కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో

Posted By:

ప్రస్తుత బిజీ లైఫ్ లో జంక్ ఫుడ్, ఇతర అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల కారణంగా ఆరోగ్యం దెబ్బతింటోంది. అయితే ఇలాంటి టైంలో తల్బీనా లాంటి పురాతనమైన, సంపూర్ణ పోషకాలు కలిగిన ఆహారాన్ని మన రెగ్యులర్ లైఫ్ లో భాగం చేసుకోవడం చాలా అవసరం. ఒక్కసారి తల్బీనా మిక్స్ చేసుకుంటే ఏడాది వరకు నిల్వ ఉండి, ఎప్పుడు పడితే అప్పుడు చిటికెలో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చేసుకోవచ్చు.

ముఖ్యంగా ఆఫీసులకు, పనుల వెళ్లేవాళ్లు ఇంట్లో చేసుకునే టైం లేక బయట ఏదోక బయటి తింటుండే వాళ్లకు ఇది చాలా బెస్ట్. ఉపవాసాలు ఉన్నప్పుడు ఎనర్జీ ఇవ్వడానికి, ఏదైనా అనారోగ్యం వచ్చిన తర్వాత త్వరగా కోలుకోడానికి, శారీరక ఆరోగ్యంతో పాట మానసిక ఆరోగ్యం కూడా పెంపొందించే పాతకాలం నాటి అరబిక్ వంటకం తల్బినా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

No Time for Breakfast Try This Quick Nutritious Arabic Traditional Talbina Premix Recipe in Telugu

తల్బినా తయారీకి కావాల్సిన పదార్థాలు

-బార్లీ గింజలు
-పిస్తా గింజలు
-బాదం పప్పులు
-పుచ్చ గింజలు
-జీడిపప్పు
-పూల్ మఖానా
-సోంపు
-యాలకలు

ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా..

తల్బినా తయారీ విధానం

-ముందుగా ఒక కప్పు బార్లీ గింజలను శుభ్రంగా కడగండి. నీళ్లు వంపేసి ఆ బార్లీ గింజలను ఒక పొడి గుడ్డ మీద వేసి 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి.

-తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోండి. అందులో కడిగి 10 నిమిషాలు ఆరబెట్టుకున్న బార్లీ గింజలు వేసి తక్కువ మంట మీద కలుపుతూ వాటిలోని పచ్చిదనం పోయి, కమ్మని వాసన వచ్చేదాకా వేయించాలి. దీనికి కనీసం 10 నిమిషాలు పడుతుంది. వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.

-తర్వాత స్టవ్ మీద పాన్ లో అరకప్పు బాదంపప్పులు వేసి తక్కవ మంట మీద కొద్దిసేపు వేయించాలి. బాదంపప్పు సగం వేగిన తర్వాత అందులో అరకప్పు జీడిపప్పు వేసి వేయించాలి. తర్వాత వీటని మరో ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద పాన్ లో పావు కప్పు పిస్తా గింజలు, అరకప్పు పుచ్చ గింజలు వేసి కలుపుతూ వేయించాలి. పుచ్చ గింజలు వేగి ఉబ్బినట్లుగా అయిన తర్వాత వీటిని బాదం,జీడిపప్పు తీసుకున్న ప్లేట్ లో వేసుకోండి.

-తర్వాత స్టవ్ మీద పాన్ లో పూల్ మఖానా(తామర గింజలు), 1 స్పూన్ సోంపు, యాలకలు వేసి వేయించాలి. తర్వాత స్టవ్ ఆపేసి వీటిని చల్లారనివ్వాలి.

-ఇప్పుడు మిక్సీ జార్ లో పూర్తిగా చల్లారిన బార్లీ గింజలు వేసి కోర్సుగా, రవ్వలా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. ఈ పిండిని తీసి ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి

-తర్వాత మిక్సీ జార్ లో వేయించి చల్లారిన పూర్తిగా చల్లారిన పప్పులు అన్నీ వేసి, మఖానా,యాలకలు, సోంపు కూడా వేసి మొత్తాన్ని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి.

-ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బార్లీ పిండి ఉన్న గిన్నెలోనే తర్వాత గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడిని వేసి మొత్తం కలిసేలా స్పూన్ లేదా గరిటతో కలుపుకోవాలి.

-పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పొడిని తడిలేని గాజు సీసాలో నిల్వ చేసుకోండి. బయట ఉంచితే నెల వరకు, ఫ్రిజ్ లో ఉంచితే దాదాపు ఏడాది వరకు ఫ్రెష్ గా ఉంటుంది.

-మీకు బ్రేక్ ఫాస్ట్ కావాలనున్న ఒక గిన్నెలో ఈ పిండిని కొద్దిగా వేసి అందులో నీళ్లు పోసి కలిపి 10 నిమిషాలు నానబెట్టాలి.

-తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో అర లీటరు పాలు పోసి కలుపుతూ మరిగించాలి. పాలు మరగడం ప్రారంభమైన తర్వాత అందులో నానబెట్టిన బార్లీ మిక్స్ వేసి ఉడకనివ్వాలి.

-తర్వాత స్టవ్ ఆపేసి అది మనం తినగలిగినంత వేడిగా ఉన్నప్పుడు అందులో బెల్లం తురుము, కర్జూరం, కిస్మిస్ ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకుని తినేయడమే.

[ of 5 - Users]
Story first published: Monday, November 2, 2026, 19:58 [IST]
Desktop Bottom Promotion