Latest Updates
-
సోయా పుట్టు ఎప్పుడైనా వండుకున్నారా? తస్సాదియ్యా వేడి వేడి అన్నంలో కలిపితే నా సామి రంగా.. -
ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు ఆకుపచ్చ, బ్లూ కలర్ గౌన్స్ మాత్రమే ఎందుకు ధరిస్తారో తెలుసా? -
దీపావళి స్పెషల్ స్వీట్..తమిళనాడు సంప్రదాయ ఉక్కరై మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
క్యాన్సర్ రాకుండా కాపాడే 5 ఆహారాలు ఇవే.. -
దీపావళి స్పెషల్ స్నాక్.. ఇంట్లోనే ఈజీగా క్రిస్పీ కారప్పూస మిక్చర్ చేసుకోండిలా.. -
ఇడ్లీ, దోశలోకి హోటల్ స్టైల్ చిన్న ఉల్లిపాయ చట్నీ..యమా రుచి బాసూ.. -
చికెన్ మజ్జిగ పులుసు..నెలల పాటు నాలుక మీద ఉండేపోయే రుచి..ఈజీగా చేసేయొచ్చు.. -
అరటిపండ్లు రెండు రోజులకే నల్లబడుతున్నాయా? ఇలా చేస్తే 4 వారాలైనా ఫ్రెష్ గా ఉంటాయి! -
ఇనుములాంటి బలాన్నిచ్చే మినుముల అన్నం..నడుము నొప్పితో బాధపడేవారికి బెస్ట్ ఫుడ్ -
రెండో పెళ్లి, జిమ్ ట్రైనర్ తో ఎఫైర్.. భర్తను చంపేందుకు భార్య పక్కా స్కెచ్..ఊహించని ట్విస్ట్
రోజూ ఒకే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ సీక్రెట్ హోటల్ స్టైల్ పప్పు ట్రై చేయండి
ప్రతిరోజూ ఇంట్లో ఒకే రకమైన పప్పు తిని బోర్ కొట్టిందా? అయితే ఈ సారి కాస్త భిన్నంగా, అచ్చం రెస్టారెంట్ రుచిని తలపించే హోటల్ స్టైల్ పప్పు కూర ప్రయత్నించి చూడండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పప్పును కలుపుకుని తింటే.. ఆ మజానే వేరు. అద్భుతమైన రుచితో నోరూరించే ఈ పప్పు కూర, చపాతీ లేదా రోటీల్లోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ కమ్మనైన వంటకాన్ని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
ఉడికించడానికి:
పప్పు - అర కప్పు
మెంతులు - పావు టీస్పూన్
నీళ్లు - ఒకటిన్నర కప్పులు
పసుపు - అర టీస్పూన్
తాలింపు కోసం:
నూనె - 1 టేబుల్ స్పూన్
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
పచ్చిమిర్చి - 3
అల్లం తరుగు - కొద్దిగా
ఉల్లిపాయలు - 100 గ్రాములు
ఉల్లిపాయ పొడి - పావు టీస్పూన్
టమాటో - 1
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - అర కప్పు
కొత్తిమీర - కొద్దిగా
నిమ్మచెక్క - సగం
వెన్న (బట్టర్) - 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
-ముందుగా కుక్కర్ తీసుకుని అందులో పప్పును వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. అందులో మెంతులు, పసుపు, కప్పున్నర నీళ్లు పోసి బాగా కలపాలి. మూతపెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఆవిరి పోయిన తర్వాత, ఉడికిన పప్పును గరిటెతో మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. అవి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ పొడి కొద్దిగా పసుపు వేసి దోరగా వేయించాలి.
సోయా పుట్టు ఎప్పుడైనా వండుకున్నారా? తస్సాదియ్యా వేడి వేడి అన్నంలో కలిపితే నా సామి రంగా..
-ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, అవి లేత బంగారు రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత టమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి మరో నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇందులో అర కప్పు నీళ్లు పోసి కలిపి, మూత పెట్టి ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించాలి.
-ఐదు నిమిషాల తర్వాత మూత తీసి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి నిమ్మరసం కలుపుకోవాలి. ఈ గుమగుమలాడే పోపు మిశ్రమాన్ని ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పులో వేసి బాగా కలపాలి.
-పైన ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసి, 5-6 నిమిషాల పాటు మూతపెట్టి ఆవిరి బయటకు పోకుండా ఉంచాలి. ఆ తర్వాత మూత తీసి కలుపుకుంటే... ఎంతో కమ్మనైన హోటల్ స్టైల్ పప్పు కూర రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
