For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెన్ను నొప్పులకు గల వివిధ రకాల కారణాలు.!

|

సాధారణంగా వెన్ను నొప్పి అనేది జీవితంలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక వయస్సులో తప్పని సరిగా ఎదుర్కొనే సమస్య. అయితే, 30ఏళ్ళ తర్వాత వెన్ను నొప్పి అనేది సర్వసాధారణం. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటి. ఈ సమస్య జీవితంలో ఒక భాగం అయిపోతుంది. తరుచూ బాధిస్తుంటుంది. పని చేసే ఉద్యోగుల్లో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు నిపుణుల అంచనా. పనిచేసేవారితో ఏ ఒక్కరితో మాట్లాడినా వారు వెన్ను నొప్పితో బాధపడుతన్నట్లు చెబుతుంటారు.

వెన్ను నొప్పికి గల కారణాలను తెలుసుకోకుండా, ఈ సమస్యను చాలా తేలికగా తీసుకుంటాం. అలాగే వెన్ను నొప్పి ఒక సందర్భంలో, ఒకే సమయంలో రాదు. కాబట్టి మనం కూడా దాన్ని చాలా తేలికగా తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో పెయిన్ కిలర్స్ ను తీసుకుంటాం. అయితే ఈ సమస్య వచ్చి పోతుంటే సరే. లేదా క్రమం తప్పకుండా వస్తూనే ఉంటే అందుకు సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. వెన్ను నొప్పికి చాలా సాధారణ కారణాలున్నాయి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో మరీ అధికం. మగవాళ్ళకన్నా స్త్రీలు సాధారణంగా శారీరకంగా తక్కువ శ్రమ ఉండేపనులు చేస్తుంటారు. అయితే గర్భధారణ సమయంలో మాత్రం వెన్నుపూసమీద భారం అధికమౌతుంది. సాధారణ వ్యక్తుల్లో వెన్ను నొప్పి రావడానికి కారణాలేంటి? వాటికి తీసుకోవాలసిన జాగ్రత్తలేంటో చూద్దాం...

1. కూర్చొనే భంగిమ: సాధారణంగా వచ్చే వెన్నునొప్పి ముఖ్యంగా వారు కూర్చొనే విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ వెన్ను నొప్పికి సరైన సమయంలో సరైన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ముందు ముందు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. శారీరకంగా వెన్నునొప్పి, మెడనొప్పి ఎక్కువగా బాధిస్తుంది. కాబట్టి కూర్చొనే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వెన్ను నొప్పిని తగ్గించుకోవచ్చు.

2. గర్భిణీలలో: గర్భం ధరించినప్పుడు ప్రతి ఒక్క మహిళలో వెన్ను నొప్పితో బాధపడుతుంటుంది. ప్రసవం తర్వాత కూడా నొప్పి తగ్గకుండా బాధిస్తుంటుంది.

3. గాయం: ఏదైనా బరువులు మోసేటప్పుడు మీ కండాలు సంకోచిస్తాయి. అలాగే సిట్టింగ్ పొజీషన్ లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే రెండు వారల్లో వెన్ను నొప్పిన తగ్గించుకోవచ్చు.

4. హై హీల్: జీవన శైలీ మరియు ఫ్యాషన్: ఎగుడు దిగుడు చెప్పులు వాడినప్పుడు తదితర కారణాల వల్ల నడుము నొప్పి సమస్య తలెత్తుతుంది. జీవన పంథాను మార్చుకొని మానసికోల్లాసమైన పనులు చేయండిధూమ పానానికి దూరంగా ఉండండి.

5. అధిక బరువు: అధిక బరువువల్ల వెన్నునొప్పి వస్తే బరువు తగ్గే ప్రయత్నం చేయండి. మూడు నాలుగు కిలోల బరువు తగ్గినా ఆశ్చర్యకరమైన మార్పు వస్తుంది. స్థూల కాయం తగ్గించుకోవాలి. శారీరక బరువు ఎక్కువున్నా వెన్నెముక మీద అదనపు ఒత్తిడి, భారం పడుతుంది. కాబట్టి, బరువు నియంత్రణలో ఉంచుకోవాలి.

6. పాత నొప్పులు(ఎప్పుడైన తగిలిన గాయాల) వల్ల కలిగే నొప్పి: బ్యాక్ పెయిన్ లేదా మెడనొప్పి, ఇంకా శరీరంలో ఏదైనా గాయలవల్ల వచ్చే నొప్పి కలిగినప్పుడు, నొప్పి ఉన్నచోట అలాగే వత్తి పట్టుకొని ప్రస్తుతానికి ఉపశమనం పొందుతారు. అయితే అది కాస్తా అలవాటుగా మారి, అలాగే కూర్చువడం, లేదా నిలబడటం వల్ల భవిష్యత్తులో ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కండరాలు బలహీనంగా ఉండటం, కూర్చోటం, నిలబడటం వగరాలలో సరైన భంగిమలను పాటించకపోవడం వంటివి అని తెలస్తుంది.

English summary

Different Causes Of Back Pain | వెన్ను నొప్పికి గల ప్రాధాన కారణాలు.!

If you are a 30-something professional who is climbing the corporate ladder rapidly, then back pain is almost like a part of your profile. Lower back pain is almost like an epidemic among young working professionals these days. Almost every other person you talk to is suffering from back pain that is non-specific.
Desktop Bottom Promotion