Latest Updates
-
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
వందేళ్ల తర్వాత 4 మహారాజయోగాలు - ఆ రాశుల వారికి డబ్బే డబ్బు, అద్భుతమైన పదవులు కూడా!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా సంచారం చేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా రాశులను మార్చుకుంటూ శుభ, అశుభ యోగాలను సృష్టిస్తాయి. దీని ప్రభావం మానవ జీవితంపై మిరుయు భూమిపై ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దాదాపు వంద సంవత్సరాల తర్వాత నాలుగు మహా రాజయోగాలు ఏర్పడ్డాయి. ఈ రాజయోగాల పేర్లు బుధాదిత్య రాజయోగం, శష్ మహాపురుష రాజయోగం, కేంద్ర త్రికోణ రాజయోగం మరియు శుక్ర, శని కుజ గ్రహాల సంసప్తక రాజయోగం ఏర్పడనున్నాయి. ఈ నాలుగు రాజయోగాలు.. శుభ, అశుభ ఫలితాలను అందించనున్నాయి. వీటి ప్రభావం అన్ని గ్రహాలపై ఉంటుంది. ఒక్కో రాజయోగం వల్ల కొన్ని రాశులు ఉత్తమ ఫలితాలు అందుకోబోతున్నాయి.

తలపెట్టిన పనిలో విజయం సాధించడం, అదృష్టం కలిసి రావడం, కలహాలు, గొడవలు తగ్గడం, కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరగడం, ఆర్థిక సమస్యలు తీరిపోవడం లాంటి ప్రయోజానాలు అందుకోబోతున్నాయి కొన్ని రాశులు. మరి ఆ రాశుల వారు ఎవరు, వారు అందుకోబోయే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి
ఇప్పుడు ఏర్పడనున్న నాలుగు మహా రాజయోగాల వల్ల వృషభ రాశి వారికి కాలం కలిసి రానుంది. అనుకూల సమయంలో ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. సూర్యుదేవుడి అనుగ్రహం ఈ సమయంలో వృషభ రాశి వారికి లభిస్తుంది. దీని వల్ల ఆనందంగా ఉంటారు. అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దీంతో పాటు 3వ ఇంట్లో బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. శష మహాపురుష రాజయోగం, కేంద్ర త్రికోణ రాజయోగం, శుక్ర శని కుజ గ్రహా సంసప్తక్ రాజయోగం వల్ల కూడా వృషభ రాశి వారు చాలా లాభపడనున్నాయి.
ఈ సమయంలో కొత్త ఆస్తులు సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాహన యోగం కూడా ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్న వృషభ రాశి వారికి ఈ సమయంలో పదోన్నతులు, సహోద్యోగులు ఉన్నతోద్యోగుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పడే కష్టానికి రెట్టింపు ప్రయోజనం లభిస్తుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోగలిగితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వృశ్చిక రాశి
నాలుగు రాజయోగాల వల్ల వృశ్చిక రాశి వారు అనేక ప్రయోజనాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి ఇది అద్భుత సమయం. బుధాదిత్య రాజయోగం వల్ల వృశ్చిక రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. తలపెట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి అదృష్ట స్థానంలో ఉండటం వల్ల అన్నింటిలో విజయాలను అందుకుంటారు. గత ప్రయత్నాల నుంచి కూడా ప్రస్తుత కాలంలో ప్రయోజనాలు అందుకుంటారు. ధైర్యం తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను అందిస్తాయి. ఈ సమయంలో విదేశీ ప్రయాణ యోగ్యం కూడా ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు పదాల ఎంపిక సరిగ్గా ఉండేలా చూసుకుంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి నాలుగు రాజయోగాలు ఏర్పడే కాలం అదృష్టాన్ని, అద్బుతమైన ఫలితాలను తీసుకువస్తుంది. 6వ ఇంటిపై బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. దీంతో పాటు శష, సంసప్తక, కేంద్ర త్రికోణ రాజయోగాలు కుంభ రాశి వారుకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రాజయోగాల కాలంలో కోర్టు కేసుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో వృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రశంసలు, పదోన్నతులు లభించి ఆనందంగా ఉంటారి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications