Latest Updates
-
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.!
కార్తీక మాసంలో తులసి, ఉసిరి మొక్కలను కలిపి పూజించడంలో ఆంతర్యం ఏమిటి?
తులసి మొక్కను గౌరీదేవిగా, ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా పూజింపడం వల్ల, గౌరీ పూజ చేయడం వ్లల ఆర్థిక బాధలు తొలగి, సర్వ సంపదలు కలుగుతాయి. ఉసిరి మొక్కను సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు కాబట్టి, స్వ
ఉసిరికాయను దైవవృక్షంగా భావిస్తారు గనుకే కార్తీకమాసంలో వనభోజనాల సందర్భంగా ఉసిరి చెట్టు వద్ద వంటలు వండుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. కార్తీక మాసంలో పూజలకు, అనేక నోములు, వ్రతాల్లోనూ ఉసిరికి ప్రాధాన్యం ఉంది. తరచూ ఉసిరికాయలు తినేవారు అనారోగ్యాలకు దూరంగా ఉంటారని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు.
క్షీరాబ్ది ద్వాదశిగా పిలుచుకునే రోజున సాయంత్రంలో ఇంటిలోని తులసి మొక్క దగ్గర ధాత్రి (ఉసిరి మొక్క)ను ఉంచి విష్ణు మూర్తికి పూజలు చేస్తారు. 12, 16, 21 దీపాలను వెలిగించి, మహిళలు ప్రత్యేకంగా పూజ చేసుకుంటారు వీటినే ద్వాదశ దీపాలు అంటారు. ఆరోజున ప్రతీ ఇంటా ఈ దీపాల వెలుగులతో నిండిపోతుంది.

తులసి మొక్కను గౌరీదేవిగా, ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా పూజింపడం వల్ల, గౌరీ పూజ చేయడం వ్లల ఆర్థిక బాధలు తొలగి, సర్వ సంపదలు కలుగుతాయి. ఉసిరి మొక్కను సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు కాబట్టి, స్వామి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీ ఉంటుంది. లక్ష్మీ ఉంటే కరువు అనేది ఉండదు, కార్తీక మాసంలో ఉసిరి మరియు తులసి పూజ చేస్తే ఎంతో పుణ్యఫలం కూడా లభిస్తుంది.

కార్తీక మాసంలో తులసి మొక్క చాలా విశిష్టమైనది. తులసి మొక్క అమ్మవారు స్వరూపం, పవిత్రమైనదిజ ఈ మొక్కను పెంచడం వల్ల అద్రుష్టంతో పాటు ఆరోగ్యం కూడా పొందుతారు. ప్రతి రోజూ తులసి కోటకు పూజ చేసుకోవడం ఆ ఇంటి ఇల్లాలి భాగ్యమని అనుకోవాలి.

ధాత్రిపూజ..
ధాత్రి అంటే ఉసిరి అని అర్థం. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమైఎంతో ఇష్టమైనది. కార్తీకమాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టం. ఉసిరివృక్షం మొదట్లో ధాత్నీదేవిని, దామోధరస్వామిని పూజింది, మధుర పదార్థాలను నివేదించాలి. బంధు మిత్రులతో కలసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో వనభోజనాలకు వెళ్లడం ఆనవాయితీ.

కార్తీక మాసంలో ఉసిరి ప్రాధాన్యత:
కార్తీకమాసంలో ఉసిరికి ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. ఉసిరిని ఆరోగ్యసిరిగా చెప్పుకుంటారు. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే ఉసిరికాయలను ఈ మాసంలో తినడం వల్ల అనారోగ్య సమస్యలు ధరిచేరవు. ప్రతి రోజూ ఒక ముద్ద అన్నం ఉసిరికాయతో కానీ, ఉసిరిపచ్చడితో కానీ తింటే శరీరంలోని అనారోగ్యం ఉన్నా కానీ దానంత అదే పోతుంది. నోటి పూతను తగ్గించే గుణం ఉసిరికి ఉంది.

తల వెంట్రుకలు ఏపుగా పెరగాలన్నా, వెంట్రుకలకు సంబంధించిన ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఉసిరి ఎంతో సహాయపడుతుంది. ఈ కాలంలో వచ్చే దుష్పరిణామాలు శీతవాతాల, కఫ, శ్లేష్మ, పిత్తదోష నివారణ, పలు సమస్యలను ఉసిరితో నివారించుకోవచ్చు. ఇదే ఉసిరిని రాత్రి సమయాల్లో సేవించకూడదని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. ఈ నెలలో ప్రతీ సోమవారం ఉదయం సాయంత్రం శివాలయం ప్రాంగణంలో ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు, పుణ్యఫలం పొందుతారు.



Click it and Unblock the Notifications