బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి!

ప్రస్తుతం అందరి లైఫ్ లు బిజీగా మారిపోయాయి. ఈ టైంలో కొద్దిగా విరామం దొరికితే కొత్త ప్లేస్ లకు వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు. అయితే కొందరికి మాత్రం ఎప్పుడూ టూర్లు వెళ్తుండాలని, కొత్త ప్రదేశాలకు వెళ్లాలని ఉంటుంది. వీరికి ప్రయాణాలు కేవలం సరదా కాదు అదొక వ్యసనం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన రాశిని బట్టి వారి స్వభావం, ఇష్టాయిష్టాలు, ఆలోచనా విధానం ఆధారపడి ఉంటాయి. పుట్టుకతోనే ట్రావెలర్స్ అనదగ్గ ఆ మూడు రాశుల వారు ఎవరో, వారి లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ చూడండి.

Born to Travel Are You One of These 3 Wanderlust Zodiac Signs

మేష రాశి

నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన కుజుడి (అంగారకుడు) ఆధీనంలో ఉండే రాశి ఇది. ఈ రాశి వారు అంతులేని శక్తి సామర్థ్యాలతో ఎప్పుడూ చురుకుగా ఉంటారు. ఒక ప్లాన్ ప్రకారం కాకుండా, సమయం దొరికిన మరుక్షణమే బ్యాగ్ సర్దుకుని బయలుదేరే తత్వం వీరిది. ప్రయాణాలకు వీరికి వేరొకరి తోడు అవసరం లేదు. సోలో ట్రావెలింగ్ చేయడానికి వీరు ఏమాత్రం వెనుకాడరు. తమకు తామే బెస్ట్ కంపెనీగా భావిస్తూ కొత్త ప్రదేశాలను ఎంతో ఆస్వాదిస్తారు.

సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం!సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం!

మిథున రాశి

జ్ఞానానికి, తెలివితేటలకు ప్రతీక అయిన బుధ గ్రహం మిథున రాశిని పాలిస్తుంది. ఈ రాశి వారు అచ్చమైన ప్రకృతి ప్రేమికులు. పచ్చని పల్లెలు, ఎత్తైన పర్వతాలు, ప్రశాంతమైన సముద్ర తీరాల మధ్య గడపడాన్ని వీరు అమితంగా ఇష్టపడతారు. బుధుడి ప్రభావం వల్ల వీరిలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. విభిన్న సంస్కృతులు, ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలను దగ్గరుండి చూడాలని వీరు ఆరాటపడతారు. అందుకే మిథున రాశి వారిని అత్యుత్తమ యాత్రికులుగా జ్యోతిష్య నిపుణులు వర్ణిస్తుంటారు.

ధనుస్సు రాశి

ప్రయాణాల కోసం పుట్టిన రాశి ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా ధనుస్సు రాశే. వీరికి సాహసాలు చేయడమంటే ప్రాణం. సుదీర్ఘమైన ప్రయాణాలు చేయడం, కొత్త వ్యక్తులను కలవడం, వారితో స్నేహం చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఒకే ఊరిలో, ఒకే ఇంట్లో, ఒకే రొటీన్ జీవితాన్ని గడపడం వీరికి ఏమాత్రం నచ్చదు. తరచుగా తమ నివాసాలను మార్చుకుంటూ కొత్తదనాన్ని కోరుకుంటారు. వీరికి ఒక స్థిరమైన నివాసం ఉన్నప్పటికీ, సెలవులు వస్తే చాలు.. ప్రపంచ పటంలో ఏదో ఒక కొత్త మూలను అన్వేషిస్తూ అక్కడికి వాలిపోతారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Friday, September 18, 2026, 22:27 [IST]
Desktop Bottom Promotion