For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పర్షియన్ చికెన్ కర్రీ: డిఫరెంట్ టేస్ట్

|

మాంసాహార ప్రియులకోసం అందులోనూ చికెన్ అంటే అమితంగా ఇష్టపడే వారికోసం ఇక్కడ ఒక డిఫరెంట్ టేస్ట్ కలిగిన చికెన్ వంటను పర్షియన్ స్టైల్ చికెన్ రిసిపిని మీకు పరిచయం చేస్తున్నాం. ఈ చికెన్ రిసిపిని తయారుచేయడం చాలా సులభం. టేస్ట్ బడ్స్ కు ఒక అద్భుతమైన రుచిని అందిస్తుంది.

ఈ అద్భుతమైన రుచి కలిగిన చికెన్ కర్రీ, ఎవరు ఎక్కువ కారంను ఇష్టపడరో వారికి ఒక ఫర్ ఫెక్ట్ ఎంపిక. మరియు ఎప్పుడే చేసే చికెన్ వంటలతో బోరు అనిపించిన వారికి కూడా, ఒక కొత్త రుచిని చూడటానికి కూడా ఇది ఒక ఉత్తమ ఎంపిక, మరి ఈ టేస్టీ చికెన్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Persian Style Chicken Curry

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1kg
వెన్న(బట్టర్): 1tbsp
ఆలివ్ నూనె: 2tbsp
ఉల్లిపాయలు: 2 (మీడియం, సన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి: 6 (పేస్ట్ చేసుకోవాలి)
టమోటోలు: 2(గుజ్జు చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
దాల్చిన చెక్క: చిటికెడు
మిరియాలు: 1tsp (పొడి చేసుకోవాలి)
దానిమ్మ -1
వాల్నట్-¼cup (రోస్ట్ చేసినవి)
నిమ్మరసం: 1tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వత ఫ్రైయింగ్ పాన్ లో బటర్ మరియు ఆలివ్ ఆయిల్ వేసి కాగనివ్వాలి.
3. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు మూడు నిముషాలు వేయించుకోవాలి.
4. ఇప్పుడు అందులో వెల్లుల్లి పేస్ట్ వేసి, ఒక నిముషం వేయించుకోవాలి.
5. తర్వాత అందులో చికెన్ ముక్కలు వేసి, ఉప్పు వేసి, పది నిముషాలు మీడియం మంట మీద వేయించుకోవాలి.
6. చికెన్ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ కు మారగానే, అందులో దాల్చిచన చెక్క పొడి, మరియు బ్లాక్ పెప్పర్ పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.
7. అంతలోపు దానిమ్మ నుండి గింజలను వేరుచేసి, మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.
8. ఇప్పుడు ఈ పేస్ట్ ను వేగుతున్న చికెన్ మిశ్రమంలో వేసి 10నిముషాలు ఉడికించుకోవాలి.
9. తర్వాత అందులో వాల్ నట్స్ వేసి, ఉప్పు సరిచూసుకోవాలి. కొద్దిగా నీరు మిక్స్ చేయాలి. 15-20నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
10. తర్వాత మూత తీసి, నిమ్మరసం వేసి బాగా కలగలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ మొత్తగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, మిగిలని దానిమ్మ గింజలను అందులో వేసి మిక్స్ చేయాలి. అంతే పర్షియన్ స్టైల్ చికెన్ రిసిపి రెడీ. దీన్ని రైస్ మరియు రోటీలతో సర్వ్ చేయాలి.

English summary

Persian Style Chicken Curry

Here is a delightful treat for all the chicken lovers. A chicken curry from the kitchens of Persia. This Persian style chicken curry is an absolute delight for your taste-buds.
Story first published: Friday, February 28, 2014, 17:34 [IST]
Desktop Bottom Promotion