For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వీట్ హార్ట్ ను భద్రంగా ఉంచే 10 టాప్ స్వీట్ ప్రూట్స్

|

అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు మూలకారణం. కాబట్టి మనం తీసుకొనే ఆహారంలో కొవ్వు పదార్ధాలు అతి తక్కువ శాతంలో ఉండేలా చూసుకోవాలి. పళ్లను చేర్చకుండా ఆహారం ఎప్పటికీ సమతుల్యమవదు. కాబట్టి ఆహారంలో పండ్లు తప్పనిసరి. పండ్లు తినడం అనగానే మార్కెట్ నుంచి పండ్లు కొనితెచ్చి కోసుకుని తినడం మాత్రమే కాదు.గుండెను ఆరోగ్యంగా ఉంచే పండ్లను తినడం మంచిది.గుండె ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు ఏవో తెలుసుకోవాలని ఉందా? దీనికి చిట్కా చాలా చిన్నది. పైగా రుచికరమైనది. బాగా ముదురురంగుల్లో మెరుస్తున్నట్లు (బ్రైట్) కనిపించే రంగులతో ఉండే పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. అందులో కొన్ని... పండ్లు తినడం కోసం మనం మార్కెట్ వరకూ నడిచే నడక వ్యాయామం రూపంలో మన గుండెకు మేలు చేస్తుంది. ఇక పండ్లు కొన్న తర్వాతి తినడం వల్ల గుండె ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. ఇలా పండ్ల వల్ల ఒకటి కాదు... రెండు మేళ్లు!

ఆపిల్

ఆపిల్

మెరుస్తున్నట్లుగా ఎర్రటి రంగులో ఉండే ఆపిల్ గుండెకు మేలు చేస్తుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్స్ రక్తనాళాల్లోని ప్లేట్‌లెట్లు రక్తనాళాల గోడలకు అంటుకోకుండా చూస్తాయి.

బెర్రీపండ్లు

బెర్రీపండ్లు

బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ పండ్లలో ఉండే విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ అన్నీ శరీర ఆరోగ్యానికి దోహదపడతాయి. ఇంకా ఇందులో మ్యాంగనీస్, పొటాషియమ్ ఉంటాయి.

కివీ

కివీ

ఇప్పుడు మన వద్ద మార్కెట్లలో లభించే కివీ పండ్లు గుండెకు మేలు చేస్తాయి. ఇందులోని యాంటాక్సిండెట్ శరీరాన్ని దీర్ఘకాలంపాటు యౌవనంగా ఉంచుతుంది.

ఆప్రికాట్

ఆప్రికాట్

బాగా ముదురు నారింజ లేదా పసుపు రంగులో ఉండే ఆప్రికాట్స్ గుండెకు మంచివి. ఇందులో ఉండే విటమిన్-కె... రక్తకణాల ఆరోగ్యానికి దోహదపడుతుంది.

పుచ్చకాయ

పుచ్చకాయ

ఇది కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలన్న కోరికను తగ్గిస్తుంది. స్థూలకాయాన్ని హరించే గుణం దీనికి ఉంది. ఇందులోని పొటాషియమ్ రక్తపోటును నియంత్రిస్తుంది. పుచ్చకాయలోని పై అంశాలన్నీ గుండెజబ్బులను నివారించడంలో కీలక భూమిక పోషించేందుకు ఉపకరించేవే.

ద్రాక్ష

ద్రాక్ష

రక్తనాళాల్లా కనిపించే ద్రాక్షగుత్తిని చూస్తే అది హృదయాకారంలో ఉంటుంది. హృదయాకారంలో ఉండే పండ్లు గుండెకు మేలు చేస్తాయి. చెడు (ఎల్‌డీఎల్) కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండెపోటు అవకాశాలను నివారించవచ్చు. ద్రాక్షగింజల్లో చాలా పోషకాలు ఉంటాయి. లినోలిక్ ఆసిడ్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ ఆలిగోమెరిక్ ప్రో యాంథో సయానిడిన్స్ వంటివి అందులో కొన్ని ప్రధానమైనవి. ద్రాక్షగింజలు హైకొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటు ను అదుపులో ఉంచి, గుండెజబ్బులను నివారిస్తాయి.

నారింజపండ్లు

నారింజపండ్లు

నిమ్మజాతికి చెందిన పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. బాగా పండిన నారింజలో విటమిన్ -ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్ పొటాషియమ్, ఫైబర్ ఎక్కువ. పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండెకు రక్షణ కలుగుతుంది.

పిక్ మెలోన్

పిక్ మెలోన్

దీని వాసన చూస్తేనే తినేయాలనిపిస్తుంది. వాసన మాత్రమే కాదు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా ఇందులో విటమిన్ ఎ, బి6 మరియు సి, పొల్లెట్, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి.

పీచెస్

పీచెస్

పీచెస్ లో విటమిన్ సి, ఇ, మరియు కె, ఫైబర్, పొటాషియం కలిగి ఉంటాయి. ఇవి చూడటానికి వెల్ వెట్ కలర్ లో ఉంటాయి. అందులో వీటిలో విటమిన్ ఎ మరయు విటమిన్ సి లు అధికంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, తక్కువ. ఫైబర్, పొటాషియం అధికం.

