనాలు :

పాదాలకు నమస్కరించడం మూలంగా కలిగే మానసిక మరియు ఆరోగ్య ప్రయోజనాలు :

భారతీయ పండితుల అభిప్రాయం ప్రకారం, పాదాలను తాకడానికి ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి. మొదటిది ప్రాథమిక మార్గంగా ముందుకు వంగి పాదాలను తాకడం . రెండవది మీ మోకాళ్లపై కూర్చుని, ఆపై అవతలి వ్యక్తి పాదాలను తాకడం. మూడవది మరియు చివరిది మీ కడుపుపై పడుకోవాల్సిన అవసరం ఉంది, మీ నుదురు నేలను తాకాలి, దీనిని సాష్టాంగ ప్రణామం లేదా సాష్టాంగ నమస్కారం అని పిలుస్తారు. దీనిని సాధారణంగా హిందూ దేవాలయాలలో దేవుని ముందు భక్తులు ఆచరిస్తారు. మరియు గురువుకు నమస్కరించేటప్పుడు కూడా, గురువుని దేవునిలా భావించి సాష్టాంగ నమస్కారం చేయాలని సూచించబడుతుంది. పాదాలను తాకడానికి ముందుకు వంగిన కారణంగా, మీ వెన్ను మరియు నడుము విస్తరించినట్లుగా మారుతాయి. మీరు మీ మోకాళ్లపై కూర్చుని, పెద్దవారి పాదాలను తాకినప్పుడు, మీ మోకాలు వంగి, మీ శరీరంలో ఉన్న కీళ్లన్నీ సాగుతాయి, క్రమంగా ఇది కీళ్ల నొప్పుల నుండి మిమ్మల్ని ఉపశమనం కలిగిస్తుంది కూడా. సాష్టాంగ ప్రణామంలో నిమగ్నమయ్యేటప్పుడు, మీ శరీరమంతా విస్తరించి, శరీర సంబంధిత నొప్పులకు స్వాంతన చేకూరుతుంది. అందుకని తరచుగా పెద్దలకు నమస్కరించాలని పండితులు సూచిస్తుంటారు.

భారతదేశంలో పాదాలకు నమస్కరించే సందర్భాలు :

భారతదేశంలో పాదాలకు నమస్కరించే సందర్భాలు :

భారతీయులు వారి దైనందిన జీవితంలో భాగంగా వివిధ సందర్భాల్లో వారి పెద్దల పాదాలకు నమస్కరిస్తారు.

1) ఏదైనా క్రొత్త బిజినెస్ లేదా సంబంధిత అంశాలను ప్రారంభించేటప్పుడు

2) పుట్టిన రోజులు మరియు వివాహాది శుభకార్యాలలో

3) పండుగ సందర్భాలలో

4) సుదీర్ఘ ప్రయాణానికి వెళ్ళే ముందు

5) పరీక్షకు ముందు లేదా ఒక ముఖ్యమైన సమావేశానికి ముందు

6) మీ ఇంటికి పెద్ద అతిథి వచ్చినప్పుడు లేదా మీరు వారి ఇంటికి వెళ్ళినప్పుడు

ఇటువంటివి దైనందిక జీవితంలో కోకొల్లలుగా ఉంటాయి. ఏదిఏమైనా పెద్దల ఆశీర్వాదాలతో ముందుకు సాగినవాడు ఖచ్చితంగా విజయపథంలో దూసుకుని వెళ్తాడు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Why Do Indians Touch the Feet of Their Elders?

The elder person then, in turn, blesses the person touching their feet. Here are more facts and beliefs about this common Indian practice that you should know.
Desktop Bottom Promotion