టపాసుల నిప్పురవ్వలు పడి చర్మం కాలితే వెంటనే చేయాల్సిన, చేయకూడని పనులివే!

దీపావళి పండుగ రోజున రాత్రి భారతీయులకు టపాసులు కాల్చడ్ం అలవాటు. కేవలం అతికొద్ది మాత్రమే పర్యావరణ హితంగా దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. అయితే టపాసులు కాల్చే క్రమంలో ప్రతి ఏటా కొన్ని చిన్న పొరపాట్లు, ప్రమాదాలు, వ్యాధుల కారణంగా చాలామంది అనారోగ్యాల బారిన పడుతున్నారు, గాయాల పాలవుతున్నారు, మరికొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.

అయితే టపాసులు కాల్చడం వల్ల వచ్చే పొగ, నిప్పురవ్వలు, రసాయనాలు మన చర్మానికి హాని కలిగిస్తాయి. ఒక్క చిన్న నిప్పురవ్వ తగిలినా చర్మం తీవ్రంగా కమిలిపోయే ప్రమాదం ఉంది. మరి ఈ దీపావళిని ఎలాంటి చర్మ సమస్యలు లేకుండా సురక్షితంగా ఎలా జరుపుకోవాలో, కాలిన గాయాలకు ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలో వైద్య నిపుణులు అద్భుతమైన చిట్కాలను అందించారు.

Diwali 2026 Firecracker Safety Immediate First Aid for Skin Burns You Must Know

ప్రమాదవశాత్తు చర్మం కాలితే ఏం చేయాలి?

నిప్పురవ్వ పడి చర్మం కాలిన వెంటనే కంగారు పడకుండా, ఆ భాగాన్ని 20 నిమిషాల పాటు చల్లటి నీటి ధార (ట్యాప్ వాటర్) కింద ఉంచాలి. దీనివల్ల లోపలి చర్మం దెబ్బతినకుండా ఉంటుంది.

వాపు రాకముందే చేతికి ఉన్న ఉంగరాలు, గడియారాలు, బిగుతుగా ఉన్న దుస్తులను తీసేయాలి. అయితే చర్మానికి అంటుకుపోయిన బట్టలను మాత్రం బలవంతంగా లాగకండి.

ఇవి అస్సలు రాయకండి

కాలిన గాయాలపై ఐస్, టూత్‌పేస్ట్, పసుపు, కొబ్బరి నూనె, నెయ్యి లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పూయకూడదు. ఇవి మాన్పించకపోగా ఇన్ఫెక్షన్‌ కు దారితీస్తాయి. గాయాన్ని శుభ్రమైన కాటన్ వస్త్రంతో కప్పండి. బొబ్బలు వస్తే చిదపకూడదు, అవి ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకునే సహజ కవచాలు.

దురద, ఎలర్జీ వస్తే..

టపాకాయల పొగలోని రసాయనాల వల్ల చర్మం ఎర్రబడటం, దురద, దద్దుర్లు వస్తాయి. సున్నితమైన చర్మం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. దురద అనిపిస్తే చర్మాన్ని గోకకుండా, శుభ్రమైన నీటితో మెల్లగా కడగాలి. రసాయనాలున్న సబ్బులు వాడొద్దు.

దీపావళి స్పెషల్..బ్యాచిలర్స్ కూడా సులభంగా వండేలా.. అదిరిపోయే పొల్లాచి చికెన్ బిర్యానీ చేసుకోండిలా..దీపావళి స్పెషల్..బ్యాచిలర్స్ కూడా సులభంగా వండేలా.. అదిరిపోయే పొల్లాచి చికెన్ బిర్యానీ చేసుకోండిలా..

డాక్టర్ దగ్గరకు ఎప్పుడు వెళ్లాలి?

గాయం పెద్దదిగా ఉన్నా, చర్మం నల్లగా, తెల్లగా లేదా స్పర్శ లేకుండా మారినా వెంటనే హాస్పిటల్ కి వెళ్లాలి. ముఖం, కీళ్ళు, చేతులు, పాదాలు, మర్మాంగాల దగ్గర కాలితే ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు. పిల్లలు, వృద్ధుల విషయంలో వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

బాణసంచా కాల్చేటప్పుడు మందపాటి, నిండు చేతులున్న కాటన్ దుస్తులనే ధరించాలి. చేతులతో కాకుండా, పొడవాటి అగరబత్తి లేదా పుల్లతో సురక్షితమైన దూరం నుంచి బాణసంచా వెలిగించాలి. వేడుకలు పూర్తయ్యాక, పొగ బారిన పడిన చర్మాన్ని శుభ్రమైన నీటితో కడుక్కోవాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Sunday, November 8, 2026, 18:42 [IST]
Desktop Bottom Promotion