Latest Updates
-
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ!
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.!
ఉదయం నిద్ర లేచి బ్రష్ చేసిన దగ్గర నుంచీ రెడీ అవ్వడం వరకూ ప్రతి పనీ అద్దంతో ముడిపడి ఉంటుంది. అందుకే ఇంట్లో ఇంటీరియర్‌కి తగినట్లుగా అద్దాల అమరిక చేసుకుంటారు. వివిధ డిజైన్లలోనూ అద్దాలను అమరుస్తారు. అయితే అద్దాలను ఇంట్లో సరైన దిశలోనే అమరుస్తున్నారా.. ఇంట్లో ఎన్ని అద్దాలు పెడుతున్నారనేది కూడా వాస్తు శాస్త్రం ప్రకారం చాలా కీలకం.

ఇంట్లో ఎక్కువ అద్దాలు అమర్చడం అశుభంగా వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంటి వాస్తు ప్రకారం ముఖ్యంగా తూర్పు, ఉత్తర దిశల్లో ఒక్కో అద్దం ఉంచడం మంచిది. అయితే బెడ్‌రూమ్, బాత్‌రూమ్, ప్రధాన ద్వారం వద్ద అద్దాలు పెట్టేటప్పుడు కొన్ని నిర్దిష్ట నియమాలు పాటించాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. అద్దాలను ఏ దిశలో ఉంచాలి.. ఇంట్లో ఎన్ని అద్దాలు ఉంచాలి.. నిపుణుల సలహాలు చూద్దాం..
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అమర్చే ప్రతి వస్తువు ఏ దిశలో ఉండాలనేది చాలా ముఖ్యం. దీని ద్వారానే ఇంట్లో పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీల ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లో అద్దాలు కేవలం ముఖం చూసుకోవడానికి, రెడీ అవడానికి మాత్రమే కాదు.. అద్దాల అమరిక ఎనర్జీకి ప్రతిబింబంగా నిలుస్తుంది. ఈ మేరకు ఇంట్లో అద్దాలు ఎక్కువ లేకుండా వాస్తు ప్రకారం అద్దాలను అమర్చుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇల్లంతటికీ రెండు ప్రధాన అద్దాలు సరిపోతాయని.. అవి కూడా సరైన దిశలో ఉండాలని సూచిస్తున్నారు.
ఈ పొజిషన్‌లో వద్దు
ఇంట్లో అద్దం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండాలి. అయితే అద్దాలు ఒకదానికొకటి ప్రతిబింబించేలా ఉండకూడదు. దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా ఇంట్లో ఆందోళన పెరిగి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇంట్లో రెండు అద్దాలు పెట్టాల్సి వస్తే వాటిని ఎదురుగా కానీ, పక్కపక్కన గానీ ఉంచకూడదు.

బెడ్‌రూమ్‌లో అద్దం
బెడ్‌రూమ్‌లో అద్దం అమర్చేటప్పుడు తప్పనిసరిగా వాస్తు సలహాలు పాటించాలి. పడక గదిలో ఒకటి కంటే ఎక్కువ అద్దాలను పెట్టకూడదు. రెండో అద్దం ఉంటే దానిని కప్పి ఉంచుకోవాలి. నిద్రపోతున్నప్పుడు, మంచం లేదా మీ శరీర ప్రతిబింబం అద్దంలో పడకుండా చూసుకోండి. లేదంటే ఇది భార్యాభర్తల రిలేషన్‌షిప్స్, నిద్రపై ప్రభావం చూపిస్తుంది.
బాత్‌రూమ్‌లో
బాత్‌రూమ్‌లో ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో బాత్‌రూమ్‌లో కూడా ఒక అద్దం అమర్చుకోవడం శ్రేయస్కరం. అదేవిధంగా అద్దంపై మరకలు లేకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా, సరైన స్థితిలో ఉండేలా చూసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
