Latest Updates
-
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ!
ఇంట్లో తరచూ గొడవలవుతున్నాయా? జస్ట్ ఇలా చేస్తే అన్నీ సుఖాలే,ప్రతి రోజూ పండగే
ప్రతి వ్యక్తి తన కుటుంబంలో ఆనందం, శాంతి, ప్రేమను కోరుకుంటాడు. అయితే కొన్నిసార్లు అవాంఛనీయ పరిస్థితుల కారణంగా కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తుతాయి. కుటుంబంలో పరస్పర ప్రేమ,శాంతిని కొనసాగించడంలో కొన్ని వాస్తు చర్యలు సహాయడతాయి. మన జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు పరిష్కారాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయని చెబుతారు. కాబట్టి వాస్తు శాస్త్రంలో సూచించిన విధంగా చర్యలు చేపడితే మీ ఇంట్లో తగదాలు ఉండవు..శాంతి,ఆనందం నెలకొంటుంది.
వాస్తు చర్యలతో మీరు అనుకున్నట్లుగా విషయాలు తిరిగి ట్రాక్‌లోకి వస్తాయి. ఇంట్లో సంపద, సంతోషం,శాంతికి ఎప్పటికీ కొరత ఉండదు. కాబట్టి మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ అశాంతి వాతావారణం ఉంటుంటే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఏం చేయాలో ఇక్కడ చూడండి.

ఇలా చేస్తే ఇంట్లో శాంతి,సంతోషం
-వైవాహిక జీవితంలో ఆనందం,శాంతి కోసం పడకగదిలో ఒక మూలలో రాతి లేదా వదులుగా ఉండే ఉప్పును ఉంచండి. ప్రతి నెలా దీనిని మార్చండి. ఈ రెమెడీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుంది.
-వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి నైరుతి దిశలో త్రిభుజాకార వస్తువు లేదా పెయింటింగ్ ఉండకూడదు. వాస్తు దోషాలు కలిగించే వీటిని వెంటనే తొలగించాలి.
-ఇంటి ఈశాన్య మూలలో గంగాజలాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ,సామరస్యం నెలకొంటాయి.
-గౌతమ బుద్ధుని పెయింటింగ్ లేదా చిన్న విగ్రహాన్ని ఉంచడం వల్ల సానుకూల శక్తి వస్తుంది,ఇంట్లో శాంతిని కాపాడుతుంది.
-నైరుతి దిశలో ఉన్న గదిలో ఎరుపు రంగు పెయింటింగ్ ఉన్నట్లయితే దానిని మార్చాలి. ఇది కాకుండా ఇంట్లో యుద్ధం లేదా పోరాట చిత్రాలు ఉండకూడదు,ఎందుకంటే అవి ప్రతికూలతను ప్రోత్సహిస్తాయి.
-ప్రతి నెలలో ఒక సోమవారం నాడు అన్నం పాయసం నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులందరితో కలిసి తినండి. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
