Latest Updates
-
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.!
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 18న సాయంత్రం 5 గంటల సమయంలో కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే అప్పటికే గురుడు గ్రహం ఆ రాశిలోనే ఉంది. నవంబర్ 12 వరకు అంగారకుడు అక్కడే ఉండనున్నాడు. అ ఈ రెండు గ్రహాలను మంచి స్నేహితులుగా పరిగణిస్తుండటంతో ఈ ప్రభావం కొన్ని రాశుల వారిపై పడనుంది. విజయాలు, లక్ష్యాలు, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు ఇలా అన్నిటిలోనూ వారికి ఈ గ్రహాల కలయిక కలిసి రానుంది. మరి ఆ అదృష్టవంతులు ఏ రాశిలో ఉన్నారో చూద్దాం..

కర్కాటక రాశి

కుజ, గురు గ్రహాల కలయిక ఇదే రాశిలో జరగనుండటంతో ఈ రాశి వారికి రాజయోగం పట్టనుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎనలేని ఆర్థిక లాభాలను చూడనున్నారు. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను తీసుకువస్తాయి. పెండింగ్ ప్రాజెక్టుల్లో వేగం పెరుగుతుంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేయవచ్చు. అది మీకు కలిసి వస్తుంది. అంతేకాకుండా వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా మెరుగుపడతాయి. వాటితో పై అధికారుల మన్ననలు అందుకుంటారు. పలుకుబడి ఉన్న వ్యక్తులతో ప్రయోజనాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. వారి నుంచి మీరు అందుకునే మద్దతు మీకు ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది.

కన్యారాశి
కుజ, గురు గ్రహాల కలయికతో కన్యారాశి వారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయని జ్యోతిష్యం అంచనా వేస్తుంది. మీ సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు. దీంతో మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. దీంతో పాటు ఫ్యామిలీలో వివాహ ప్రస్తావనకి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉంది. వృత్తి బాధ్యతల్లో మీ ప్రాధాన్యతను అర్థం చేసుకుని కీలక ప్రాజెక్టులు, పనులపై పూర్తిగా ఏకాగ్రతతో పనిచేస్తారు. దీంతో పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కష్టపడి పనిచేసే స్వభావం అలవరుచుకుంటారు. ఇంకా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీంతో భవిష్యత్తులో విజయాలు అందుకునే అవకాశాలు పుష్కలం. విద్యారంగంలో ఉన్నవారు ఉన్నతి సాధిస్తారు.

మీన రాశి
సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12 వరకు మీన రాశి వారికి కీలక సమయం. ఈ కలయిక వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడులతో మంచి లాభాలను గడిస్తారు. దీంతో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉంటారు. తద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. దీంతో ఆత్మవిశ్వాసం పెరిగి పాజిటివిటీతో పనిచేస్తారు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో మీ ఎదుగుదలకి దోహదపడతాయి. వ్యాపారస్థులు ముఖ్యమైన ప్రాజెక్టును పొందుతారు. దీంతో కొత్త అవకాశాలు అందుకుని ఆర్థికంగా పైకి ఎదిగే అవకాశం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
