నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే..

నెయ్యి..ఇది ఆరోగ్యానికి దేవుడు ఇచ్చిన అమృతం లాంటిది. అయితే నెయ్యి తీసుకునే విషయంలో చాలామందిలో రకరకాల సందేహాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది రోజూ నెయ్యి తినడం వల్ల బాడీలో చెడు కొవ్వు పెరుగుతుందా? ఇది తెలుసుకోవడం కన్నా నెయ్యి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడం ముఖ్యం అని ప్రముఖ డాక్టర్ జవజాల మనోజ్ణ చెబుతున్నారు.

నెయ్యిలో హెల్తీ ఫ్యాట్స్ అయిన ఒమెగా 3, ఒమెగా 9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ అయిన HDL ని పెంచి గుండె పనితీరుని ఇంకా మెరుగుపరుస్తాయి. అలాగే ఫ్యాట్ సాల్యుబల్ విటమిన్స్ అంటే A,D,E,K ఇవి మనకు నెయ్యిలో దొరుకుతాయి. ఇవి మన కంటికి చర్మానికి ఎంతో మంచివి. మొత్తంగా రోగనిరోధక శక్తి కూడా వీటి వల్ల పెరుగుతుంది.

Does Eating Ghee Daily Increase Bad Cholesterol Here s the Truth

రోజూ మనం తినే ఆహారంలో మొదటి కొన్ని ముద్దల్లో కొంచెం నెయ్యి కలుపుకోవడం వల్ల మన కడుపులో ఉంటే గ్యాస్ట్రిక్స్ యాసిడ్స్ ఇంకా బాగా ఉత్తేజమయ్యి మనం తీసుకునే ఆహారం మొత్తం ఇంకా బాగా జీర్ణం అవుతుంది. గట్ హెల్త్ కూడా మెరుగుపడుతుందనా డాక్టర్ మనోజ్ణ తెలిపారు.

షుగర్ ఉన్నవాళ్లు కూడా రోజూ నెయ్యి తీసుకోవడం వల్ల వాళ్ల షుగర్ లెవల్స్ ఏమీ పెరిగిపోవని డాక్టర్ మనోజ్ణ చెబుతున్నారు. ఎందుకంటే నెయ్యి కార్బోహైడ్రేట్లు అసలు ఉండవు అన్నారు. ఇంకా చెప్పాలంటే ఒక కార్బోహైడ్రేట్ ఫుడ్ తో పాటు ఉదాహరణకు రైస్ తో నెయ్యి కలుపుకుని తినడం వల్ల ఈ కార్బోహైడ్రేట్ శోషణ అనేది ఈ నెయ్యి వల్ల నెమ్మదిస్తుంది. కాబట్టి రక్తంలో ఒకేసారి షుగర్ లెవల్స్ పెరిగిపోకుండా ఉంటాయి.

పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు..పక్షవాతం రాకుండా అడ్డుకునే బెస్ట్ వ్యాయామం ఇదే!పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు..పక్షవాతం రాకుండా అడ్డుకునే బెస్ట్ వ్యాయామం ఇదే!

కానీ నెయ్యిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజుకి 1 లేదా 2 టీస్పూన్లు నెయ్యి మాత్రమే తీసుకోవాలి. అంతకుమించి ఎక్కువగా తీసుకున్నట్లయితే చెడు కొలెస్ట్రాల్ అంటే LDL పెరుగుతుంది. బరువు కూడా పెరుగుతారని ఆమె చెప్పారు. కాబట్టి నెయ్యి మితంగా తీసుకుంటే అమృతం..ఎక్కువగా తీసుకుంటే విషంలా హాని చేస్తుందన్నమాట.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, November 4, 2026, 12:03 [IST]
Desktop Bottom Promotion