Latest Updates
-
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.! -
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు! -
ఒకేసారి ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ.. నోరూరించే ఘాటుతో టిఫిన్ సెంటర్ స్టైల్ టొమాటో చట్నీ.! -
ఆగష్టు 28న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.! -
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది! -
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.! -
ఇతరుల సీక్రెట్స్ తెలుసుకోవడంలో ఈ 3 రాశుల వారే కింగ్స్..వాళ్లవి మాత్రం ముక్క కూడా చెప్పరు!
గర్భవతులను పాము కాటు వెయ్యదా? బ్రహ్మవైవర్త పురాణం ఏం చెబుతుందో తెలుసా?
హిందూమతంలో అనేకానేక ఆచారాలు పాటిస్తుంటారు. భారత్ లో ఉన్న అనేక మతాలు, కులాలు వివిధ ఆచార సాంప్రదాయాలను అవలంబిస్తుంటాయి. అలాగే వివిధ సంస్కృతి సాంప్రదాయాలపై వివిధ రకాల నమ్మకాలు కలిగి ఉంటాం. ఏదైనా విషయాన్ని నమ్ముతుంటే కొంత మంది వాటిని మూఢనమ్మకాలు అనవచ్చు. పురాణాల్లో, వేదాల్లో ఎన్నో రకాల విషయాలు ఉంటాయి.

కొన్నింటి గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం వేయకుండా ఉండదు. అలాంటి వాటిలో బ్రహ్మవైవర్త పురాణం ఒకటి. ఈ పురాణం ప్రకారం గర్భిణులను పాము కాటు వేయదని నమ్ముతుంటారు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం గర్భిణిల వద్దకు పాము వెళ్లదు.. అలాగే గర్భిణీలను చూడగానే పాములు చూపు కోల్పోతాయి. ఈ పురాణం ప్రకారం గర్భిణీలను పాములు ఎందుకు కాటు వేయ్యదో ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భవతులను పాములు ఎందుకు కాటెయ్యవంటే?
మనుషులకు ఇంద్రియాలు ఉన్నట్లుగానే పాముకు కూడా కొన్ని ఇంద్రియాలు ఉంటాయి. ఈ ఇంద్రియాలను పాములు ఉపయోగించుకుంటూ ఉంటాయి. వాటి ద్వారానే పాములు జీవిస్తాయి. మనిషికి ఇంద్రియాలు ఎంత ముఖ్యమో.. పాము జీవితంలో కూడా ఇంద్రియాలు అంతే ముఖ్యమైనవి.
ఈ ఇంద్రియాలతోనే పాములు స్త్రీని చూసి గర్భిణీ అవునో కాదో స్ఫష్టంగా గుర్తించగలుగుతుందట. గర్భం ధరించిన సమయంలో మహిళల్లో వచ్చే మార్పులను పాములు గుర్తిస్తాయని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. ఇలా గుర్తించిన పాములు గర్భిణీలను కాటు వేయవని చెబుతోంది పురాణం. ఒకప్పుడు ఓ గర్భిణీ శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర తపస్సు చేస్తుంది. ఆమె శివ తపస్సులో మునిగి ఉన్న సమయంలో రెండు పాముల వల్ల ఆమె తపస్సుకు భంగం కలుగుతుంది. ఆమె అప్పటి వరకు చేసిన తపస్సు వల్ల వచ్చిన శక్తితో తన గర్భంలో ఉన్న పిండాన్ని గుర్తించగలుగుతుంది.
తన కడుపులో బిడ్డ సర్పజాతికి చెందినది కావడంతో పాటు తన తపస్సుకు భంగం కలిగించిన ఆ పాములను ఆ గర్భిణీ శపిస్తుంది. గర్భిణీలను చూడగానే పాముల కళ్లు కనిపించకూడదని ఆమె శాపం పెట్టింది అప్పటి నుంచి గర్భిణీని చూడగానే పాములు గుడ్డివి అయిపోవడంతో పాటు గర్భిణీలను కాటు వేయడానికి సాహసించవని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. అలాగే గర్భిణీలకు కలలో కూడా పాములు కనిపించవని కూడా అంటారు.
శాస్త్రం ఏం చెబుతోందంటే..
గర్భిణీని పాము కాటు వేయకపోవడానికి విశ్వాసం ఒక కారణం అయితే. శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. గర్భవతి అయిన తర్వాత స్త్రీ శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. అందులో హార్మోన్ల మార్పు కూడా ఒకటి. గర్భం ధరించిన స్త్రీ శరీరంలో కొన్ని ప్రత్యేక మార్పుపు జరుగుతాయి. వీటి వల్ల స్త్రీ స్వభావం, ఆసక్తి, రంగు రూపుల్లో చాలా రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. గర్భిణీ స్త్రీలలో వచ్చే ఈ మార్పులను పాములు తమ ఇంద్రియాలతో గుర్తిస్తాయని, అందుకే గర్భిణీల వద్దకు వెళ్లవని అంటుంటారు. అయితే ఈ విషయంపై ఎలాంటి శాస్త్రీయా ఆధారాలు లేకపోవడం గమనార్హం.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications