బీహార్ స్పెషల్ దాల్ పూరీ.. శనగపప్పు స్టఫింగ్‌ తో పర్ఫెక్ట్ రెసిపీ

Posted By:

భారతదేశంలో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో ప్రత్యేకమైన ఆహార సంస్కృతి. అందులో బీహార్ సంప్రదాయ వంటకాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన వంటకం దాల్ పూరీ. పండుగలు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యాల సమయంలో ఈ వంటకం ప్రతి ఇంటా సందడి చేస్తుంది. కరకరలాడే పూరీల లోపల మసాలాలతో కూడిన శనగపప్పు స్టఫింగ్ పెట్టి చేసే ఈ వంటకాన్ని ఆలూవం కాయ కూరతో కలిపి తింటే ఆ రుచే వేరబ్బా. బీహార్ స్పెషల్ దాల్ పూరీ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు

దాల్ స్టఫింగ్ కోసం:
శనగపప్పు - 1 కప్పు
నీళ్లు - 2 కప్పులు
బిర్యానీ ఆకు - 1
ఆవనూనె - 1 టీస్పూన్ + 2 టేబుల్ స్పూన్లు
పసుపు - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - 1 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
అల్లం తురుము - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 2
దంచిన మిరియాల పొడి - కొద్దిగా
వేయించిన జీలకర్ర పొడి - 1 టీస్పూన్
కారం లేదా చిల్లీ ఫ్లేక్స్ - రుచికి తగినంత
కొత్తిమీర తురుము - కొద్దిగా
పూరీల కోసం:
గోధుమ పిండి - తగినంత
నీళ్లు - సరిపడా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

Authentic Bihar Style Dal Puri Recipe in Telugu How to Make Stuffed Chana Dal Poori at Home

దాల్ పూరీ తయారీ విధానం

-ముందుగా కుక్కర్‌ లో కడిగిన శనగపప్పు, రెండు కప్పుల నీళ్లు, ఒక బిర్యానీ ఆకు, ఒక స్పూన్ ఆవనూనె, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్ చల్లారాక అదనంగా ఉన్న నీటిని వంపేసి, పప్పును మెత్తగా మెదుపుకుని పక్కన పెట్టుకోవాలి.

-తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆవనూనెను వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి చిటపటలాడాక.. ఇంగువ, తురిమిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత మిగిలిన పసుపు కలుపుకోవాలి.

ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు..శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు

-ఇప్పుడు ఆ తాలింపులో ముందుగా మెదిపి పెట్టుకున్న శనగపప్పును వేసి బాగా కలపాలి. అందులో తగినంత ఉప్పు, మిరియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, కారం వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. మిశ్రమం దగ్గరపడి పొడిపొడిగా అయిన తర్వాత కొత్తిమీర చల్లి దించుకుంటే దాల్ స్టఫింగ్ సిద్ధమైనట్లే. దీనిని కాసేపు చల్లారనివ్వాలి.

-పూరీల తయారీ కోసం ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి, తగినన్ని నీళ్లు పోసి మృదువుగా, కాస్త గట్టిగా కలుపుకోవాలి. పిండిని చిన్న ఉండలుగా చేసుకుని, వాటి మధ్యలో తయారు చేసుకున్న పప్పు మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసివేయాలి. ఇప్పుడు వీటిని మెల్లగా చిన్న సైజు పూరీల్లా మరీ పలచగా కాకుండా ఒత్తుకోవాలి.

-కడాయిలో నూనె వేడి చేసి, పూరీలను వేసి, రెండు వైపులా ఉబ్బి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి.దాల్ పూరీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, November 4, 2026, 9:43 [IST]
Desktop Bottom Promotion