Latest Updates
-
మలబద్దకంతో బాధపడుతున్నారా? మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ ఫుడ్స్ తినండి -
అన్నం, కూర అక్కర్లేదు..ఇదొక్కటి ఉంటే చాలు పొట్టకి హాయిగా, లంచ్ బాక్స్ కి బెస్ట్..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు..శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు -
వేడి చేసి మూత్రం సరిగ్గా రావట్లేదా? మన పూర్వీకుల ఈ పచ్చడి తింటే చాలు..చుక్క నూనె లేకుండానే క్షణాల్లో చేయండిలా -
చాలా తక్కువ టైంలో రుచికరమైన, పౌష్టికమైన పచ్చడి.. ఉల్లిపాయలతో ఈజీగా చేసేయండిలా.. -
పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు..పక్షవాతం రాకుండా అడ్డుకునే బెస్ట్ వ్యాయామం ఇదే! -
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో.. -
కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో -
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా.. -
ఇవేం లవ్ మ్యారేజ్ లు రా బాబోయ్: పెళ్లయిన ఏడాదికే ప్రియుడితో హోటల్ లో భర్తకు దొరికిన భార్య..వీడియో చూడండి
జస్ట్ 20 నిమిషాల్లో ది బెస్ట్ సాంబార్ రైస్.. రెస్టారెంట్ ని మించిన రుచితో ఎలా చేసుకోవాలంటే..
సౌతిండియాలో చాలామంది ఇష్టంగా తినే ఫుడ్స్ లో సాంబార్ రైస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. వేడి అన్నంలో సాంబార్ కలుపుకుని తినడం ఒక ఎత్తయితే బియ్యం,పప్పు, రకరకాల కూరగాయలు కలిసి ప్రత్యేకమైన మసాలాతో ఉండే సాంబార్ రైస్ రుచికి సాటి ఏదీ రాదు. ఇది కడుపుకి పండగ లాంటి ఫుడ్ అని చెప్పొచ్చు. పొట్టలో చాలా హాయిగా ఉంటది ఇది తిన్నప్పుడు. అయితే పక్కా కొలతలతో, సూపర్ టేస్ట్ తో ఉండేలా సాంబార్ రైస్ ని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-కందిపప్పు
-చింతపండు
-మెంతులు
-ఉల్లిపాయ
-కూరగాయల ముక్కలు
-సాంబార్ ఉల్లిపాయలు
-బెల్లం
-కారం
-సాంబార్ పొడి
-పసుపు
-ఉప్పు
-నూనె
-ఉల్లిపాయ
-కరివేపాకు
-కొత్తిమీర
-నెయ్యి
-టమాటో

సాంబార్ రైస్ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో ముప్పావు కప్పు బియ్యం, 1/3 కప్పు కందిపప్పు వేసి శుభ్రంగా కడిగి కనీసం 1 గంట సేపు నానబెట్టుకోండి.
-తర్వాత 40 గ్రాముల చింతపండు(చిన్న జాయకాయ సైజు అంత)లో వేడి నీళ్లు పోసి నానబెట్టండి.
-1 గంట తర్వాత కుక్కర్ లో కడిగి నానబెట్టుకున్న బియ్యం,కందిపప్పు వేసి,ఇందులో 4 కప్పుల నీళ్లు(1 లీటరు)పోసి ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మీడియం మంట మీద 4 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేయండి.
-తర్వాత గంటసేపు నానిన చింతపండు నుంచి చిక్కటి గుజ్జు తీసి ఒక గిన్నెలో వేసుకోండి. ఇందులో 1 టీస్పూన్ కారం, 30 గ్రాముల బెల్లం, 2 టీస్పూన్ల సాంబార్ పొడి, పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 6 టేబుల్ స్పూన్ల పల్లీ నూనె వేసి వేడయ్యాక అందులో అర టేబుల్ స్పూన్, అర టీస్పూన్ మెంతులు వేసి వేగాక అందులో 2 పచ్చిమిర్చి చీలికలు, చిటికెడు ఇంగువ వేసి వేపాక అందులో కరివేపాకు వేసి వేయించాక అందులోనే 1 ఉల్లిపాయ క్యూబ్స్ వేసి వేయిచాలి.
ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు..శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు
-తర్వాత అందులో 10 సాంబార్ ఉల్లిపాయలు, రెండున్నర కప్పుల కూరగాయలు(275 గ్రాములు కొలతలో)మీకు నచ్చిన కూరగాయల ముక్కలు(10 తీపి గుమ్మడి ముక్కలు, 2 మునగకాడల ముక్కలు, 5 కాలీఫ్లవర్ ముక్కలు, 2 ఫ్రెంచ్ బీన్స్ కట్ చేసిన ముక్కలు, 2 బెండకాయల ముక్కలు, అర క్యారెట్ పొడవాటి ముక్కలు, 10 చిలగడదుంప ముక్కలు, చెక్కు తీసుకున్న సగం అరటికాయ ముక్కలు) వేసి 5 నిమిషాలు వేయించాలి.
-మధ్యమధ్యలో కలుపుతూ మునక్కాడ మెత్తబడేవరకు మగ్గించాలి. తర్వాత 2 టమాటోల ముక్కలు వేసి 1 నిమిషం వేపండి. తర్వాత అందులో పక్కన ఉంచుకున్న చింతపండు పులుసు వేసి 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వండి.
-3 నిమిషాల తర్వాత అందులో ఉడికించిన పప్పు అన్నం వేసి కలపండి. తర్వాత అందులో అర లీటరు వేడి నీళ్లు పోసి మూతపెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వండి.
-తర్వాత మూత తీసి అందులో కొత్తిమీర, 4 టేబుల్ స్పూన్ల నెయ్యి కలిపి స్టవ్ ఆపేయండి.
-అంతే సాంబార్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
