Latest Updates
-
మూత్ర విసర్జన చేసిన వెంటనే మళ్లీ టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తోందా? అసలు కారణాలు ఇవే! -
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే -
ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్ జెండర్ -
ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! -
చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. -
చలికాలంలో వెచ్చగా, రుచిగా మహారాష్ట్ర స్పెషల్ టమాటా సూప్.. ఇంట్లోనే సులభంగా చేసుకోండి! -
చలికాలంలో వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే మిల్లెట్ కూరగాయల సూప్..ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
టీ తాగే వేళలో తినడానికి బెస్ట్ హెల్దీ స్నాక్..తక్కువ సమయంలో,తక్కువ నూనెతో మఖానా టిక్కీ చేసుకోండిలా.. -
మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి లివర్ ప్రాబ్లమ్ ముప్పు ఎక్కువో తెలుసా? -
ఒమేగా 3 పుష్కలంగా ఉండే అవిసె గింజల లడ్డూ.. చలికాలంలో రోజుకొకటి తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు
చికెన్ కబాబ్ బిర్యానీ..ఇంత రుచికరమైన చికెన్ బిర్యానీ ఎప్పుడూ తిని ఉండరు..ఇంట్లోనే చేసుకోండిలా..
బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి..అందులోనూ సువాసనలు వెదజల్లే సీరగ సాంబా బియ్యంతో చేసిన బిర్యానీకి, కారంగా, జ్యూసీగా ఉండే చికెన్ కబాబ్ తొక్కు తోడైతే ఆ రుచే వేరు. సాధారణ బిర్యానీలకు భిన్నంగా, ఎంతో ప్రత్యేకంగా ఉండే కబాబ్ బిర్యానీ రుచి చూస్తే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు.
వీకెండ్ లో మీ కుటుంబ సభ్యులకు ఒక అద్భుతమైన విందును అందించడానికి ఈ నోరూరించే రెసిపీని తప్పక ప్రయత్నించండి. చికెన్ కబాబ్ బిర్యానీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
చికెన్ కబాబ్ తొక్కు కోసం:
బోన్ లెస్ చికెన్
రుచికి సరిపడా ఉప్పు
చిటికెడు పసుపు
కారం, ధనియాల పొడి
చికెన్ మసాలా
అల్లం వెల్లుల్లి పేస్ట్
చిక్కటి పెరుగు
చిన్న ఉల్లిపాయల పేస్ట్
టొమాటో పేస్ట్
నూనె, సోంపు గింజలు
బిర్యానీ కోసం:
సీరగ సాంబా బియ్యం - 1 కప్పు
నూనె, నెయ్యి
హోల్ గరం మసాలా దినుసులు
సన్నగా తరిగిన ఉల్లిపాయలు
ఉప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్
పచ్చిమిర్చి
పుదీనా, కొత్తిమీర తరుగు
కారం, బిర్యానీ మసాలా
పెరుగు
చికెన్ ముక్కలు
చికెన్ స్టాక్ క్యూబ్స్
తరిగిన టొమాటోలు
నీరు - ఒకటిన్నర కప్పులు
నిమ్మరసం
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే
తయారీ విధానం
-ఒక గిన్నెలో బోన్ లెస్ చికెన్ తీసుకుని నూనె, సోంపు తప్ప పైన చెప్పిన మసాలాలు, పెరుగు, ఉల్లి టొమాటో పేస్టులన్నీ వేసి బాగా కలిపి కాసేపు మ్యారినేట్ చేయండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేసి, అందులో సోంపు వేసి చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసి మూత పెట్టండి. మంటను మీడియంలో ఉంచి, చికెన్ పూర్తిగా ఉడికి నూనె పైకి తేలే వరకు సుమారు 15 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడికించండి. అంతే, జ్యూసీ చికెన్ కబాబ్ తొక్కు రెడీ.
-బిర్యానీ తయారీ కోసం.. కుక్కర్ లో నూనె, నెయ్యి వేసి వేడి చేయండి. అందులో హోల్ గరం మసాలా దినుసులు, తరిగిన ఉల్లిపాయలు, కాస్త ఉప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కారం, బిర్యానీ మసాలా వేసి పచ్చి వాసన పోయేలా వేయించండి.
-ఇప్పుడు అందులో పెరుగు, చికెన్ ముక్కలు, చికెన్ స్టాక్ క్యూబ్స్, టమాటోలు వేసి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. తర్వాత ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల చొప్పున నీరు పోసి బాగా మరగనివ్వండి.
-నీరు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టిన సీరగ సాంబా బియ్యాన్ని వేయండి. కుక్కర్ మూత పెట్టి పెద్ద మంట మీద మీద 2 విజిల్స్, ఆ తర్వాత తక్కువ మంట మీద 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆపేయండి.
-కుక్కర్ ప్రెజర్ పూర్తిగా పోయాక మూత తీసి, కొత్తిమీర, పుదీనా తరుగు, కాస్త నిమ్మరసం చల్లి మెల్లగా కలపండి. వేడివేడి, సువాసనభరితమైన సీరగ సాంబా బిర్యానీని మనం సిద్ధం చేసుకున్న స్పైసీ చికెన్ కబాబ్ తొక్కుతో కలిపి వడ్డించండి.
-ఈ అద్భుతమైన కాంబినేషన్ రుచిని ఒకసారి చూశారంటే మళ్ళీ మళ్ళీ వదులుకోలేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
