For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మసాలా ఉప్మా-స్పెషల్ బ్రేక్ ఫాస్ట్

|

ఉప్మాను వివిధ రకాలుగా తయారు చేస్తారు. వెజిటేబుల్ ఉప్మా, ప్లెయిన్ ఉప్మా, రవ్వ పులిహోరా ఇలా.. ఉప్మాను రవ్వ లేదా సూజి రవ్వతో తయారు చేస్తారు. ముఖ్యంగా ఈ బ్రేక్ ఫాస్ట్ రిసిపి సౌత్ ఇండియాలో చాలా ఫేమస్. సాధారణ ఉప్మా తిని బోర్ అనిపిస్తే కొంచెం వెరైటీగా కొంచెం కారంగా కొన్ని ఇండియన్ మసాలా దినుసులు వేసి చేసుకోవచ్చు.

మసాలా ఉప్మా బెస్ట్ బ్రేక్ ఫ్యాస్ట్. ఎందుకంటే చాలా సులభంగా తయారవుతుంది. మరియు టేస్టీగాను ఉంటుంది. కొద్దిగా వెజిటేబుల్స్ మిక్స్ చేసుకొంటే మరింత టేస్ట్ గా ఉంటుంది.

కావలసిన పదార్థాలు:
రవ్వ: 1cup
ఉల్లిపాయలు : 2
అల్లం : చిన్నముక్క
జీలకర్ర : 1tsp
పచ్చిమిర్చి : 4-6
టమోటో: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
శెనగపప్పు : 2tsp
షాజీరా : చిటికెడు
దాల్చిన చెక్క : చిన్న ముక్క
లవంగాలు : 3
వనస్పతి : 2tsp
బిర్యాని ఆకులు : 2
ఆవాలు: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
పసుపు : 1/4tsp
నెయ్యి : 2tbsp
ఉప్పు : రుచికి తగినంత

Masala Upma

తయారు చేసే పద్ధతి:
1. ముందుగా ఫ్రైయింగ్ పాల్ లో నూనె లేదా నెయ్యి వేసి కాగిన తర్వాత రవ్వను వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేగించుకోవాలి.
2. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో వనస్పతి (డాల్డా), నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
3. తర్వాత అందులోనే, టమోటో, అల్లం, షాజీరా, జీలకర్ర, శనగపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యాని ఆకులు వేసి కొద్దిసేపు మీడియం మంట మీద వేగించుకోవాలి.
4. తర్వాత మూడు కప్పుల నీళ్ళు, పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి నీరు బాగా మరగబెట్టాలి.
5. ఇప్పుడు అందులో ముందుగా వేగించుకొన్న రవ్వ వేస్తూ, ఉడకనివ్వాలి. ఇది ఏ కూరా, పచ్చడి లేకున్నా వేడి వేడిగా తింటే రుచిగా ఉంటది. లేదా మీకు ఇష్టమైన ఊరగాయతో తింటే ఇంకాస్త రుచిగా ఉంటుంది. మీకు ఇష్టమైతే ఇందులో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ క్యారెట్, బీన్స్, క్యాబేజ్, బఠానీ, పొటాటో కలుపుకోవచ్చు.

English summary

Masala Upma-Special Breakfast | బెస్ట్ బ్రేక్ ఫాస్ట్-మసాలా ఉప్మా

Upma or uppitu made from rava/sooji is a popular south indian breakfast. We get bored with the usual upma, a variation with a little spicy by adding sambar powder and vegetables in it will make it tasty. Masala upma is the best breakfast because you get to add more of veggies like onion, carrot, beans, cabbage, peas, potatoes, tomatoes, capsicum etc.
Desktop Bottom Promotion