పండుగ రోజే దారుణం..భర్త డోర్ ఓపెన్ చేయగానే ప్రియుడితో సరసాలాడుతూ భార్య..రెండ్ హ్యాండెడ్ గా దొరకడంతో..

మన తెలుగోళ్లు అట్లతద్ది పండుగ జరుకునే విధంగా నార్త్ ఉండియాలో కర్వా చౌత్ పండుగను జరుపుకుంటారు. భర్త దీర్ఘాయుష్షు కోరుతూ పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి చందమమాని చూసిన తర్వాత భర్త చేతుల మీదుగా నీరు తాగి ఉపవాసాన్ని విరమిస్తారు ఇలాంటి పుణ్య దినాన భార్యాభర్తల మధ్య ప్రేమ, అన్యోన్యత వెల్లివిరుస్తాయి.

కానీ అదే కర్వా చౌత్ రాత్రి(అక్టోబర్ 29) ఓ కాపురంలో మాత్రం తీవ్ర కలకలం రేగింది. ఓ భార్య తన ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌ గా భర్తకు దొరికిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో చోటుచేసుకున్న ఈ షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

Karwa Chauth Shock Wife Caught Red-Handed with Lover in Mathura Viral Video

అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధుర నగరంలోని వసంత విహార్ ప్రాంతంలో ఉన్న ఓ అద్దె గదిలో కర్వా చౌత్ పండుగ రోజు తన భార్య అంజు వేరొక వ్యక్తితో రహస్యంగా కలుస్తోందనే పక్కా సమాచారం భర్త మనోజ్ కి అందింది. వెంటనే తన కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని నేరుగా ఆ అద్దె గది దగ్గరకు వెళ్లాడు. డోర్ తీసి చూడగానే.. లోపల తన భార్య మరొక వ్యక్తితో కలిసి ఉండటం చూసి అతడు ఒక్కసారిగా షాక్‌ కు గురయ్యాడు.

రణరంగాన్ని తలపించిన ఘర్షణ..

భార్యను అలా పరాయి వ్యక్తితో చూసిన ఆ భర్త తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే ఆమెను నిలదీయడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ సమయంలో భర్త వెంట వచ్చిన కుటుంబ సభ్యులు కూడా జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ గొడవ కాస్తా కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళల మధ్య భౌతిక దాడికి దారితీసింది. ఒకరినొకరు తోసుకుంటూ, జుట్లు పట్టుకుని కొట్టుకునే స్థాయికి వివాదం ముదిరింది. చుట్టుపక్కల వారు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్‌ గా మారింది.

Karwa Chauth Shock Wife Caught Red-Handed with Lover in Mathura Viral Video

15 ఏళ్ల కాపురం.. నలుగురు పిల్లలు..

ఈ దంపతులకు వివాహమై దాదాపు 15 సంవత్సరాలు అవుతోంది. వీరికి ఏకంగా నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తీవ్ర మనస్పర్థలు ఉండటంతో ఇద్దరికీ పడటం లేదు. వీరిద్దరి విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో నడుస్తోందని, కేసు ఇంకా పెండింగ్‌ లోనే ఉందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. పరారైన ప్రియుడు..

గది దగ్గర పెద్ద ఎత్తున గొడవ జరుగుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం విచారణ నిమిత్తం భార్యాభర్తలిద్దరినీ పోలీస్ స్టేషన్‌ కు తరలించారు. అయితే, గొడవ జరుగుతున్న సమయంలో చాకచక్యంగా తప్పించుకున్న ఆ రెండో వ్యక్తి (ప్రియుడు) అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

Desktop Bottom Promotion