Latest Updates
-
మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలివే! -
డీప్‌ఫేక్ సెక్స్టార్షన్ ఉచ్చులో పడ్డారా? మీ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే! -
కిడ్నీ రాళ్లను ఇట్టే కరిగించే ఉలవలతో టేస్టీ వడలు..తయారీ విధానం ఇదే! -
తెలంగాణ-ఏపీలో ఎండల తీవ్రత: గర్భిణీలకు పొంచి ఉన్న ముప్పు ఇదే! -
ఇడ్లీ,దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్ కరివేపాకు కొబ్బరి చట్నీ..మామూలు చట్నీల కంటే 100 రెట్లు రుచి! -
వేసవిలో బరువు తగ్గాలా? అయితే మజ్జిగలో ఈ చిన్న పొడి కలిపి తాగితే, మీ పొట్టలోని కొవ్వు మంచులా కరిగిపోతుంది! -
విజయ్–త్రిష వెడ్డింగ్ వీడియో.. సోషల్ మీడియాలో రచ్చ! అసలు నిజం ఇదేనా? -
ఓట్స్ అంటే ఇష్టం లేదా? ఇలా గంజిలా చేసి చూడండి..బరువు తగ్గడంతో పాటు రుచీ మీ సొంతం! -
పప్పుల పొడి బోర్ కొట్టిందా? అయితే ఈ ఘాటైన ఆంధ్రా చికెన్ కారప్పొడి ట్రై చేయండి! -
పీరియడ్స్ ఆలస్యం అవ్వడానికి అసలు కారణం ఇదేనట!
పుస్తకాలు, మనుషుల కాళ్ళకు ఎందుకు తగలకూడదు?
హిందువుల ఇళ్ళల్లో, చిన్నప్పటినుంచీ కాగితాలకి, పుస్తకాలకి మరియు మనుషులకి కాళ్ళను తగలనివ్వ కూడదని నేర్పించబడుతుంది. ఒకవేళ పొరబాటున కాగితాలకి, పుస్తకాలకి, సంగీత సాధనాలకి లేదా ఏ ఇతరమైన విద్యా సంబంధమైన వస్తువులకి కాలు తగిలితే క్షమాపణకి గుర్తుగా కాలు తగిలిన వస్తువుని గౌరవపూర్వకముగా చేతితో తాకి కళ్ళ కద్దుకోవాలని పిల్లలకు నేర్పించడం జరుగుతుంది.

కాగితాలకు, మనుషులకు కాళ్ళు ఎందుకు తగలకూడదు?
భారతీయులకు జ్ఞానము పవిత్రము, దివ్యము ఐనది. అందువలననే దానికి ఎల్లవేళలా గౌరవమివ్వాలి. ఈ రోజుల్లో పాఠ్యంశములను ఆధ్యాత్మికము ఐహికము అని విడదీస్తున్నాము. కానీ ప్రాచీన భారతదేశములో ప్రతి విషయము శాస్త్ర సంబంధమైన లేక ఆధ్యాత్మ సంబంధమైనది అయినా సరే పవిత్రంగా పరిగణించి గురువుల చేత గురుకులాల్లో నేర్పించబడేది.

చదువుకి సంబంధించిన వస్తువులని తొక్క కూడదనే ఆచారము భారతీయ సంస్కృతి విద్యకు ఇచ్చే ఉన్నత స్థానాన్ని తరచూ గుర్తు చేస్తుంది. చిన్న తనమునుంచే ఈ విధముగా నేర్పడము వలన మనలో పుస్తకాల పట్ల, విద్య పట్ల శ్రద్దాభక్తులు నాటుకు పోతాయి. జ్ఞానాధి దేవతకు అర్పణగా సంవత్సరానికి ఒకసారి సరస్వతీ పూజ లేదా ఆయుధపూజ రోజున మనము పుస్తకాలని వాహనాలని మరియు పనిముట్లని పూజించడానికి కూడా ఇది ఒక కారణము. మనము చదువుకునే ముందు ఈ క్రింది విధంగా ప్రార్థిస్తాము .

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
వరాలనిచ్చి, కోరికలని తీర్చే ఓ సరస్వతీ దేవీ! నా చదువును ఆరంభించే ముందర నీకు నమస్కారము చేస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా కోరికలు తీర్చుదువు గాక!
పిల్లలు పొరపాటున ఎవరికయినా కాళ్ళు తగిలినప్పుడు చాల భయపడతారు. ఒకవేళ పొరపాటున తగిలితే క్షమాపణకై మనము ఆ వ్యక్తిని చేతితో తాకి వేళ్ళను కళ్ళకు అద్దుకోవాలి. పెద్దవాళ్ళయినా చిన్నవాళ్ళని అజాగ్రత్తతో కాళ్ళతో తగిలితే, వారు వెంటనే క్షమాపణ చెప్తారు.

ఇతరులకి కాళ్ళు తాకడము చెడునడవడిగా పరిగణింప బడుతుంది - ఎందుకు?
మానవుడు ఈ భూమి మీద ప్రాణముతో, భగవంతుని యొక్క చక్కటి ఆలయముగా పరిగణింప బడుతాడు. అందువల్ల ఇతరులను పాదాలతో తాకడము అంటే వారిలో నున్న దివ్యత్వాన్ని అగౌరపరచడం వంటిదే. అందుకే పొరపాటున తగిలినా కూడా వెంటనే భక్తీ, వినయములతో కూడిన క్షమాపణను చెప్పాలి.

పై విధముగా మన ఆచారములు చాల సరళమైనవి. కానీ అవి చాలా శక్తివంతమైన పరిపూర్ణమైన ఆధ్యాత్మిక సత్యాలను గుర్తుకు తెస్తాయి. ఇటువంటి ఆచారాలు శతాబ్దాలనుండి భారతీయ సంస్కృతిని సజీవముగా నిలబెట్టడానికి కారణమయ్యాయి.



Click it and Unblock the Notifications