క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో..

Posted By:

మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు, ప్రతిరోజూ ఏదో ఒక ఆకుకూరను భోజనంలో చేర్చుకోవడం వల్ల మనం ఎన్నో వ్యాధులకు దూరంగా ఉండవచ్చని. అయితే, కేవలం ఆకుకూరను మాత్రమే వండితే కొంతమంది పిల్లలు లేదా పెద్దలు ఇష్టపడకపోవచ్చు. అలాంటి వారికోసం ఆకుకూరలకు వివిధ రకాల పప్పు ధాన్యాలను జోడించి వండటం మన సంప్రదాయంలో వస్తున్న ఒక అద్భుతమైన పద్ధతి. ఈ కోవకు చెందినదే తోటకూర అలసందల వేపుడు.

తోటకూర ఐరన్, విటమిన్లకు పెట్టింది పేరు కాగా, అలసందలుప్రోటీన్లకు మంచి మూలం. ఈ రెండింటి కలయికతో చేసే ఈ వేపుడు, అటు రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేడి అన్నంతో ఇది కలుపుకుని నెయ్యి వేసుకుని తింటుంటే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేరు. జొన్న రొట్టె, చపాతీలతో కలిపి తినడానికి కూడా బాగుంటుంది. తోటకూర అలసందల ఫ్రై ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Iron Protein Rich Thotakura Alasandala Fry Recipe in Telugu

కావాల్సిన పదార్థాలు

-తోటకూర
-అలసందలు
-ఉప్పు
-నూనె
-పసుపు
-ఆవాలు
-జీలకర్ర
-అల్లం
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-పచ్చి కొబ్బరి
-మినపప్పు
-ఉల్లిపాయ
-బెల్లం
-కొత్తిమీర

కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో

తయారీ విధానం

-ముందుగా 1/3 కప్పు అలసందలను రాత్రంతా నానబెట్టుకోవాలి.

-రాత్రంతా నానిన తర్వాత వాటిని కుక్కర్ లో వేసి,ఇందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేదాకా మీడియం మంట మీద ఉడికించాలి.

-అది ఉడికేలోగా, 2 కట్టల కొత్తిమీరను సన్నని తరిగి పక్కన పెట్టకోండి.

-తర్వాత మిక్సీ జార్ లో ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 5 పచ్చిమిరపకాయలు, ఒకటిన్నర ఇంచు అల్లం వేసి నీళ్లు పోయకుండా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. అందులో 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చెయ్యండి. అందులో 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ మినపప్పు, పావు టీస్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు వేసి అది నల్లబడి, మినపప్పు ఎర్రబడే వరకు వేయించాక అందులో 2 చిటికెళ్ల ఇంగువ వేసి కలిపాక అందులో రెండు రెబ్బల కరివేపాకు, అర కప్పు ఉల్లిపాయ తరుగు వేసి అది మెత్తడేదాకా వేపుకుంటే సరిపోతుంది వేయించాలి.

-ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత అందులో 4 పిడికెళ్ల తోటకూర తరుగు వేసి 4-5 నిమిషాలు ఆకుని మగ్గనివ్వాలి. తర్వాత అందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చిన్న బెల్లం గడ్డ వేసి ఆకు పూర్తిగా పసర వాసన పోయేదాకా మగ్గనివ్వండి.

-ఈలోగా, మెత్తగా ఉడికిన అలసందులలో నుంచి ముప్పావు భాగం అలసందలు తీసి పక్కన పెట్టుకోండి. మిగిలిన అలసందలను కచ్చాపచ్చగా మెదుపుకోండి.

-తోటకూర ఆకు మగ్గిన తర్వాత అందులో ఉడికించుకున్న అలసందలను అందులో వేసి కలుపుకోండి. తర్వాత అలసందలను మెదుపుకున్న మిశ్రమం వేసి కలుపుకోండి. తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న పచ్చికొబ్బరి మిశ్రమం వేసి కలిపి మూతపెట్టి 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి.

-తర్వాత మూత తీసి అందులో దండిగా కొత్తిమీర తరుగు వేసి కలపుకొని స్టవ్ ఆపేయండి. అంతే తోటకూర అలసందల ఫ్రై రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, November 2, 2026, 22:47 [IST]
Desktop Bottom Promotion