భారతే బెటర్.. అమెరికా పర్యటనపై భారతీయ యువతి షాకింగ్ అనుభవాలు!

అగ్రరాజ్యం అమెరికా కంటే మన భారతదేశమే ఎంతో మెరుగని ఓ భారతీయ మహిళ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది. రెండు వారాల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన నందిని అనే యువతి, అక్కడి జీవన విధానం, రోజువారీ సౌకర్యాలపై తన అనుభవాలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. అమెరికాతో పోలిస్తే భారత్‌ లోనే జీవితం చాలా సౌకర్యవంతంగా, సులభంగా ఉందని ఆమె చెప్పిన ఐదు కీలక అంశాలు నెటిజన్ల మధ్య పెద్ద చర్చకే దారితీశాయి.

ముందుగా ఆరోగ్య సంరక్షణ ఖర్చుల గురించి నందిని ప్రస్తావించారు. అమెరికా పర్యటనలో తనకు సాధారణ జ్వరం రావడంతో డాక్టర్ ని సంప్రదించగా ఏకంగా 150 డాలర్లు వసూలు చేశారని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్థానిక హెల్త్ ఇన్స్యూరెన్స్ లేని పర్యాటకులకు ఇది పెద్ద భారమని, అదే మన దేశంలో అయితే కేవలం 7-8 డాలర్లతోనే డాక్టర్ కన్సల్టేషన్ పూర్తవుతుందని గుర్తుచేశారు.

India vs USA Indian Woman Lists 5 Reasons Why India is Better Than America

అలాగే డిజిటల్ చెల్లింపుల విషయంలోనూ అమెరికా టెక్నికల్ గా వెనుకబడి ఉందని విమర్శించారు. అక్కడి ఓ జనరల్ స్టోర్‌ లో తన కార్డును తీసుకోకపోవడంతో ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకోవాల్సి వచ్చిందని, కానీ భారత్‌ లో యూపీఐ ప్రతిచోటా అందుబాటులో ఉండి చెల్లింపులను ఎంతో సులభతరం చేసిందని కొనియాడారు.

అమెరికాలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌ వేర్ కంపెనీకి వెళ్లినప్పుడు అక్కడ పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారని, భారతీయ నిపుణులపై అమెరికా ఎంతగా ఆధారపడిందో దీన్ని బట్టి అర్థమవుతుందని ఆమె అన్నారు.

ఇక రెస్టారెంట్లలో టిప్ లు ఇచ్చే సంస్కృతి తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని తెలిపారు. 30 డాలర్ల భోజనానికి వెయిటర్ టిప్ కోసం బలవంతంగా బతిమాలడం చూసి షాక్ అయ్యానని, మన దగ్గర ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురవదని చెప్పారు.

ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్

ప్రజా రవాణా విషయానికొస్తే, భారత్‌ లోని ప్రధాన నగరాల్లో మెట్రో వ్యవస్థ అద్భుతంగా ఉందని, కానీ అమెరికన్ మెట్రో నిర్వహణ అధ్వానంగా ఉండి, సమయపాలన లోపించిందని విమర్శించారు. అందులో ప్రయాణించే కొందరి ప్రవర్తన వింతగా ఉండి అసౌకర్యంగా అనిపించిందన్నారు. సొంత కారు లేకపోతే కనీసం కిరాణా సామాను కూడా తెచ్చుకోలేని పరిస్థితి అక్కడ ఉందని, పర్యాటకులకు అమెరికా ఏమాత్రం అనుకూలం కాదని తేల్చిచెప్పారు.

నందిని పోస్ట్‌పై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలువురు ఆమె అభిప్రాయాలతో ఏకీభవిస్తూ, పాశ్చాత్య దేశాల కంటే భారత్‌లో వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని ప్రశంసించారు. మరికొందరు ఇంకొన్ని రోజులు అక్కడ ఉండి ఉంటే జాతి వివక్ష కూడా తెలిసేదని వ్యాఖ్యానించారు. అయితే కొందరు మాత్రం ఆమె వాదనను పూర్తిగా తప్పుబట్టారు. సగటు భారతీయుడితో పోలిస్తే అమెరికన్ల జీవన ప్రమాణం, కొనుగోలు శక్తి చాలా ఎక్కువని, ఆమె అనుభవం పూర్తి చిత్రాన్ని చూపడం లేదని గుర్తుచేశారు.

Story first published: Wednesday, November 25, 2026, 23:55 [IST]
Desktop Bottom Promotion