ఎసిడిటీ, గ్యాస్ వేధిస్తున్నాయా? ఈ 5 ఇంటి చిట్కాలతో చిటికెలో ఉపశమనం!

రుచికరమైన వంటకాలు కళ్ళముందు ఉన్నప్పుడు మనసును, ఆకలిని అదుపులో ఉంచుకోవడం ఎవరికైనా కష్టమే.ఈ టైంలో మనం తెలియకుండానే ఎక్కువగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తింటుంటాం. దీనివల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడి గుండెల్లో మంట, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. మీరు కూడా పండుగ వేళ అతిగా తిని ఇలాంటి కడుపు సమస్యలతో బాధపడుతుంటే కొన్ని అద్భుతమైన ఇంటి చిట్కాలు మీకు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. అవేంటో ఇక్కడ చూడండి.

వాము, నల్ల ఉప్పు

అతిగా తినడం వల్ల కడుపులో భారంగా, గ్యాస్‌ గా అనిపిస్తే వాము, నల్ల ఉప్పు ఒక ఉత్తమమైన మార్గం. ఒక చెంచా వాములో చిటికెడు నల్ల ఉప్పు కలిపి బాగా నమిలి కొద్దిగా గోరువెచ్చని నీరు తాగండి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి కడుపు భారాన్ని తగ్గిస్తుంది, గ్యాస్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

5 Effective Home Remedies for Acidity Indigestion

అల్లం, నిమ్మరసం

నూనె పదార్థాల వల్ల కడుపు ఉబ్బరం లేదా వికారంగా అనిపిస్తే అల్లం, నిమ్మరసం మంచి మందులా పనిచేస్తాయి. కొద్దిగా అల్లం రసం తీసుకొని, అందులో అర టీస్పూన్ నిమ్మరసం, చిటికెడు నల్ల ఉప్పు లేదా సముద్రపు ఉప్పు కలిపి తాగండి. ఇది కడుపు మంటను తగ్గించి, వికారం మరియు భారంగా అనిపించడం నుండి హాయినిస్తుంది.

 విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉసిరి సూప్..చలికాలంలో దీన్ని మించింది లేదు! విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉసిరి సూప్..చలికాలంలో దీన్ని మించింది లేదు!

జీలకర్ర, ఇంగువ టీ

జీలకర్ర జీవక్రియను మెరుగుపరిస్తే, ఇంగువ కడుపులోని గ్యాస్‌ ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ వేసి బాగా మరిగించండి. ఆ నీరు గోరువెచ్చగా అయ్యాక తాగితే అజీర్ణం, గ్యాస్ సమస్యల నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

సోంపు, పటికబెల్లం

సోంపు, పటికబెల్లం రెండింటికీ శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల గుండెల్లో మంట తగ్గి, ఎసిడిటీ నుండి ఉపశమనం లభిస్తుంది. భోజనం తర్వాత ఒక చెంచా సోంపు, మిశ్రి కలిపి తినవచ్చు లేదా సోంపును నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగవచ్చు.

వేయించిన జీలకర్ర పొడితో నెయ్యి లేదా పెరుగు

నూనెలో వేయించిన వంటకాల వల్ల కడుపులో తీవ్రంగా మంటగా అనిపిస్తే, అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడిని కొద్దిగా నెయ్యి లేదా పెరుగులో కలిపి తీసుకోండి. నెయ్యి, పెరుగు కడుపును చల్లగా ఉంచి, అజీర్ణం నుండి త్వరగా ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Friday, November 20, 2026, 13:10 [IST]
Desktop Bottom Promotion