Latest Updates
-
దీపావళి స్పెషల్.. రొటీన్ కు భిన్నంగా నోరూరించే గుంటూరు చికెన్ రోస్ట్.. ఈజీగా చేసుకోండిలా.. -
నువ్వు దేవుడివి సామీ: ఉద్యోగులకు దీపావళి బోనస్ గా 20 లక్షల రూపాయలు ఇచ్చిన వ్యాపారి..వీడియో చూడండి -
డాక్టర్ హెచ్చరిక..సైలెంట్ గా కాలుతాయి కదా అని ఈ 3 టపాసులు పిల్లలకు ఇస్తే పెను ప్రమాదమే! -
ఎముకలను బలపరిచే పోషకాల నిధి.. దీపావళి పండుగ స్పెషల్ గా పెసరపప్పు పాయసం చేయండిలా.. -
Diwali 2026 Wishes in Telugu: మీ బంధుమిత్రులకు ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా.. -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ భుర్జీ మసాలా గ్రేవీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
బంగాళదుంపతో ఇలా దోశ వేస్తే రుచికి ఫిదా అవ్వాల్సిందే.. తయారీ విధానం ఇదే.. -
మీ జీర్ణవ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందనడానికి 10 సంకేతాలివే -
అతిథులను ఆశ్చర్యపరిచే అద్భుతమైన దీపావళి స్వీట్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? మందులు లేకుండా ఈ 3 సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి!
దీపావళి స్పెషల్..బ్యాచిలర్స్ కూడా సులభంగా వండేలా.. అదిరిపోయే పొల్లాచి చికెన్ బిర్యానీ చేసుకోండిలా..
దీపావళి నాడు ప్రతిసారీ చేసుకునే సాధారణ బిర్యానీ కాకుండా కాస్త కొత్తగా, ఎంతో రుచికరంగా ఉండే పొల్లాచి స్టైల్ చికెన్ బిర్యానీ ట్రై చేయండి. మీరు నిజమైన బిర్యానీ ప్రియులైతే మాత్రం జీవితంలో ఒక్కసారైనా ఈ పొల్లాచి బిర్యానీ రుచి చూడాల్సిందే. దీని ప్రత్యేకత ఏమిటంటే.. రెగ్యులర్ బిర్యానీల కంటే దీని రుచి, సువాసన పూర్తిగా భిన్నంగా, అద్భుతంగా ఉంటాయి. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా, పర్ఫెక్ట్ గా దీనిని వండేయొచ్చు. పొల్లాచి స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో, దానికి ఏమేం కావాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
మసాలా పొడి కోసం కావలసినవి:
దాల్చినచెక్క - 15 గ్రాములు
లవంగాలు - 6
అనాస పువ్వు (పైనాపిల్ పువ్వు) - 1
మరాఠీ మొగ్గ- అర టీస్పూన్
యాలకులు - 3
సోంపు - 1 టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
మసాలా పేస్ట్ కోసం:
సాంబార్ ఉల్లిపాయలు- 100 గ్రాములు
వెల్లుల్లి - 50 గ్రాములు
అల్లం - 50 గ్రాములు
పచ్చిమిర్చి - 25 గ్రాములు
బిర్యానీ తయారీకి కావలసినవి:
జీలకర్ర సంబా బియ్యం (సీరగ సంబా రైస్) - 500 గ్రాములు
చికెన్ (ఎముకలతో ఉన్నది) - 500 గ్రాములు
వేరుశెనగ నూనె - 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
పెద్ద ఉల్లిపాయలు - 2
టమాటాలు - 2
తరిగిన పుదీనా ఆకులు - 25 గ్రాములు
తరిగిన కొత్తిమీర - 25 గ్రాములు
గట్టి పెరుగు - 1 కప్పు
కొబ్బరి పాలు - 1.5 (ఒకటిన్నర) కప్పులు
నిమ్మకాయ - సగం (రసం తీయాలి)
ఉప్పు - రుచికి తగినంత
నీళ్లు - సరిపడా

తయారీ విధానం
-ముందుగా జీలకర్ర సంబా బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి, అరగంట పాటు నానబెట్టుకోవాలి.
-మిక్సీ జార్ తీసుకుని మసాలా పొడి కోసం చెప్పిన దినుసులన్నీ వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. అదే జార్ లో చిన్న ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి కొద్దిగా గరుకుగా (కచ్చాపచ్చాగా) పేస్ట్ చేసుకోవాలి.
-మందపాటి అడుగు ఉన్న ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టి, అందులో వేరుశెనగ నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ నూనెలో తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి లేత బంగారు రంగులోకి మారేంత వరకు మీడియం మంటపై వేయించాలి.
-తర్వాత అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయల పేస్ట్ వేసి 4 నుండి 5 నిమిషాల పాటు వేయించాలి. మసాలా పచ్చివాసన పోయి, నూనె పైకి తేలేవరకు వేగనివ్వాలి. ఆ తర్వాత తయారుచేసుకున్న మసాలా పొడి వేసి మరో రెండు నిమిషాలు కలపాలి.
-2 నిమిషాల తర్వాత టమాటా పేస్ట్ వేసి ఒక నిమిషం మగ్గనివ్వాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి. తర్వాత గట్టి పెరుగు వేసి మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఎముకలున్న చికెన్ ముక్కలను వేసి మసాలా అంతా పట్టేలా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు, అర లీటరు నీళ్లు పోసి మూతపెట్టి, తక్కువ మంటపై 15 నిమిషాలు ఉడికించాలి.
దీపావళి స్పెషల్.. రొటీన్ కు భిన్నంగా నోరూరించే గుంటూరు చికెన్ రోస్ట్.. ఈజీగా చేసుకోండిలా..
-చికెన్ ఉడికిన తర్వాత, అందులో కొబ్బరి పాలు, నిమ్మరసం, మరో అర లీటరు నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఎసరు మరుగుతున్నప్పుడు, నీటిని వంపేసిన బియ్యాన్ని గిన్నెలో వేసి నిదానంగా కలపాలి.
-బియ్యం వేసాక మళ్లీ ఉడకడం ప్రారంభమవ్వగానే, గిన్నెకు ఆవిరి పోకుండా మూత పెట్టాలి. బియ్యాన్ని 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. మూత వెంటనే తీయకుండా ఒక 20 నిమిషాల పాటు బిర్యానీని అలాగే వదిలేయాలి.
-20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే..ఇల్లంతా సువాసనలు వెదజల్లే వేడివేడి, నోరూరించే పొల్లాచి స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
