Latest Updates
-
డాక్టర్ హెచ్చరిక..సైలెంట్ గా కాలుతాయి కదా అని ఈ 3 టపాసులు పిల్లలకు ఇస్తే పెను ప్రమాదమే! -
ఎముకలను బలపరిచే పోషకాల నిధి.. దీపావళి పండుగ స్పెషల్ గా పెసరపప్పు పాయసం చేయండిలా.. -
Diwali 2026 Wishes in Telugu: మీ బంధుమిత్రులకు ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా.. -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ భుర్జీ మసాలా గ్రేవీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
బంగాళదుంపతో ఇలా దోశ వేస్తే రుచికి ఫిదా అవ్వాల్సిందే.. తయారీ విధానం ఇదే.. -
మీ జీర్ణవ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందనడానికి 10 సంకేతాలివే -
అతిథులను ఆశ్చర్యపరిచే అద్భుతమైన దీపావళి స్వీట్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? మందులు లేకుండా ఈ 3 సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి! -
బ్రెడ్ లేకుండా బ్రెడ్ పకోడీ చేయడం ఎలా? టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే.. -
బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా?
నువ్వు దేవుడివి సామీ: ఉద్యోగులకు దీపావళి బోనస్ గా 20 లక్షల రూపాయలు ఇచ్చిన వ్యాపారి..వీడియో చూడండి
దీపావళి పండుగ అనగానే చాలా కంపెనీలు, యజమానులు తమ దగ్గర పనిచేసే వ్యక్తులకు స్వీట్లు, బట్టలు వంటివి గిఫ్ట్ గా ఇస్తుండటం చూస్తుంటాం. కొన్ని కంపెనీలు అంటే ఒక నెల జీతం కూడా బోనస్ గా ఇస్తుంటారు. అయితే ఒక వ్యాపారి మాత్రం తన ఉద్యోగులను కన్నబిడ్డల్లా భావించి వారికి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలను బోనస్ గా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అసలు ఇది ఎక్కడ జరిగింది, పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
గుజరాత్ రాష్ట్రంలో పండుగల సమయంలో చాలా వ్యాపారులు తమ ఉద్యోగులకు కార్లు, బైక్ లు, ఇళ్లు వంటివి గిఫ్గ్ లుగా ఇస్తుండటం తరచుగా చూస్తుంటాం. తాజాగా దీపావళి పండుగ సందర్భంగా సూరత్ లో బట్టల వ్యాపారం చేసే రామ్ స్వరూప్ ముండే తన షాపులో పనిచేసే 20 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల డబ్బులు ఇచ్చారు.

మొదట ఉద్యోగులందరికీ దీపావళి స్వీట్లను గిఫ్ట్ బాక్స్ గా ఇచ్చిన రామ్ స్వరూప్ తర్వాత ఒక పెద్ద వెండి ప్లేట్ లో పెట్టిన డబ్బు నోట్ల కట్టలను తన భార్య చేతుల మీదుగా ఉద్యోగులకు అందించారు. ఈ సమయంలో ఉద్యోగులు ఎమోషనల్ అయ్యారు. ఆనందభాష్పాలతో తమ యజమానిని హత్తుకున్నారు, ఆశీర్వాదం తీసుకున్నారు. తమ జీవితంలో ఇది మర్చిపోలేని దీపావళి అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
రామ్ స్వరూప్ పేదరికంలో పుట్టి తర్వాత వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకున్నాడని తెలుస్తోంది. కాబట్టే అతనికి పండుగల సమయాల్లో కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక కష్టాల గురించి బాగా తెలుసని అర్థమవుతోంది. ఉద్యోగుల పట్ల ఆ వ్యాపారి ప్రేమాభిమానులు చూడండంటూ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆయన గ్రేట్, అలాంటోళ్లు యజమానిగా ఉండే జీవితాంతం సంతోషంగా ఉంటదంటూ నెటిజన్లు ఆయనను పొగుడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కన్న తండ్రిలా ఆదరించే ఆ ఓనర్ దోరకడం ఉద్యోగుల అదృష్టం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications
