జులై 31 లోపు ఏకాదశిలో సింహరాశి వారికి జరగబోయేది ఇదే.. ముందే తెలుసుకోండి..!!

సింహ రాశి వారికి ఏకాదశి లోపుగా మీ జీవితంలో మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ ఏకాదశి నుండి సింహ రాశి వారికి అన్ని విధాల అనుకూలంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఐదు అతిపెద్ద సమస్య ల నుండి కచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. ఈ సమస్య నుండి బయట పడటం వల్ల సింహ రాశి వారు మానసికంగా ఎంతో ఆనందంగా ఉంటారు. జీవితంలో ప్రశాంతత ఏర్పడిందనే భావన కనిపిస్తోంది. సింహ రాశి వారిని గమనించినట్లయితే వీరు పైకి చూడ్డానికి గంభీరంగా కనిపించినప్పటికీ లోపల సున్నితమైన మనస్తత్వం అనేది ఉంటుంది.

Good days coming for Leo zodiac sign people before July 31 2024

విద్యార్ధులకి ఈ సమయంలో విద్య పరంగా బాగా కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏకాగ్రత అనేది పెరుగుతుంది. చదివిన కొంతసేపటికి ఏదైనా గుర్తుపెట్టుకుంటారు. విద్యపై కంటే ఎక్కువగా కళలపై ఆసక్తి చూపించే అవకాశం కనిపిస్తోంది.కళలో మంచి ప్రావిణ్యం సంపాదించుకుంటారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాలు కొరకు ఇతర దేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో. అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగడం వల్ల ఆనందంగా ఉంటారు. సింహ రాశి వారు కచ్చితంగా మంచి పేరు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. రాజకీయ పరంగా ఈ సమయంలో అతి పెద్ద సమస్య అయితే తొలగిపోతుంది. రాజకీయంలో మీరు కోరుకున్న పదవులు స్థానాలు రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. రాజకీయ పరంగా అనుచరుల బలం ప్రజా బలాన్ని పెంచుకుంటారు.

ఉద్యోగపరంగా మాత్రం మీరు చాలావరకు అనుకూలమైన మార్పులు చూస్తారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రదేశంలో పై అధికారుల పెట్టే సమస్యలు తొలగిపోతాయ్. పరిశ్రమల విషయంలో మాత్రం సింహ రాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. పరిశ్రమలకు సంబంధించి సమయంలో కోర్టు సంబంధిత తగాదాలు కొంచెం అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. అలానే పరిశ్రమలకు సంబంధించి మాత్రం మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల భారీ నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే చేసే ప్రతి పనిని నిర్ణయించుకొని పార్ట్ నర్ తో లేదా మీకు ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

వ్యాపారంలో అనుకున్న విధంగా అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారపరంగా ఎంతో కాలంగా మీరు వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్చడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏవో కారణాల వల్ల నిరంతర ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి. ఈ సమయంలో వ్యాపార మార్పు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నూటికి 100% అనుకూలిస్తాయి. వ్యాపార పరంగా కూడా మీకు మంచి స్నేహితులు పరిచయం అవుతారు. కొన్ని రుణాలు, గృహ సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. సింహరాశివారు ఆరోగ్య పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఆరోగ్యం విషయంలో ఈ మాసమంతా కూడా మిశ్రమంగానే ఉండబోతోంది. మొదట చిన్న చిన్న వ్యాధులుగా మారి తర్వాత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం అస్సలు అశ్రద్ధ చేయవద్దు.

వివాహం విషయంలో మాత్రం జాగ్రత్తగానే ఉండాలి. వివాహపరంగా కోరుకున్న లక్షణాలున్న జీవిత భాగస్వామి దొరుకుతుంది. కానీ వివాహ పరంగా కొంతమంది వ్యక్తులు మాత్రం అవమానించే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారు వీలైనంత వరకూ కూడా మౌనంగా ఉండటం మంచిది. ఈ సమయంలో కొంత మంది మీపై ఎక్కువగా టార్గెట్ చేయడం జరుగుతుంది.

సింహరాశికి సంబంధించి కుటుంబపరంగా బాగానే కలిసి వస్తోంది. కుటుంబ సభ్యులు అందరూ ఒక మాట మీద నడవడం జరుగుతుంది. ఈ రాశి సంబంధించి వంశపారంపర్య ఆస్తులకు సంబంధించి ఏవైనా కోర్టులో వివాదాలు ఉన్నట్లయితే వాటికి తీర్పులు మీకు అనుకూలంగానే వస్తాయి. సింహరాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైనవారు ఉన్నారో. వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటు, వారి వల్ల మీకు వృత్తుల్లో అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఎంతోకాలంగా విడిపోయినట్టు వ్యక్తులు కలిసే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు సూర్యుడి యొక్క అనుకూలత వరకు సింహ రాశి వారు ప్రతిరోజు కూడా సూర్యనమస్కారం చేసుకోవడం వల్ల గ్రహ బలం పెరగడంతోపాటు ఆరోగ్య పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Wednesday, July 24, 2024, 19:21 [IST]
Desktop Bottom Promotion