Latest Updates
-
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో.. -
కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో -
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా.. -
ఇవేం లవ్ మ్యారేజ్ లు రా బాబోయ్: పెళ్లయిన ఏడాదికే ప్రియుడితో హోటల్ లో భర్తకు దొరికిన భార్య..వీడియో చూడండి -
ఒరేయ్ అబ్బాయిలు బంపరాఫర్...పెళ్లి కానోళ్లకు ఫ్రీగా ఫిన్లాండ్ వీసా, అక్కడోళ్లతో డేటింగ్..ఖర్చులన్నీ వాళ్లవే! -
పోషకాలు పుష్కలంగా, రుచి అత్యద్భుతంగా..సొరకాయ రొట్టెలు ఈజీగా చేసుకోండిలా -
విటమిన్ B12 లోపానికి చెక్, నరాల వీక్నెస్ తగ్గించే మేక లివర్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
రాగి జావ తాగుతున్నారా? ఈ నిజం తెలియకపోతే ఎంత తాగినా వేస్ట్! -
ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి ఇదే నిదర్శనం.. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి ఎయిమ్స్ డైరెక్టర్! -
మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా..
పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు..పక్షవాతం రాకుండా అడ్డుకునే బెస్ట్ వ్యాయామం ఇదే!
ఇటీవల కాలంలో చాలామంది స్ట్రోక్ కారణంగా మరణించిన సంఘటనలు, హాస్పిటల్స్ లో చేరి తర్వాత కోలుకున్న సంఘటనలు తరచూ చూస్తున్నాం, వింటున్నాం. ముఖ్యంగా ఆడవాళ్లలో స్ట్రోక్ కు గురవుతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకి ఆందోళనకరంగా పెరుగుతోంది. శారీరక శ్రమ ఏమాత్రం లేకపోవడం వల్ల వృద్ధుల్లో పక్షవాతం వచ్చే ముప్పు ఏకంగా 80 శాతం పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు హై బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉంటే ఆ ప్రమాదం మరింత రెట్టింపు అవుతుంది.
సాధారణగా మన మెదడులోని ఏదేని ఒక భాగానికి సడెన్ గా బ్లడ్ సప్లై ఆగిపోతే లేదా మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం జరిగినప్పుడు వచ్చే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితే పక్షవాతం(స్ట్రోక్). దీనివల్ల మెదడు కణాలు వేగంగా దెబ్బతింటాయి. సరైన సమయంలో స్పందించి ట్రీట్మెంట్ అందించకపోతే, శాశ్వత వైకల్యానికి లేదా ప్రాణాపాయానికి కూడా దారితీస్తుంది.

వయసు పెరుగుతున్న కొద్దీ మన లైఫ్ స్టైల్ లో చిన్నచిన్న మార్పులు, సరైన ఎక్సర్ సైజ్ అలవాట్లు చేర్చుకుంటే ఫ్యూచర్ లో స్ట్రోక్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. వ్యాయామం అనగానే కేవలం నడక సరిపోతుందా? లేక బరువులు ఎత్తాలా? యోగా చేస్తే ప్రయోజనం ఉంటుందా? అనే సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. ఏం చేస్తే మంచిదో ఇక్కడ చూడండి.
బ్రిస్క్ వాకింగ్ (వేగంగా నడవడం)
పక్షవాతం రాకుండా అడ్డుకునే అత్యంత సులభమైన, ప్రభావవంతమైన వ్యాయామం వేగంగా నడవడం. వారానికి ఐదు రోజులు, రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడిస్తే చాలు. ఇది బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ను అద్భుతంగా నియంత్రిస్తుంది. వ్యాయామం అలవాటు లేని వారు ముందుగా తక్కువ సమయంతో మొదలుపెట్టి క్రమంగా సమయాన్ని, నడక వేగాన్ని పెంచుకోవడం బెటర్.

స్ట్రెంత్ ట్రైనింగ్ (బలవర్ధక వ్యాయామాలు)
కేవలం నడకతో శరీరంలోని అన్ని కండరాలకు బలం రాదు. కాబట్టి వారానికి కనీసం రెండు రోజులు తేలికపాటి బరువులు ఎత్తడం, రెసిస్టెన్స్ బ్యాండ్స్ వాడటం లేదా సొంత శరీర బరువుతో చేసే వ్యాయామాలు (పుషప్స్, స్క్వాట్స్ లాంటివి) చేయాలి. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఎముకలు, కండరాలు వేగంగా క్షీణిస్తాయి కాబట్టి వారికి ఇది చాలా అవసరం. కండరాలు దృఢంగా ఉంటే బరువు, షుగర్ అదుపులో ఉండి స్ట్రోక్ ముప్పు తగ్గుతుంది.
యోగాభ్యాసం (శారీరక, మానసిక సమతుల్యత)
శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో యోగా అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయం లేదా రాత్రి నిద్రపోయే ముందు యోగా, శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల బీపీ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, దీన్ని నడకకు ప్రత్యామ్నాయంగా కాకుండా, ఒక అదనపు వ్యాయామంగా చేస్తే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
