Latest Updates
-
చాలా తక్కువ టైంలో రుచికరమైన, పౌష్టికమైన పచ్చడి.. ఉల్లిపాయలతో ఈజీగా చేసేయండిలా.. -
పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు..పక్షవాతం రాకుండా అడ్డుకునే బెస్ట్ వ్యాయామం ఇదే! -
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో.. -
కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో -
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా.. -
ఇవేం లవ్ మ్యారేజ్ లు రా బాబోయ్: పెళ్లయిన ఏడాదికే ప్రియుడితో హోటల్ లో భర్తకు దొరికిన భార్య..వీడియో చూడండి -
ఒరేయ్ అబ్బాయిలు బంపరాఫర్...పెళ్లి కానోళ్లకు ఫ్రీగా ఫిన్లాండ్ వీసా, అక్కడోళ్లతో డేటింగ్..ఖర్చులన్నీ వాళ్లవే! -
పోషకాలు పుష్కలంగా, రుచి అత్యద్భుతంగా..సొరకాయ రొట్టెలు ఈజీగా చేసుకోండిలా -
విటమిన్ B12 లోపానికి చెక్, నరాల వీక్నెస్ తగ్గించే మేక లివర్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
రాగి జావ తాగుతున్నారా? ఈ నిజం తెలియకపోతే ఎంత తాగినా వేస్ట్!
వేడి చేసి మూత్రం సరిగ్గా రావట్లేదా? మన పూర్వీకుల ఈ పచ్చడి తింటే చాలు..చుక్క నూనె లేకుండానే క్షణాల్లో చేయండిలా
పూర్వం రోజుల్లో వ్యవసాయ పనులు చేసుకునేవాళ్లు, పొలంలోనే చేసుకునే ఒక పచ్చడిని అప్పటికప్పుడు తయారుచేసుకునేవాళ్లు. దాన్ని వాళ్లు పొలం పచ్చడి అని పిలిచేవాళ్లు. ఇది ఎంత రుచిగా ఉంటుందంటే నోట్లో పెట్టకుంటే ఇదేనా అమృతం అంటే అని అనిపిస్తుంది. దీని తయారీకి చుక్క నూనె అక్కర్లేదు, స్టవ్ వెలిగించే పనే లేదు. అప్పటికప్పుడు చిటికెలో చేసుకోవచ్చు. ఈ పచ్చడి తయారీలో ఏ ఒక్క పదార్థాం వేయించే పని ఉండదు, అన్నీ పచ్చగానే చేసుకుంటాం కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇది కేవలం ఒక కూర మాత్రమే కాదు..పొలంలో పనిచేసే రైతులు, కూలీలు తమ కష్టాన్ని మర్చిపోడానికి, ఆకలి తీర్చుకోడానికి నూరుకునే ఒక అద్భుతమైన వంటకం. అంతేకాకుండా బాగా వేడి చేసి మూత్రం సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నవాళ్లు ఈ పచ్చడి తింటే సమస్య తగ్గుతుంది. అయితే ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదని గుర్తుంచుకోండి. అప్పటికప్పుడు చేసుకుని తినేందుకే ఇది బాగుంటుంది. మన పూర్వీకుల స్టైల్ లో పొలం పచ్చడి మీ ఇంట్లో చిటికెలో తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

పొలం పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-జీలకర్ర
-వెల్లుల్లి
-పచ్చిమిర్చి
-చింతపండు
-బెల్లం
-ఉప్పు,కొత్తిమీర
చాలా తక్కువ టైంలో రుచికరమైన, పౌష్టికమైన పచ్చడి.. ఉల్లిపాయలతో ఈజీగా చేసేయండిలా..
పొలం పచ్చడి తయారీ విధానం
-ముందుగా కొద్దిగా చింతపండును నీటిలో నానబెట్టుకోండి.
-ఈ పచ్చడి తయారీ కోసం ముందుగా రోట్లో అర స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, 1 టీస్పూన్ కళ్లు ఉప్పు, 3 పచ్చి మిరపకాయలు వేసి, నానబెట్టుకున్న చింతపండు, టేస్ట్ బ్యాలెన్స్ అవడం కోసం కావాలనుకుంటే 1 స్పూన్ బెల్లం వేసి మొత్తాన్ని మెత్తగా దంచుకోండి.
-మెత్తగా దంచుకున్న తర్వాత అందులో గుప్పుడు కొత్తిమీర కాడలతో సహా వేసి మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులోనే 1 ఉల్లిపాయను చిన్న సైజ్ లో కట్ చేసి వేసుకుని కచ్చాపచ్చగా దంచుకోండి.
-అంతే పొలం పచ్చడి రెడీ. వేడి అన్నంలో కలుపుకుని తిన్నా లేదా జొన్న రొట్టె లేదా చపాతీలతో కలిపి తిన్నా కూడా అత్యద్భుతంగా ఉంటుంది. దీనికి రుచికి మరేదీ సాటిరాదు అన్నట్లుగానే అనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
