Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.! -
రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా? -
నాటు శైలిలో ఘాటుగా 'రొయ్య పొట్టు చారు'.. పల్లెటూరి రుచుల మజానే వేరు.! -
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి.. -
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే..
గ్రహాల రాశుల మార్పు: ఆగష్టు చివరి వారంలో వీరికి ఊహించని ధన లాభం
మరో వారంలో ఆగష్టు నెల పూర్తి కానుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే చివరి వారంలో గ్రహాల మార్పుల వల్ల వివిధ రకాల రాజయోగాలు ఏర్పడనున్నాయి. హనస, బుధ, కేతువుల కలయిక.. సింహరాశిలో సూర్య, బుధ, కేతువుల కలయికతో త్రిగాహి యోగం కారణంగా పలు రాశుల వారికి ప్రయోజనం చేకూరనుంది. మిథున రాశిలోకి కుజుడు, కన్యా రాశిలోకి శుక్రుడు, కర్కాటకంలోకి గురుడు, మీన రాశిలోకి శని, కుంభ రాశిలోకి శని ప్రవేశించనున్నాయి. ఈ ప్రభావంతో వచ్చే వారం ఏ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉండనుంది. పండితుల సలహాలు చూద్దాం..

వృషభ రాశి
ఆగష్టు చివరి వారం వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉండనుంది. నిరుద్యోగులకు అదృష్టం కలిసి రానుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబీకుల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివిధ పనుల్లో చేపట్టిన ప్రణాళికలు విజయవంతమవుతాయి.
కన్యా రాశి
చివరి వారం కన్యారాశి వారికి అన్ని విధాలుగా శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉండనుంది. మీరు ఊహించని శుభవార్త వింటారు. న్యాయపరమైన చిక్కులు తొలగి మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం, హోదా పెరుగుతుంది. ఆర్థికంగా సమస్యలు తొలగిపోతాయి. సంపాదన మెరుగుపడుతుంది.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఆగష్టు చివరి వారం అనుకూలంగా, అద్భుతంగా ఉండటమే చేపట్టే ప్రతి పనిలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో మీరు ఊహించని అనుకూల ఫలితాలు చూస్తారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది మీకు సంబంధించి అద్భుతమైన విషయం. ఉద్యోగం చేస్తున్నవారు ప్రమోషన్లు లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశాలు ఉన్నాయి.

మకర రాశి
ఈ వారం మకర రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. అయితే ఆర్థికపరమైన లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించి చట్టపరమైన చిక్కులు తొలగి మీకు అనుకూలంగా న్యాయం లభిస్తుంది. పెట్టుబడి పెట్టాలనుకునేవారు భూమి కొనుగోలు చేయడం ద్వారా ఆర్థికంగా లాభాలు అందుకోవచ్చు. కుటుంబీకులతో సంతోషకరమైన వాతావరణం గడుపుతారు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా, లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి. సంపాదన మెరుగుపడుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపార రంగంలో ఉన్నవారు తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభించి మంచి లాభాలు ఆర్జిస్తారు. ఈ నెల చివరి వారంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
