ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్..

Posted By:

బాడీ స్ట్రాంగ్ గా అవ్వడానికి, ఎముకలు బలంగా అవ్వడానికి, రక్తంగా తక్కువగా ఉన్నోళ్లు, ఐరన్ లోపంతో బాధపడేవాళ్లు తప్పక తినాల్సిన స్వీట్ రాగి హల్వా. మన అమ్మమ్మల కాలంలో దీనినితరుచుగా చేసుకుని తినేవాళ్లు. అందుకే వాళ్లు ముసలితనంలో కూడా ఎముకలు బలంగా ఉండి, హెల్తీగా ఉండేవాళ్లు. పాత రోజుల్లో ఆడవాళ్లకి రక్తహీనత రాకుండా ఉండేందుకు, పీరియడ్స్ టైంలో తినిపించేవాళ్లు.

దీనిని రాగి తోప అని కూడా పిలుస్తారు. కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండే రాగులు, బెల్లం కలయితే చేసే ఈ స్వీట్ తింటుంటే నోట్లో వెన్నలా అలా కరిగిపోతుందంటే. రాగి హల్వా మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Ragi Halwa Recipe in Telugu Ultimate Healthy Sweet for Strong Bones and Iron Deficiency

రాగి హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు

-రాగి పిండి
-బెల్లం
-యాలకల పొడి
-నెయ్యి
-జీడిపప్పు

విటమిన్ B12 లోపానికి చెక్, నరాల వీక్నెస్ తగ్గించే మేక లివర్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే..

రాగి హల్వా తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కాగిన తర్వాత అందులో కొన్ని జీడిపప్పు పలుకులు వేసి వేయించాలి. వేగిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.

-తర్వాత పాన్ లో మిగిలి ఉన్న నెయ్యిలోనే 1 కప్పు రాగి పిండి వేసి తక్కువ మంట మీద కలుపుకుంటూ రాగి పిండి కమ్మటి వాసన వచ్చేవరకు వేయించుకోవాలి. ఈ హల్వా టేస్ట్ మొత్తం రాగి పిండి వేయించుకునే విధానంలోనే ఉంటుంది. ఇది వేగడానికి దాదాపు 10 నిమిషాల వరకు పడుతుంది. వేగిన తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. అందులో 1 కప్పు బెల్లం తురుము వేసి, ఇందులోనే 2 కప్పుల నీళ్లు పోసి జస్ట్ బెల్లం కరిగిస్తే చాలు, పాకం రానక్కర్లేదు. బెల్లం కరిగి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకున్నాక స్టవ్ ఆపేయండి.

బీహార్ స్పెషల్ దాల్ పూరీ.. శనగపప్పు స్టఫింగ్‌ తో పర్ఫెక్ట్ రెసిపీ

-ఇప్పుడు ఈ బెల్లం నీళ్లను వేయించుకున్న రాగి పిండిలో వడకట్టి పోసుకోండి. ఉండలు లేకుండా గరిటతో బాగా కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ రాగి పిండి గిన్నెను దానిమీద పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిసేలా కలిపి 2-3 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. తర్వాత మళ్లీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి మరో 3 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మళ్లీ అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి. నెయ్యి సపరేట్ అయ్యేవరకు ఉడికించుకోవాలి.

-తర్వాత అందులో యాలకల పొడి కొంచెం వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా వేయించిన జీడిపప్పులు వేసి కలుపుకుని బాగా ముద్దగా అయ్యి అంచుల దగ్గర నుంచి నెయ్యి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆపేయండి.

-అంతే రాగి హల్వా రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, November 4, 2026, 12:44 [IST]
Desktop Bottom Promotion