Latest Updates
-
అన్నం, కూర అక్కర్లేదు..ఇదొక్కటి ఉంటే చాలు పొట్టకి హాయిగా, లంచ్ బాక్స్ కి బెస్ట్..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు..శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు -
వేడి చేసి మూత్రం సరిగ్గా రావట్లేదా? మన పూర్వీకుల ఈ పచ్చడి తింటే చాలు..చుక్క నూనె లేకుండానే క్షణాల్లో చేయండిలా -
చాలా తక్కువ టైంలో రుచికరమైన, పౌష్టికమైన పచ్చడి.. ఉల్లిపాయలతో ఈజీగా చేసేయండిలా.. -
పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు..పక్షవాతం రాకుండా అడ్డుకునే బెస్ట్ వ్యాయామం ఇదే! -
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో.. -
కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో -
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా.. -
ఇవేం లవ్ మ్యారేజ్ లు రా బాబోయ్: పెళ్లయిన ఏడాదికే ప్రియుడితో హోటల్ లో భర్తకు దొరికిన భార్య..వీడియో చూడండి -
ఒరేయ్ అబ్బాయిలు బంపరాఫర్...పెళ్లి కానోళ్లకు ఫ్రీగా ఫిన్లాండ్ వీసా, అక్కడోళ్లతో డేటింగ్..ఖర్చులన్నీ వాళ్లవే!
మలబద్దకంతో బాధపడుతున్నారా? మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ ఫుడ్స్ తినండి
ఈ రోజుల్లో చాలామంది ఆహార అలవాట్లలో రకరకాల మార్పుల కారణంగా చాలామందిని వేధిస్తున్న సాధారణ సమస్య మలబద్దకం. ఉదయాన్నే మోషన్ ఫ్రీగా అవ్వక హాస్పిటల్ప్ చుట్టూ తిరిగి వేల రూపాయల ఖర్చు పెట్టి మెడిసిన్స్ వాడుతున్న వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. అయితే ఆధనిక జీవనశైలి, ఫైబర్ లేని జంక్ ఫుడ్ తినడం వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.
అయితే హాస్పిటల్స్ చుట్టూ తిరిగి, మెడిసిన్స్ వాడే పని లేకుండా రోజువారి డైట్ తో చిన్న మార్పు చేస్తే చాలు మలబద్దకం సమస్యకు చెక్ పెట్టవచ్చు. మోషన్ ఫ్రీగా అవ్వాలంటే 10 పుడ్స్ ని మీ డైట్ లో చేర్చుకోవాలని డాక్టర్ బాలు యెల్లెపు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూడండి.

మోషన్ ఫ్రీగా అవ్వాలంటే తినాల్సిన 10 పుడ్స్ ఇవే
సిలియం హస్క్(ఇస్బాగోల్)..
మలబద్దకంతో బాధపడవాళ్లకి ఇది సంజీవని లాంటిది. అన్నం తినడానికి కొద్దిసేపు ముందు గ్లాసు వాటర్ లో ఒక్క స్పూన్ సిలియం హస్క్ గ్లాసు వాటర్ లో కలిపి తాగితే ఫైబర్ పర్ఫెక్ట్ గా శరీరానికి అందుతుంది, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. సిలియం హస్క్ మీ ఇంటి దగ్గర్లోని కిరాణా షాపులో దొరక్కపోతే అమెజాన్, ఫ్లిప్ కార్డ్ వంటి ఈ కామర్స్ సైట్లలో కూడా లభిస్తుంది.
బొప్పాయి
అత్యంత తక్కువ ధరకు, ఈజీగా అందుబాటులో ఉండే బొప్పాయి పండు కూడా మలబద్దకంతో బాధపడేవాళ్లకు బ్రహ్మండంగా పనిచేస్తుంది. ఇందులోని ఎంజైమ్స్ మలాన్ని మృదువుగా చేస్తాయి. దీనిని మీ డైట్ తో చేర్చుకోవడం వల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది.
జామకాయ
ఫైబర్ జామకాయలో ఎక్కువగా ఉంటుంది. జామకాయను అందులోని గింజలతో సహా కలిపి తినడం వల్ల పేగుల కదలికలు చురుగ్గా మారి మోషన్ ఫ్రీగా అవుతుంది.
కివీ ఫ్రూట్
జ్వరాల సమయంలో ఫ్లేట్ లెట్స్ కౌంట్ తగ్గినప్పుడు చాలామంది తినే ఫ్రూట్ కివీనే. కివీ పండ్లలో విటమిన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటది. ఇది మలబద్దకం నుంచి వేగంగా ఉపశమనం ఇస్తుంది.

ఓట్స్
కడుపుని శుభ్రం చేయడంలో ఓట్స్ అద్భుతంగా సాయపడాయి. ఉదయం పూట దోశ, ఇడ్లీ బదులు ఇవి తినడం అలవాటు చేసుకోండి,అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
పెసరపప్పు(మూంగ్ దాల్)..
మన వంటల్లో సులభంగా అరిగే పప్పు పెసరపప్పునే. ఇది పొట్టకు తేలికగా ఉండి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
ఆకుపచ్చ ఆకుకూరలు..
పాతకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఫైబర్ తో పాటు మెగ్నీషియం కూడా ఉంటది,ఇది పేగుల్లోకి నీటిని చేర్చి మోషన్ ఫ్రీగా అయ్యేలా చేస్తుంది.
చియా సీడ్స్
100 గ్రాముల చియా సీడ్స్ లోనే 30-35 గ్రాముల ఫైబర్ ఉంటుంది, వీటిని నీటిలో నానబెట్టుకుని తినడం ద్వారా మోషన్ ఫ్రీగా అవుతుంది.
చపాతీ
గోధుమ పిండి చపాతీలో ఫైబర్ ఉంటుంది. రైస్ తో పోల్చితే దీనిని తినడం ద్వారా మోషన్ ఫ్రీగా అయ్యే ఛాన్స్ ఉంటుంది.
శనగలు
శనగలలో ఫైబర్ ఉంటుంది. వీటిని తినడం ద్వారా మోషన్ ఫ్రీగా అవడానికి సహాయపడుతుంది.
అత్యంత ముఖ్యమైనది
వీటన్నింటితో పాటు ముఖ్యమైన విషయం ఏంటంటే తగినంత నీరు తాగడం. నీళ్లు సరిపడా తాగకుండా పైన చెప్పినవి ఏవి తీసుకున్నా మోషన్ సరిగ్గా అవదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
