Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.!
సెప్టెంబర్ 26, భాద్రపద పౌర్ణమి. జ్యోతిష్య గణాంకాల ప్రకారం ఈ సమయంలో గురు గ్రహం కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటుంది. శుక్రుడు తన సొంత రాశి తులారాశిలో సంచరిస్తున్నాడు. పౌర్ణమి నాడు కన్యారాశిని విడిచి బుధుడు తులారాశిలోకి ఆగమనం చేస్తాడు. ఈ ప్రధాన గ్రహాల స్థానాల మార్పు అన్ని రాశులపైనా ప్రభావం చూపిస్తుండగా.. ముఖ్యంగా ఐదు రాశిచక్రాల వారి జీవితాల్లో అదృష్టం తీసుకురానుంది. ఆ రాశుల జాతకాలు చూద్దాం..

మేష రాశి
మేషరాశి వారికి భాద్రపద పౌర్ణమి వృత్తిపరంగా పురోగతి సాధించే అవకాశాలను తీసుకువస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు అందుకోవచ్చు. కొత్త బాధ్యతలు, నూతన ప్రాజెక్టుల్లో భాగం కావచ్చు. పెండింగ్ పనులు ఊపందుకుంటాయి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. దీంతో ప్రయోజనం పొందుతారు.

మిథునం
భాద్రపద పౌర్ణమితో మిథున రాశి వారు నూతన పరిచయాలు ఏర్పరుచుకుంటారు. మీరు మాట్లాడే విధానం, తీరు మీకు ప్రయోజనాలను అందిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దీంతో వ్యాపార విస్తరణకు ఈ పరిచయాలు ఉపయోగపడతాయి. ఉద్యోగస్తులు తమ సమయస్ఫూర్తి, తెలివితేటలతో తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ఇది సరైన సమయం. దీంతో ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలు కూడా దొరుకుతాయి.

కర్కాటక రాశి
గురు గ్రహం ఉచ్చ స్థితిలో ఉండటం కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఎంచుకున్న వృత్తి రంగంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. పనిచేసే చోట గౌరవం లభిస్తుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికపరంగా మెరుగైన స్థితిలో ఉంటారు.

తులారాశి
భాద్రపద పౌర్ణమి నాడు శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించడంతో ఈ సంచారం వారికి నూతన అవకాశాలను కల్పిస్తుంది. తులా రాశి వారు మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. వ్యాపారంలో నూతన అవకాశాలు ఏర్పడతాయి. క్రియేటివిటీ మెరుగవుతుంది. ఉద్యోగం మారాలని చూస్తున్నవారికి, కొత్త బాధ్యతలు తీసుకోవాలని చూస్తున్న వారికి ఈ సమయం మంచి అవకాశాలను ఇస్తుంది.
మీన రాశి
సెప్టెంబర్ 26న చంద్రుడు మీన రాశిలో ఉండటంతో పాటు శని కూడా ఇదే రాశిలో వక్రగతిలో సంచరిస్తాడు. ఈ సమయం వారికి పాత పనులను సమీక్షించుకోవడానికి అవకాశం లభిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలను సమర్థవంతంగా రూపొందించుకుంటారు. కష్టపడేతత్వం పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం కొనసాగిస్తారు. ఆర్థికంగా మెరుగుదల సాధిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
