ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా!

నెల తిరిగే సరికి చేతికి అందే జీతం, పెద్దగా రిస్క్ లేని జీవితం, ప్రశాంతత కావాలని సగటు మనిషి కోరుకుంటాడు. అందుకే చాలామంది జీవితాంతం ఒకరి కింద పనిచేయడానికి లేదా ఉద్యోగం చేయడానికి సిద్ధపడతారు. కానీ కొందరి ఆలోచనా విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నెల జీతం కోసం నా కలను ఎందుకు వదులుకోవాలి? ఒకరి కింద నేను పనిచేయడం ఏమిటి? అనే ధిక్కార స్వరం వారిలో వినిపిస్తుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యాపార రంగంలో రారాజులుగా వెలుగొందే సత్తా కొన్ని రాశుల వారికి సహజంగానే ఉంటుంది. వారే భవిష్యత్తును నిర్దేశించే వ్యాపారవేత్తలుగా ఎదుగుతారు. ఆ రాశులు ఏవో, వారి ప్రత్యేకతలు ఏమిటో ఇక్కడ చూడండి.

Born to Be Bosses 3 Zodiac Signs Who Hate Working for Others

మకర రాశి

మకర రాశి వారిపై కర్మ కారకుడైన శని దేవుని ప్రభావం మెండుగా ఉంటుంది. అందుకే వీరిలో ఓపిక, క్రమశిక్షణ చాలా ఎక్కువ. వీరు ఏ నిర్ణయమైనా తొందరపడి తీసుకోరు. పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాతే అడుగు ముందుకు వేస్తారు. అడ్డదారులు తొక్కడానికి అస్సలు ఇష్టపడరు. వీరి వ్యాపారం నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించినా, వారు వేసే పునాది మాత్రం అత్యంత బలంగా ఉంటుంది.

ఉద్యోగంలో ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే, సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనే తపన వారిని నిద్రపోనివ్వదు. ఆర్థిక నిర్వహణలో వీరిని మించిన వారు లేరు. కష్టకాలంలో కూడా వెనకడుగు వేయకుండా, భారీ వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించగల సత్తా మకర రాశి సొంతం.

కన్నయ్య కరుణ: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నుంచి ఈ రాశులకు కుబేర యోగమే! కన్నయ్య కరుణ: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నుంచి ఈ రాశులకు కుబేర యోగమే!

మేష రాశి

నవగ్రహాలలో సేనాధిపతి అయిన కుజుడి పూర్తి ప్రభావం మేష రాశి వారిపై ఉంటుంది. కాబట్టి అంతులేని ఉత్సాహం, అపారమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం వీరి సొంతం. ఒకరి ఆదేశాల కింద పనిచేయడం వీరికి అస్సలు గిట్టదు. వీరికి ఏదైనా కొత్త బిజినెస్ ఐడియా వస్తే చాలు, ఏమాత్రం సమయం వృధా చేయకుండా వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేస్తారు. స్టార్టప్ ప్రపంచం వీరికి పక్కాగా సరిపోతుంది. వీరి వేగవంతమైన నిర్ణయాలు వీరిని విజయపథంలో నడిపిస్తాయి. అయితే ఒక్కోసారి అతివేగంగా వ్యవహరించి ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు.

వృషభ రాశి

వృషభ రాశి వారిలో మకర రాశి వారి లాంటి స్థిరత్వం, మేష రాశి వారి లాంటి ఆత్మవిశ్వాసం రెండూ కలగలిపి ఉంటాయి. వీరికి డబ్బు పట్ల అపారమైన అవగాహన ఉంటుంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో, సరైన చోట పెట్టుబడులు పెట్టడంలో వీరు దిట్టలు. డబ్బుతో డబ్బును ఎలా సృష్టించాలో వీరికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. వ్యాపారం కోసం ఎంతలా కష్టపడటానికైనా వీరు వెనుకాడరు. క్రమక్రమంగా ఎదుగుతూ, ఎప్పటికీ కూలిపోని ఒక బలమైన, సుస్థిరమైన వ్యాపార వ్యవస్థను స్థాపించడంలో వృషభ రాశి వారు ఎప్పుడూ ముందుంటారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Wednesday, September 2, 2026, 13:06 [IST]
Desktop Bottom Promotion