Latest Updates
-
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే!
వ్యాపారం, బుద్ధి, కమ్యూనికేషన్లకు కారకుడిగా భావించే బుధుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. 2026 ఆగస్టు 29న బుధుడు..శుక్రుడికి చెందిన పూర్వఫల్గుణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 5, 2026 వరకు బుధుడు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు.
వారం రోజుల పాటే ఉండే ఈ బుధ నక్షత్ర గోచారం మొత్తం 12 రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే ప్రధానంగా 4 రాశుల వారు మాత్రం డబ్బు, వ్యాపారం, వృత్తిపరమైన విషయాల్లో అడుగడుగునా అప్రమత్తంగా ఉండాలి.

వృషభ రాశి
బుధుని ఈ నక్షత్ర మార్పు ప్రభావంతో ఆఫీసులో మీ పై అధికారులతో తీవ్రస్థాయిలో అభిప్రాయభేదాలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అనవసరమైన వాదనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆర్థిక పరంగా నష్టాలు వచ్చే సూచనలు మెండుగా ఉన్నాయి. కొంతమందికి అకస్మాత్తుగా ఉద్యోగ బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో వ్యాపార లేదా కుటుంబ విషయాల్లో ఎలాంటి కీలకమైన పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యపరంగా కూడా అప్రమత్తత అవసరం.
కర్కాటక రాశి
ఈ గోచార సమయంలో కర్కాటక రాశి వారి జీవితం కాస్త అస్తవ్యస్తంగా మారుతుంది. మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి, ఆ ప్రభావం మీ బంధాలపై పడుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరితోనూ వాగ్వివాదాలకు దిగకుండా, అత్యంత ఓర్పు, సహనంతో వ్యవహరించాలి. ఆఫీసులో మీపై పని భారం విపరీతంగా పెరగడం వల్ల శారీరక, మానసిక అలసట మిమ్మల్ని బాధిస్తుంది.
ధనుస్సు రాశి
బుధ గోచారం ధనుస్సు రాశి వారికి గట్టి హెచ్చరికలు జారీ చేస్తోంది. అనుకోని విధంగా భారీ ఆర్థిక నష్టాలు సంభవించే ముప్పు పొంచి ఉంది. కాబట్టి స్టాక్ మార్కెట్లు, స్థిరాస్తి వంటి వాటిలో కొత్తగా ఎలాంటి పెద్ద పెట్టుబడులు పెట్టకండి. ప్రస్తుతానికి వాటిని వాయిదా వేసుకోవడమే మీకు శ్రీరామరక్ష. వ్యాపార రంగంలో ఉన్నవారు తమ భాగస్వాములతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మానసిక అశాంతి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
మకర రాశి
మకర రాశి వారు ఈ సమయంలో తీవ్రమైన భావోద్వేగాల హెచ్చుతగ్గులకు గురవుతారు. ఆరోగ్యం కూడా క్షీణించే సూచనలు ఉన్నాయి. ఏదైనా పనిని తొందరపడి చేయడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అది వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుంది. ప్రతీ అడుగులోనూ ఏకాగ్రత తప్పనిసరి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
