For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎగ్ పరాటా హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఐడియా

|

ఎగ్ పరోటా దాదాపు ప్రతి ఇంట్లో తయారు చేసే ప్రధానమైన భారతీయ బ్రెడ్ వంటిది. ఇది ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదా భోజనం లేదా డిన్నర్ కు కూడా తినవచ్చు. భోజనానికి మొదట పరాటా జోడించడం వల్ల భోజనం ఫుల్ మీల్ అవుతుంది. పరాటాలను వివిధ రకాలుగా వండవచ్చు.

పరాటాను గోధుమ పిండి మరియు మైదా రెండింటి మిశ్రమంతో తయారు చేస్తారు. ఎగ్ పరాటా టేస్ట్ మరియు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఐడియా. ఎగ్ పరాటాను జస్ట్ అరగంటలో తయారు చేసి సర్వ్ చేసేయవచ్చు. మరి ఎగ్ పరాటో ఎలా తయారు చేయాలో చూద్దాం...

Egg parathas Tasty Breakfast- filling and healthy

కావలసిన పదార్థాలు:
గుడ్డు :1 (రెండు పరాటాలకు)
గోధుమపిండి/మైదా : 1cup
టమోటో : 1
ఉల్లిపాయ : 1
కొత్తిమీర : 1 కట్ట
పచ్చిమిర్చి : 1
ఉప్పు : రుచికి సరిపడా
కారం : 1/2tsp
చాట్ మసాలా : 1/2tsp
ధనియాలపొడి : 1/2tsp
జీరాపొడి : 1/2tsp
నూనె : పరాటాలు కాల్చడానికి సరిపడా.

తయారుచేసే విధానం:
1. ముందుగా పిండిలో సరిపడా నీరు పోసి ముద్దలా చేసుకుని అరగంట నానబెట్టాలి.
2. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటోలను సన్నగా తరగి ఒక పాత్రలో వేసి గుడ్డుతో పాటు మిగతా పొడులు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా గిలకొట్టి పక్కనుంచాలి.
3. సరిపడా పిండి ముద్దని తీసుకుని గుండ్రంగా రుద్దుకుని, తర్వాత పొడిపిండి కొద్దిగా చల్లుతూ త్రికోణంలా మడతపెట్టి సాగదీయాలి.
4. తర్వాత తవా /పాన్ మీద వేసి సన్నని మంటపై కాలుస్తే ఒక వైపు పొంగుతుంది. పొంగిన వైపు కత్తితో కట్ చేసి, అందులో గుడ్డు మిశ్రమాన్ని స్పూనుతో పలచగా రుద్ది, అంచును ఒత్తాలి.
5. తర్వాత గుడ్డు పచ్చివాసన పోయేదాకా రెండువైపులా కాల్చుకోవాలి. ఈ పరాటాలు వేడివేడిగా రైతాతో తింటే చాలా రుచిగా ఉంటాయి. అంతే ఎగ్ పరాటా రెడీ.

English summary

Egg parathas Tasty Breakfast- filling and healthy | ఎగ్ పరాటా హెల్తీ బ్రేక్ ఫాస్ట్


 Parathas are a staple Indian bread that is made in almost every house. Be it for breakfast, lunch or dinner, a meal becomes best after adding hot roasted parathas. You can make parathas in varied forms. They are filling and made with whole grains especially wheat flour. Egg parathas are a tasty breakfast idea that are filling and healthy.
Story first published: Wednesday, April 24, 2013, 10:15 [IST]
Desktop Bottom Promotion