పపాయ

పపాయ

బొప్పాయి పండులో విటమిన్ సి, ఫోలెట్, కెరోటినాయిడ్స్ మరియు సాధారణంగా జీర్ణశక్తిని పెంచి ఎంజైములు కలిగి ఉంటుంది. ఒక కప్పు పపాయ ముక్కల్లో 55 కెలోరీలు ఉంటాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

1. ఆపిల్: మెరుస్తున్నట్లుగా ఎర్రటి రంగులో ఉండే ఆపిల్ గుండెకు మేలు చేస్తుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్స్ రక్తనాళాల్లోని ప్లేట్‌లెట్లు రక్తనాళాల గోడలకు అంటుకోకుండా చూస్తాయి. దాంతోపాటు రక్తనాళాలు మూసుకుపోకుండా చూడటం, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్న వారికి యాపిల్ మంచి ఆహారౌషధంగా పనిచేస్తుంది. పొటాషియం అధిక మొత్తాల్లో ఉండటంవల్ల మూత్రం హెచ్చు మొత్తాల్లో తయారై వెలుపలకు విసర్జితమవుతుంది. అలాగే, సోడియం నిల్వలను తగ్గించి రక్తపోటు తగ్గటానికి కారణమవుతుంది.

2. బెర్రీపండ్లు: బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ పండ్లలో ఉండే విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ అన్నీ శరీర ఆరోగ్యానికి దోహదపడతాయి. ఇంకా ఇందులో మ్యాంగనీస్, పొటాషియమ్ ఉంటాయి. బెర్రీ పండ్లలోని పొటాషియమ్ రక్తపోటును నివారించడం ద్వారా గుండెకు మేలు చేస్తుంది. క్రాన్ బెర్రీస్, రెస్ బ్రెర్సీ, బ్లూ బెర్రీస్: ఇలా ముదురు రంగుల్లో ఉండే బెర్రీస్ అంటే అందరీకీ చాలా ఇష్టమే. బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. బెర్రీస్ లో ఫైబర్, తక్కువ పిండి పదార్థాలు అనేక విటమిన్స్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని షుగర్ వ్యాది గ్రస్తులు తీసుకోవడం చాలా మంచిది

3. కివీ: ఇప్పుడు మన వద్ద మార్కెట్లలో లభించే కివీ పండ్లు గుండెకు మేలు చేస్తాయి. ఇందులోని యాంటాక్సిండెట్ శరీరాన్ని దీర్ఘకాలంపాటు యౌవనంగా ఉంచుతుంది. కివీలోని విటమిన్-ఈ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే గుణం తగ్గి గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. కివిపండులో అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. అత్యధికము గా బీటా కెరోటిన్‌ ఉన్నందున మంచి యాంటీ ఆక్షిడెంట్ గా ఉపయోగపడును. కివి పండులోని ఫైటోకెమికల్ ‘లుటెయిన్‌' ప్రోస్టేట్ గ్రంధి, కాలేయ క్యాన్సర్ లను నిరోధించును. కివిపండు తొక్కలో ఉండే ఫ్లావనాయిడ్ యాంటీఆక్షిడెంట్ శరీరములోని ఫ్రీరాడికిల్స్ ను తొలగించి ఆరోగ్యాన్ని కాపాడును.

4. ఆప్రికాట్: బాగా ముదురు నారింజ లేదా పసుపు రంగులో ఉండే ఆప్రికాట్స్ గుండెకు మంచివి. ఇందులో ఉండే విటమిన్-కె ... రక్తకణాల ఆరోగ్యానికి దోహదపడుతుంది. దాంతోపాటు అందులోని ఏ, సీ, ఈ విటమిన్ల వల్ల పూర్తి శరీర ఆరోగ్యం బాగుంటుంది. ఆప్రికాట్ ఒక డ్రై ఫ్రూట్ , ఇతర డ్రైఫ్రూట్స్ తో పోలిస్తే దీనిలో క్యాలరీస్ తక్కువ. తీపిపదార్ధాలు తినాలనేకోరికను తగ్గిస్తుంది. దీనిలోని రసాయనాలు శరీరములో ఉన్నటువంటి చెక్కెరలను నియంత్రిస్తాయి. అప్రికాట్ లోని బీటా కెరోటిన్‌ కంటికి, రోమాలకు, చర్మానికి, మేలుచేస్తుంది. ఒకటి, రెండు అప్రికాట్లను తింటే శరీరానికి కావాలసిన దినవారి విటమిన్‌ 'ఎ' సగం లభ్యమౌతుంది.

English summary

Top 10 Fruits for Healthy Heart.. | స్వీట్ హార్ట్ కి 10 స్వీట్ ప్రూట్స్...

This healthiest fruit list shows the most nutritious antioxidant fruit benefits. You'll want to choose often from the healthiest fruit list in order to get the best fruit benefits. Then you can look better, think better and have more abundant energy.
Desktop Bottom Promotion