నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే!

ఈ రోజుల్లో చాలామందికి ఉన్న కామన్ ప్రాబ్లమ్. వెన్ను నొప్పి లేదా నడుము నొప్పి. ఈ సమస్యకు కారణాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా గంటల సేపు కుర్చీలో లేవకుండా కూర్చోడం, ఫోన్ చూస్తూ ముందుకు వంటి కూర్చోడం మన లైఫ్ లో భాగం అయ్యాయి. అయితే ఈ చిన్న అలవాట్లే వెన్నుముకపై ఎంత తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయో చాలామంది గుర్తించలేరు.వీటి ఫలితంగానే నడుం నొప్పి, వీపులో అసౌకర్యం, కండరాల బిగుతు.

అయితే మీ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఈ నొప్పి రాకుండా తప్పించుకోవచ్చు. వెన్నెముక ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే 5 అలవాట్లను వెంటనే మీ దినచర్యలో చేర్చుకోండి.

Say Goodbye to Back Pain 5 Habits for a Strong Healthy Spine

కండరాలకు పని

వెన్నెముక సురక్షితంగా ఉండాలంటే దానికి పునాదిగా ఉండే వీపు, నడుము, కోర్ (పొట్ట) కండరాలు దృఢంగా ఉండాలి. వారానికి కనీసం రెండు లేదా మూడు రోజులు ఈ కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయండి. అయితే మొదటి రోజే కఠినమైన వర్కౌట్స్ చేయొద్దు. మీ శరీర సామర్థ్యాన్ని బట్టి నెమ్మదిగా మొదలుపెట్టి, క్రమంగా వ్యాయామ తీవ్రతను పెంచండి.

ఎముకలకు పోషకాల ఫుడ్

కేవలం వ్యాయామం మాత్రమే కాదు, మనం తీసుకునే ఆహారం కూడా వెన్నెముక ఆరోగ్యాన్ని శాసిస్తుంది. మీ రోజువారీ డైట్‌ లో కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉండేలా చూసుకోండి. పాలు, పెరుగు, పన్నీర్ వంటివి ఎముకలకు అవసరమైన కాల్షియాన్ని అందిస్తే.. కోడిగుడ్లు, పప్పు ధాన్యాలు, చేపలు, కొవ్వు లేని మాంసం కండరాలకు కావాల్సిన ప్రోటీన్‌ ను ఇస్తాయి. ఈ బ్యాలెన్స్ ఫుడ్ వెన్నెముకకు శ్రీరామరక్ష.

కుర్చీకి అతుక్కుపోకండి

ఆఫీసు పనిలో పడి గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చుంటున్నారా? ప్రతి అరగంటకోసారి సీట్లోంచి లేచి రెండు నిమిషాలు అటూ ఇటూ నడవండి. వీలైతే తేలికపాటి స్ట్రెచింగ్ చేయండి. మీ కూర్చునే భంగిమను తరచూ మారుస్తూ ఉండండి. శరీరానికి ఎప్పటికప్పుడు కదలిక ఇవ్వడమే అత్యుత్తమమైన భంగిమ అని నిపుణులు సూచిస్తున్నారు.

నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే..నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే..

నడకతో నూతనోత్సాహం

మన శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడానికి నడకను మించిన సులభమైన మార్గం మరొకటి లేదు. రోజూ కనీసం 8000 అడుగులు నడవాలని లక్ష్యంగా పెట్టుకోండి. దీనివల్ల గుండె ఆరోగ్యంతో పాటు బరువు అదుపులో ఉంటుంది. అసలు నడిచే అలవాటే లేనివారు, ముందుగా కొద్ది దూరంతో ప్రారంభించి, నెమ్మదిగా మీ అడుగుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లడం ఉత్తమం.

బరువుపై పూర్తి నియంత్రణ

మీ శరీర బరువు పరిమితి దాటితే, ఆ అదనపు భారం మొత్తం నేరుగా వెన్నెముకపైనే పడుతుంది. కాబట్టి సరైన వ్యాయామం, ఆహార నియమాలతో బరువును అదుపులో ఉంచుకోండి. అలాగే బరువైన వస్తువులను పైకి ఎత్తేటప్పుడు నడుమును వంచకండి. దానికి బదులుగా మీ మోకాళ్లు, తుంటిని మడిచి వస్తువును శరీరానికి దగ్గరగా పట్టుకుని పైకి లేవండి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, November 4, 2026, 15:10 [IST]
Desktop Bottom Promotion