Latest Updates
-
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే..
శనితిరోగమనంలో కన్యా రాశిపై శని ప్రభావం ఇలా వుంటుంది..!
శని అనగానే చాలా మంది భయపడుతూ వుంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఏ పని చేసినా కలిసి రాదు. సమస్యలు వుంటాయ్, అదే విధంగా ప్రశాంతత లోపిస్తుంది. ఏ పని చేసినా కలిసి రాకపోగా పనులు చాలా నిదానంగా కొనసాగుతాయ్. ఎవరి కర్మలను బట్టి వారికి శని ఫలితాలను ఇస్తూ వుంటాడు. అయితే క్రమ శిక్షణకు కారుకుడు కూడా శనిదేవుడే. వారి వారి జీవితాన్ని క్రమ పధ్దతిలో నిజాయితీగా గడుపుకున్నట్టయితే గనుక శనిదేవుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. వారి జీవితంలో మంచి విజయాలు కూడా వుంటాయ్. కాబట్టి శని వక్రగతి చెందినప్పుడు కూడా కష్టపడి పనిచేస్తే శనిదేవుడు మంచి ఫలితాలను ఇస్తాడు. శనికి మూడు దశలు వుంటాయ్. ఈ ధశలు కొనసాగుతున్నప్పుడు ఫలితాలు అంత త్వరగా రావు.

శని వక్రగతి చెందినప్పుడు కన్యారాశి వారిపై ఎలాంటి ప్రభావం వుంటుంది. వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టి అప్రమత్తంగా వుండాలో చూద్దాం. లోన్స్ విషయంలో కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా వుండాలి. లోన్లు సాంక్షన్ అవడానికి చాలా సమయం పడుతుంది. అంతకు ముందు చేసిన అప్పులూ, రుణాలూ తీర్చుకోలేకపోతారు. ఈ సమయంలో శతృవుల బాధ చాలా ఎక్కువగా వుంటుంది. ఈ సమయంలో నరదృష్టి కూడా చాలా ఎక్కువగానే వుంటుంది. కాబట్టి కన్యారాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. లోన్స్ తీసుకునే విషయంలో, అప్పులు తీర్చే విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. శతృవులతో కాస్త జాగ్రత్తగా వుండాలి. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వుండాలి. ఆహార నియమాలను పాటించాలి. సరైన జీవన విధానాన్ని అవలంబించాలి. యోగా ధ్యానం నడక ఏదో ఒకటి అలవర్చుకోవాలి. అనారోగ్య సమస్య తగ్గకపోతే అసలు సమస్య ఎక్కడ వుంది, ఎలాంటి మందులను తీసుకుంటున్నామో శ్రద్ధ పెట్టాలి.
వక్రీకరించిన శని ప్రభావం ఆరో స్థానం మీద పడుతుంది. అష్టమ స్థానం చాలా నీచ స్థానం ఈ శనీశ్వరుడిది. దీని వల్ల ఇన్సూరెన్స్ బెనిఫిట్లు, డెత్ బెనిఫిట్లు చాలా ఆలస్యమౌతాయ్. కాబట్టి ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి వుంటుంది. దూరప్రయాణాలు గనుక చేస్తూ వుంటే వాటిలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. ఈ నష్టాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలపైన దృష్టి పెట్టాలి. అప్పటి వరకు కన్యారాశి వారు చాలా ధైర్యంగా వుంటారు. కానీ శని వక్రీకరణ చెందే సమయానికి మొత్తం మారిపోతుంది. ధైర్యంగా ముందడుగు అస్సలు వేయలేకపోతారు. మీ తోబుట్టువులతో పాత గొడవలు ఏదైనా వుంటే కూడా వాటిపైన కూడా దృష్టి పెట్టాలి. ఈ సమస్యల పరిష్కార దిశగా మీరు ఆలోచన చెయ్యాలి. కాబట్టి ఏ పనిచేస్తున్నా ధైర్యంగా ముందడుగు వేయాలి. మీ తోబుట్టువలతో సరైన బాంధవ్యాలను ఏర్పాటు చేసుకోవాలి.
ప్రేమ వివాహం చేసుకోవడానికి వీరికి సమయం బాగుంది. మీ సంతానానికి ఏవైనా అనారోగ్య సమస్యలు వుంటే అవి కూడా తొలగిపోతాయ్. వ్యాపారం చేస్తుంటే గనుక మీకు మంచి లాభాలు వస్తాయ్. కన్యా రాశి వారితో స్నేహం చేస్తే చాలా మానసిక ఒత్తిడి వుంటుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. కన్యారాశి వారు వారికి అనుకూలమైన ప్రాంతాల్లో ఉద్యోగ రీత్యా బదిలీ అయ్యే అవకాశం వుంది. మొత్తంగా కన్యారాశి వారికి ఫలితాలు శుబంగానే వున్నాయ్. ఈ విషయంలో వారు ఎటువంటి భయానికీ లోను కానవసరం లేదు.
శనికి తైలాభిషేకం చేయాలి. పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ఆర్థిక సహాయం చేయాలి. హనుమాన్ చాలీసా పఠనం చేయాలి. కన్యారాశికి అధిపతి బుధగ్రహం. విష్ణుమూర్తిని ఆరాధించి విష్ణు సహస్రనామాన్ని పఠించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications