Latest Updates
-
ఎసిడిటీ, గ్యాస్ వేధిస్తున్నాయా? ఈ 5 ఇంటి చిట్కాలతో చిటికెలో ఉపశమనం! -
ఉద్యోగస్తులు, బ్యాచిలర్స్ కోసం త్వరగా అయిపోయే మసాలా కొబ్బరి అన్నం...పిల్లల లంచ్ బాక్స్ కు బెస్ట్ -
జలుబు వల్ల వచ్చే తీవ్రమైన తలనొప్పిని తగ్గించే బెస్ట్ చిట్కా ఇదే -
నార్త్ ఇండియా స్టైల్ పుట్టగొడుగులు బంగాళదుంప మసాలా..తరతరాలకు గుర్తుండిపోయే రుచి! -
విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉసిరి సూప్..చలికాలంలో దీన్ని మించింది లేదు! -
పురుషుల దినోత్సవం స్పెషల్ స్వీట్..నోట్లో వెన్నలా కరిగిపోయే క్రీమీ రబ్రీని ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
చాక్లెట్ బ్రౌనీ చీజ్ కేక్ రెసిపీ.. పురుషుల దినోత్సవాన మీ ప్రియమైన వారికి ఇలా స్వీట్ సర్ ప్రైజ్ ఇవ్వండి! -
International men's day: ప్రతి పురుషుడు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టెస్టులు ఇవే! -
పిల్లల ఆట అనుకుంటున్నారా? పెద్దలు ఉయ్యాల ఊగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే! -
చలికాలం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్..ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పాలకూర దోసె చేసుకోండిలా..
మధ్యాహ్న భోజనానికి బెస్ట్.. వంకాయ మునగకాయ మసాలా 10 నిమిషాల్లోనే చేయండిలా..
ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం సమయం దగ్గరపడుతోందంటే చాలు.. ఇవాళ ఏం కూర వండాలి అనే ఆలోచన మొదలవుతుంది. రోజూ సాంబార్, పప్పు, రొటీన్ కూరలు వండి వండి మీకు కూడా విసుగు వచ్చేసిందా? హడావిడి లేకుండా త్వరగా వంట పూర్తి చేయాలని చూస్తున్నారా? అయితే మీ ఫ్రిజ్ లో వంకాయ, మునగకాయ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేయండి. ఈ రెండింటితో కేవలం కొన్ని నిమిషాల్లోనే నోరూరించే వంకాయ మునగకాయ మసాలా తయారు చేసుకోవచ్చు.
వేడివేడి అన్నంలో ఈ మసాలా కూరను కలుపుకొని తింటుంటే వచ్చే రుచిని మాటల్లో వర్ణించలేం. ముఖ్యంగా ఇందులో వాడే సోంపు, మిరియాల పొడి మసాలాకు అద్భుతమైన సువాసనను, కమ్మదనాన్ని ఇస్తాయి. 10 నిమిషాల్లోనే వంట పూర్తయిపోతుంది. ఒక్కసారి మీరు మీ కుటుంబ సభ్యులకు దీనిని రుచి చూపిస్తే చాలు, ప్రతి వారం ఇదే వండమని మిమ్మల్ని అడగడం ఖాయం.

కావలసిన పదార్థాలు
నూనె: 2 టేబుల్ స్పూన్లు
పెద్ద ఉల్లిపాయలు: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
కరివేపాకు: 1 రెమ్మ
కారం: 1 టీస్పూన్
ధనియాల పొడి: 2 టీస్పూన్లు
సోంపు పొడి: 1 టీస్పూన్
మిరియాల పొడి: అర టీస్పూన్
టమాటాలు: 2
మునగకాయ: 1
వంకాయలు: పావు కేజీ
ఉప్పు: రుచికి సరిపడా
నీరు: అవసరమైనంత
పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసి రావాలంటే.. ఈ స్పెషల్ దొండకాయ మసాలా రైస్ చేసి పెట్టండి!
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో నూనె పోయండి. నూనె కాస్త వేడెక్కాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడి, లేత గోధుమ రంగులోకి మారే వరకు వేయించాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి, పచ్చి వాసన పూర్తిగా పోయే వరకు చక్కగా వేయించుకోండి.
-ఆ తర్వాత కారం, ధనియాల పొడి, సోంపు పొడి, మిరియాల పొడి వేసి మసాలా పొడులు మాడిపోకుండా సన్నని మంటపై బాగా కలపండి. తర్వాత తురిమిన లేదా తరిగిన టమాటా వేసి, టమాటా గుజ్జులా మారి నూనె పైకి తేలే వరకు వేయించండి.
-తర్వాత కట్ చేసుకున్న మునగకాయ, వంకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి, మసాలా అంతా ముక్కలకు పట్టేలా బాగా కలపండి.
-చివరగా కూర ఉడకడానికి సరిపడా కొద్దిగా నీళ్ళు పోసి మరోసారి కలిపి మూత పెట్టండి. సన్నని మంట మీద 10 నిమిషాల పాటు ఉడికిస్తే చాలు, వంకాయ, మునగకాయ మసాలాను పట్టుకొని మృదువుగా ఉడికిపోతాయి.
-అంతే ఎంతో కమ్మగా, స్పైసీగా ఉండే వంకాయ మునగకాయ మసాలా రెడీ. దీనిని వేడివేడి అన్నంతో పాటు చపాతీ, పుల్కా లేదా రొట్టెలతో కూడా తినవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
